AP Govt Jobs: 461 ఉద్యోగాలకు నోటిఫికేషన్ - దరఖాస్తులు ప్రారంభం-ap govt issued notification for 461 staff nurse jobs 2022 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Govt Issued Notification For 461 Staff Nurse Jobs 2022

AP Govt Jobs: 461 ఉద్యోగాలకు నోటిఫికేషన్ - దరఖాస్తులు ప్రారంభం

HT Telugu Desk HT Telugu
Nov 30, 2022 07:30 AM IST

461 staff nurse jobs in ap: నర్సింగ్‌ అభ్యర్థులకు ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. ప్రభుత్వాస్పత్రుల్లోని 461 స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

స్టాఫ్‌ నర్సు పోస్టులకు నోటిఫికేషన్‌
స్టాఫ్‌ నర్సు పోస్టులకు నోటిఫికేషన్‌

Staff Nurse Notification in Andhrapradesh: ఏపీలోనూ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఒక్కొక్కటిగా వచ్చేస్తున్నాయి. పోలీస్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన రాగా... తాజాగా బీఎస్సీ నర్సింగ్‌ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ సర్కార్. ప్రభుత్వాస్పత్రుల్లోని 461 స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదలైంది. ఇవాళ్టి నుంచే (నవంబర్ 30) దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్‌ 5ను తుది గడువుగా నిర్ణయించారు. http://cfw.ap.nic.in వెబ్‌సైట్‌ ద్వారా ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

ముఖ్య వివరాలు

పోస్టులు పేరు - స్టాఫ్ నర్సులు

మొత్తం ఖాళీలు - 461

దరఖాస్తులు ప్రారంభం - నవంబర్ 30, 2022

చివరి తేదీ - డిసెంబర్ 5, 2022

అర్హతలు - జీఎన్‌ఎం/బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసి 42 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్‌–సర్వీస్‌మెన్‌లకు మూడేళ్లు, విభిన్న ప్రతిభావంతులకు 10 ఏళ్ల పాటు వయోపరిమితి నుంచి సడలింపు ఉంటుంది.

ఫీజు - ఓసీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుమును రూ.500గా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు రూ.300 చెల్లించాలి.

మెరిట్‌ ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక ఉంటుందని వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. కొవిడ్, కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ తదితర ఇతర వెయిటేజ్‌లు వర్తిస్తాయని నోటిఫికేషన్ లో పేర్కొంది. నాలుగు జోన్‌ల వారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకుని డిసెంబర్‌ 6వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా వైద్య, ఆరోగ్య శాఖ రీజనల్‌ డైరెక్టర్‌ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.

ఇప్పటికే ప్రభుత్వాస్పత్రుల్లో నియమాకాలపై సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో మానవ వనరుల కొరతకు తావివ్వకుండా చూడాలని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా 2019 నుంచి 46 వేలకు పైగా పోస్టుల భర్తీని చేపట్టింది.

NOTE: ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలను కింద ఇచ్చిన పీడీఎఫ్ లో చూడొచ్చు…

IPL_Entry_Point