AP Scholarships : కాలేజీ విద్యార్థులకు గుడ్‌న్యూస్, పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులు స్వీకరణ
AP Scholarships : కాలేజీ విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2024-25 విద్యా సంవత్సరానికి పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలకు అర్హత గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు నవంబర్ 30 వరకు గడువు విధించింది.
కాలేజీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు సంబంధించి కొత్తవారు, రెన్యువల్ చేసుకునేవారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించింది. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు నవంబర్ 30 వరకు గడువు విధించింది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను కళాశాలలో చదువుతున్న వారిలో పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలకు అర్హత గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
విద్యార్థులు తమ కళాశాల యాజమాన్యంతో సంప్రదించి జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సింది. విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత కళాశాలలో, స్థానిక సచివాలయంలో లేదా సంక్షేమ శాఖల కార్యాలయంలో సంప్రదించవచ్చు. పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్, రెన్యువల్ చేయడానికి https://jnanabhumi.ap.gov.in/ పోర్టల్ కళాశాల లాగిల్‌లో పొందుపరచాలి.
దరఖాస్తు ఎలా చేయాలి?
1. పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు తొలిత అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ https://jnanabhumi.ap.gov.in/downloads/Jnanabhumi_Application.pdf లింక్‌ను క్లిక్ చేస్తే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దాన్ని ప్రింట్ తీసుకోవాలి.
2. అప్లికేషన్ ఫారం పూరించాలి. అటెస్టడ్ కాపీని కాలేజీ ప్రిన్సిపల్‌కు సమర్పించాలి.
3. కాలేజీ ప్రిన్సిపల్ అప్లికేషన్‌ను ధ్రువీకరిస్తారు. అలాగే అడ్మిషన్ సమయంలో జ్ఞానభూమి ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించిన అంశాలతో పూర్తి చేస్తారు. విద్యార్థి తన దరఖాస్తును విజయవంతంగా సమర్పించినట్లు నిర్ధారిస్తూ ఎస్ఎంఎస్ వస్తుంది.
4. విద్యార్థి మీ సేవా కేంద్రాన్ని సందర్శించి, తన దరఖాస్తు ఫారంను ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేయడానికి ఆయన జ్ఞానభూమి అప్లికేషన్ ఐడీ, ఆధార్ నంబర్‌ను అందించాలి. విద్యార్థి వివరాలను ధ్రువీకరించి, అవసరమైతే సవరణలు చేస్తారు. అప్పుడు విద్యార్థి బయోమెట్రిక్ అథాంటికేషన్ కోసం దరఖాస్తును సబ్మిట్ చేస్తారు.
5. అదే రెన్యువల్ అప్లికేషన్ అయితే ప్రస్తుత సంవత్సరం విద్యార్థి ప్రవేశ తేదీ, గతేడాది పరీక్ష హాల్ టిక్కెట్టు, రోల్ నంబర్ ద్వారా అప్లై చేస్తారు. వీటిని కాలేజీ ప్రిన్సిపల్ ధ్రువీకరించిన తరువాత, అప్లికేషన్ దాఖలు చేస్తారు. అప్లికేషన్ విజయవంతం అయితే, విద్యార్థికి ఎస్ఎంఎస్ వస్తోంది.
6. విద్యార్థి అప్లికేషన్ వివరాలు చూసిన తరువాత, కాలేజీలో బయో మెట్రిక్ అథాంటికేషన్ చేస్తారు.
స్కాలర్ షిప్స్ ఎవరికి ఇస్తారు?
1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీ, వికలాంగ వర్గాలకు చెందిన అర్హులైన విద్యార్థులందరికీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల పథకాన్ని అమలు చేస్తుంది.
2. అర్హత గల ప్రతి విద్యార్థికి పూర్తి ఫీజు రీయంబర్స్‌మెంట్ అందిస్తుంది.
3. ఐటీఐ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులకు ఒక్కొక్కరికి రూ.20 వేలు ఇస్తారు.
4. 75 శాతం హాజరు ఉండాలి.
5. కుటుంబ ఆదాయం రూ.2.50 లక్షలు, లేదా దానికంటే తక్కువ ఉండాలి.
6. కుటుంబ మొత్తం భూమి పది ఎకరాలు కంటే తక్కువ ఉండాలి.
7. కుటుంబ సభ్యుడికి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం