ఆంధ్రప్రదేశ్ లో నామినేటెడ్ పోస్టుల భర్తీ కొనసాగుతోంది. ఇప్పటికే పలు పోస్టులను భర్తీ చేసిన ఏపీ ప్రభుత్వం...తాజాగా మరికొన్ని స్థానాలను భర్తీ చేసింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఆప్కాబ్) ఛైర్మన్‌గా ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత గన్ని వీరాంజనేయులు నియమితులయ్యారు.
ఏలూరు జిల్లా డీసీసీబీ (డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్) ఛైర్మన్‌గానూ గన్ని వీరాంజనేయులు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రకాశం జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌గా టీడీపీకి చెందిన కామేపల్లి సీతారామయ్య, కాకినాడ జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌గా జనసేనకు చెందిన తుమ్మల రామస్వామి నియమితులయ్యారు.
ఏలూరు జిల్లా డీసీఎంఎస్ (డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ) ఛైర్మన్‌గా జనసేనకు చెందిన చాగంటి మురళీ కృష్ణ, కాకినాడ జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్‌గా పి.చంద్రమౌళి (టీడీపీ), ప్రకాశం జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్‌గా కసిరెడ్డి శ్యామల (టీడీపీ) నియమితులయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పలు నామినేటెడ్ పదవులను చేసింది. 10 జిల్లాలకు సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాల (డీసీఎంఎస్) ఛైర్మన్లను నియమించిన సంగతి తెలిసిందే.
విజయనగరం డీసీసీబీ ఛైర్మన్ గా టీడీపీకి చెందిన కిమిడి నాగార్జునను నియమించారు. విశాఖ డీసీసీబీ ఛైర్మన్‌గా కోన తాతారావును నియమించింది.
సంబంధిత కథనం