RRR Movie | ఆర్ఆర్ఆర్.. సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కానీ ఒక కండిషన్-ap govt approves ticket price hike for rrr movie ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Govt Approves Ticket Price Hike For Rrr Movie

RRR Movie | ఆర్ఆర్ఆర్.. సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కానీ ఒక కండిషన్

HT Telugu Desk HT Telugu
Mar 17, 2022 02:53 PM IST

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం.. సినిమా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వచ్చింది. కొన్ని రోజుల్లో విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు టికెట్ల ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు పేర్ని నాని మీడియా ఎదుట మాట్లాడారు.

ఆర్ఆర్ఆర్
ఆర్ఆర్ఆర్ (RRR/ Lahari Music)

దర్శకదీరుడు రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇస్తున్నట్టు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమా దరఖాస్తుకు వచ్చిందని పేర్కొ్న్నారు. రూ.336 కోట్లతో సినిమా నిర్మించినట్లు చెప్పారని.., జీవో కంటే ముందే సినిమా నిర్మించారన్నారు. కాబట్టి.. ఏపీలో 20 శాతం షూటింగ్‌ నిబంధన ఈ సినిమాకు వర్తించదని పేర్ని నాని స్పష్టం చేశారు. కొత్తగా నిర్మించే సినిమాలకు మాత్రం.. తప్పకుండా వర్తిస్తుందన్నారు.

ట్రెండింగ్ వార్తలు

జీఎస్టీ చెల్లించిన తర్వాత ప్రత్యేక టికెట్ రేట్లకు అనుమతిస్తాం. సినిమా టికెట్ ధరలను నిర్ధారిస్తూ జీవో నెం.13ను జారీ చేశాం. రూ.100 కోట్లు బడ్జెట్ దాటిన సినిమాలకు 10 రోజుల పాటు ప్రత్యేక టికెట్‌ నిర్ధారించుకునేలా ఆదేశాలిచ్చాం. జీవో కంటే ముందే 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా నిర్మించారు. టీడీఎస్, జీఎస్టీ కూడా వారు చెల్లించారు. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తర్వాత 10 రోజుల వరకూ టికెట్ రేట్లు పెంచుకొనేందుకు అనుమతించాం.

                                        - పేర్ని నాని, సినిమాటోగ్రఫీ మంత్రి

రెమ్యూనరేషన్లు కాకుండా వంద కోట్లు బడ్జెట్‌ దాటిన సినిమాలకు టికెట్‌ రేట్లు పెంచుకునే ఛాన్స్ ఉందని పేర్ని నాని అన్నారు. ఈ మేరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకే.. టికెట్‌ రేట్లపై ఆర్ఆర్ఆర్ నిర్మాతలు దరఖాస్తు చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ విషయాన్ని కమిటీ పరిశీలిస్తుందన్నారు. ఆ తర్వాత ప్రభుత్వ జీవో ప్రకారం.. టికెట్ రేట్లను పెంచుకునే అవకాశం ఉందని పేర్ని నాని వెల్లడించారు. ప్రజలపై ఎట్టి పరిస్థితుల్లో భారం పడదని.. ఆ మేరకే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆన్‌లైన్‌ టికెట్‌ విధానంపైనా.. పేర్ని నాని స్పందించారు. టెండర్లు ఖరారయ్యాయని తెలిపారు. అతిత్వరలో ఈ విధానం అమల్లోకి వస్తుందన్నారు.

'పెద్ద సినిమాలు ఐదు షోలు ప్రదర్శించవచ్చు. అయితే మధ్యలో చిన్న సినిమా విడుదలైతే.. ఆ సినిమాకు మధ్యాహ్నం 11 నుంచి రాత్రి 9 గంటల్లోపు.. ఒక షోకు ఛాన్స్ ఇవ్వాలి. 20 కోట్ల బడ్జెట్ లోపు నిర్మించిన.. సినిమాలన్నీ చిన్న చిత్రాలుగానే చూస్తాం. ఇక ఆన్ లైన్ టికెట్ల టెండర్లు పిలిచాం. అతి త్వరలో ప్రక్రియ పూర్తి చేస్తాం. కొత్తగా తీసే సినిమాలు.. ఏపీలో 20 శాతం షూటింగ్ పూర్తి చేయాలి. అయితే వాటికి సింగిల్ విండో ద్వారా పర్మిషన్లు ఫ్రీ ఇస్తాం.' అని మంత్రి పేర్ని నాని తెలిపారు.

ఇటీవలే భేటీ

ఇటీవలే.. సీఎం జగన్‌తో ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య సమావేశమయ్యారు. టికెట్ల రేట్ల అంశంపైనే చర్చించారు. అయితే భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రం కాబట్టి.. సినిమాకు ఏం చేయాలో అది చేస్తామని.. సీఎం హమీ ఇచ్చినట్టు రాజమౌళి చెప్పారు. ఈ నెల 25న ఆర్ఆర్ఆర్ సినిమా ప్రేక్షకుల మందుకురానుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్