AP New CS : ఏపీ నూతన సీఎస్ గా విజయానంద్ నియామకం, ఉత్తర్వులు జారీ
AP New CS : ఏపీ కొత్త సీఎస్ గా విజయానంద్ పేరు ఖరారైంది. విజయానంద్ ను సీఎస్ గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ నీరభ్ కుమార్ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది.
AP New CS : ఆంధ్రప్రదేశ్ నూతన చీఫ్ సెక్రటరీగా విజయానంద్ పేరు ఖరారైంది. విజయానంద్ ను సీఎస్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది. దీంతో ఏపీ ప్రభుత్వం కొత్త సీఎస్ ను నియమించింది. 1992 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వచ్చే ఏడాది నవంబర్ నెలాఖరు వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు.
సీనియారిటీ ప్రాతిపదికన జలవనరుల శాఖ ప్రత్యేక సీఎస్ సాయిప్రసాద్ పేరు వినిపించింది. అయితే సీఎం చంద్రబాబు విజయానంద్ వైపే మొగ్గు చూపారు. వచ్చే ఏడాది నవంబరులో విజయానంద్ రిటైర్ అయ్యాక సాయిప్రసాద్‌ను సీఎస్ గా నియమించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరో ఆరు నెలల పదవీకాలం పొడిగిస్తే ఆయన కూడా ఏడాది కాలం పనిచేసినట్లవుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. విజయానంద్ కడప జిల్లాకు చెందిన బీసీ వర్గానికి చెందినవారు.
కె. విజయానంద్ 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన ఫిబ్రవరి 2022 నుంచి ఏపీ జెన్‌కోకి ఛైర్మన్‌గా, ఏప్రిల్ 2023 నుంచి ఏపీ ట్రాన్స్‌కో సీఎండీగా పనిచేశారు. కె. విజయానంద్ 1993లో అసిస్టెంట్‌గా ఇండియన్ బ్యూరోక్రసీ వృత్తిని ప్రారంభించారు. ఆదిలాబాద్ కలెక్టర్, రంపచోడవరం సబ్ కలెక్టర్, శ్రీకాకుళం కలెక్టర్, ఏపీ జెన్ కో మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ ట్రాన్స్ కో సీఎండీగా 2016 నుంచి 2019 వరకు పనిచేసారు. అనంతరం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, ఎక్స్-అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీగా 2019 నుంచి 2021 వరకు విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం విజయానంద్ ప్రభుత్వ కార్యదర్శి, ఇంధన శాఖ స్పెషల్ చీఫ్‌గా ఉన్నారు. ఈయన కంటే సీనియర్ ఐఎస్ఎస్ అధికారులు ఉన్నప్పటికీ, సీఎం చంద్రబాబు విజయానంద్ వైపే మొగ్గు చూపారు.