AP New DGP : ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం, సీఎం చంద్రబాబుతో భేటీ
AP New DGP : ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయనున్నారు.
AP New DGP : ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ కె.విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో హరీష్ కుమార్ గుప్తాను తదుపరి డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో హరీష్ గుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీగా నియమించింది. దీంతో కొన్నిరోజుల పాటు ఆయన డీజీపీగా కొనసాగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించిన విషయం తెలిసిందే. డీజీపీగా ఉత్తర్వులు రావడంతో హరీష్ కుమార్ గుప్తా సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన కృతజ్ఞతలు తెలిపారు.
హరీష్ కుమార్ గుప్తాకే ఛాన్స్
ఈ ఏడాది ఆగస్టు వరకు హరీష్ కుమార్ గుప్తా డీజీపీగా కొనసాగనున్నారు. అయితే ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు పదవీ విరమణ దగ్గర పడడంతో ఏపీ ప్రభుత్వం సీనియారిటీ జాబితాను సిద్ధం చేసి కేంద్రానికి పంపింది. ఈ జాబితాలో 1991 బ్యాచ్ కు చెందిన అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ మొదటి స్థానంలో, హరీష్ కుమార్ గుప్తా రెండో స్థానంలో ఉన్నారు. అయితే ఏపీ ప్రభుత్వం హరీష్ కుమార్ గుప్తాకే మరోసారి అవకాశం కల్పించింది. తిరిగి ఆయనను డీజీపీగా నియమించింది.