Govt Employees : ముస్లిం ఉద్యోగ, ఉపాధ్యాయుల‌కు గుడ్‌న్యూస్‌-రంజాన్ నెలలో గంట ముందే ఇంటికి, ఉత్తర్వులు జారీ-ap govt announces muslim employees to leave work early during ramadan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Govt Employees : ముస్లిం ఉద్యోగ, ఉపాధ్యాయుల‌కు గుడ్‌న్యూస్‌-రంజాన్ నెలలో గంట ముందే ఇంటికి, ఉత్తర్వులు జారీ

Govt Employees : ముస్లిం ఉద్యోగ, ఉపాధ్యాయుల‌కు గుడ్‌న్యూస్‌-రంజాన్ నెలలో గంట ముందే ఇంటికి, ఉత్తర్వులు జారీ

HT Telugu Desk HT Telugu
Updated Feb 14, 2025 06:18 PM IST

Govt Employees : ఏపీ ప్రభుత్వం ముస్లిం ఉద్యోగ, ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ చెప్పింది. రంజాన్ మాసంలో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఒక గంట ముందు తమ కార్యాలయాలు, పాఠ‌శాల‌ల‌ నుంచి ఇంటికి వెళ్లడానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ముస్లిం ఉద్యోగ, ఉపాధ్యాయుల‌కు గుడ్‌న్యూస్‌-రంజాన్ నెలలో గంట ముందే ఇంటికి, ఉత్తర్వులు జారీ
ముస్లిం ఉద్యోగ, ఉపాధ్యాయుల‌కు గుడ్‌న్యూస్‌-రంజాన్ నెలలో గంట ముందే ఇంటికి, ఉత్తర్వులు జారీ

Govt Employees : ముస్లిం ఉద్యోగ, ఉపాధ్యాయుల‌కు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రంజాన్ నెలలో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఒక గంట ముందు తమ కార్యాలయాలు, పాఠ‌శాల‌ల‌ నుంచి ఇంటికి వెళ్లడానికి అనుమతి ఇచ్చింది. ముస్లిం సోద‌రుల‌కు ఈ అవ‌కాశం క‌ల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (రాజకీయ) ముకేష్ కుమార్ మీనా విడుద‌ల చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు న‌మాజ్ చేసుకువ‌డానికి, అలాగే ఉప‌వాసం తీర్చుకోవ‌డానికి అవ‌కాశం క‌ల్పించింది. ఇస్లాం మతాన్ని ఆచ‌రించే ఉద్యోగులంద‌రికీ ఈ అవ‌కాశం ఉంటుంది. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన నియమించబడిన ఉద్యోగులు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల్లోని ముస్లింల‌కు ఈ అవ‌కాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది.

పవిత్రమైన "రంజాన్" మాసంలో అన్ని పనిదినాలలో అంటే 2025 మార్చి 2 నుంచి 2025 మార్చి 30 వరకు తమ కార్యాలయాలు, పాఠశాలల నుంచి ఒక గంట ముందుగానే ఉద్యోగ‌, ఉపాధ్యాయులు త‌మ ఇళ్లకు వెళ్లిపోవ‌చ్చు. ఆయా రోజుల్లో ఏమైనా అత్యవసర పరిస్థితుల కారణంగా వారు తప్పనిసరిగా హాజ‌రు కావ‌ల్సి వ‌స్తే త‌ప్ప, గంట ముందే వెళ్లిపోవ‌డానికి అవ‌కాశం క‌ల్పించింది. అలాగే సంబంధిత అధికారులు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అవసరమైన ఆచారాలను నిర్వర్తించుకోవ‌చ్చని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

ఇక నుంచి అధికారిక వేడుక‌గా దామోదరం సంజీవయ్య దినోత్సవం

ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత దామోదరం సంజీవయ్య జన్మదినోత్సవాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించనున్నారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్రభుత్వ కార్యద‌ర్శి ఎం.ఎం.నాయక్ ఉత్తర్వులు విడుద‌ల చేశారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లో కాకుండా ఆయన జన్మస్థలం కర్నూలులో "ప్రభుత్వ కార్యక్రమం"గా జరపాలని నిర్ణయించింది.

అలాగే దామోదరం సంజీవయ్య జన్మదినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాల్లో ప్రభుత్వ కార్యక్రమంగా జరుపుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. కర్నూలు జిల్లాకు అంటే ఆయన జన్మస్థలానికి రూ.3 లక్షలు, మిగిలిన జిల్లాలు, రాష్ట్ర ప్రధాన కార్యాలయాలకు రూ.1 లక్ష చొప్పున బ‌డ్జెట్ కేటాయించారు.

సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ నివేదించిన ఈ విషయాన్ని ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించిన తరువాత ఈ నిర్ణయం తీసుకుంది. దివంగత దామోదరం సంజీవయ్య జన్మదిన వేడుకల కోసం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యక్రమంగా రూ.28.00 లక్షల మొత్తాన్ని వినియోగించడానికి సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్‌కు అనుమతి ఇచ్చారు. ఈ ఖ‌ర్చు మొత్తం హెడ్ ఆఫ్ అకౌంట్ నుంచి భరిస్తుంద‌ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. త‌దనుగుణంగా తదుపరి అవసరమైన చర్యలను సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్‌ తీసుకుంటార‌ని తెలిపారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం