AP Govt Rythu Bharosa : రైతుల భరోసా రానివారికి మరో ఛాన్స్, ఈ నెల 18లోపు అప్లై చేసుకోవచ్చు!-ap govt announced ysr rythu bharosa application from may 15th to 18th new applicants older ones ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Govt Announced Ysr Rythu Bharosa Application From May 15th To 18th New Applicants Older Ones

AP Govt Rythu Bharosa : రైతుల భరోసా రానివారికి మరో ఛాన్స్, ఈ నెల 18లోపు అప్లై చేసుకోవచ్చు!

Bandaru Satyaprasad HT Telugu
May 13, 2023 10:32 PM IST

AP Govt Rythu Bharosa : రైతు భరోసా అర్హత కలిగి పలు కారణాల వల్ల లబ్ది పొందని రైతులకు ఏపీ ప్రభుత్వం మరో ఛాన్స్ ఇచ్చింది. ఈ నెల 15 నుంచి 18 లోపు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

రైతు భరోసా
రైతు భరోసా (HT )

AP Govt Rythu Bharosa : రైతులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పంది. రైతు భరోసా అర్హత కలిగి వివిధ కారణాలతో లబ్ది పొందని వారికి మరో అవకాశం కల్పించింది. 2023-24 ఏడాది మొదటి విడత రైతు భరోసా దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం కల్పించింది. రైతు భరోసాకు కొత్తగా అర్హత పొందిన రైతులు, అటవీ భూమి సాగుదారులు.. ఈ నెల 15 నుంచి 18 వరకు దరఖాస్తు చేసుకునేందుకు వ్యవసాయ శాఖ అవకాశం కల్పించింది. ఈ ఏడాదికి కొత్తగా 90,856 మంది భూయజమానులు, 6,642 మంది అటవీ భూమి సాగుదారులు కొత్తగా అప్లై చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది లబ్ధి పొందిన వారు, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హుల, అనర్హుల జాబితాలను రైతు భరోసా కేంద్రాల్లో ఉంచినట్లు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

ఈ నెలలోనే పెట్టుబడి సాయం

ఈ నెలలోనే తొలి విడత పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. దీంతో అర్హత కలిగిన రైతులకు మరోసారి అవకాశం ఇచ్చింది. ఒకవేళ అర్హుల జాబితాలో అనర్హులు అంటే వ్యవసాయశాఖ దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు తెలిపారు. అర్హత ఉండి దరఖాస్తు చేసుకోనివారు ఈ నెల 18లోపు అప్లై చేస్తుకోవాలని సూచించారు. గతేడాది రైతు భరోసా లబ్ది పొంది ప్రస్తుతం యజమాని మరణించినట్లైతే భార్య భర్తకు బినామీగా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే గతేడాది రైతు భరోసా పొందిన వారు మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరంలేదని అధికారులు స్పష్టం చేశారు.

మూడు విడతల్లో రైతు భరోసా

ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తుంది. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన రైతులకు రూ.13,500 చొప్పున అందిస్తారు. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమచేస్తుంది. మొదటి విడతలో రూ5,500, రెండో విడతలో రూ.4 వేలు, మూడో విడతలో రూ. 2 వేల చొప్పున రైతులకు అందజేస్తారు. పొలం పత్రాలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకెళ్లి రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలి. అర్హులై ఉండి రైతు భరోసా నగదు అందకపోతే.. వెంటనే స్థానిక సచివాలయాల్లో సంబంధింత సిబ్బందిని కలిసి, పట్టాదారు పుస్తకం, వ్యక్తిగత వివరాలను అందజేయాలి. రైతు వివరాలను సిబ్బంది వెరిఫై చేసి.... రైతులు అర్హులు అనుకుంటే, డబ్బు రావడం ఎందుకు ఆలస్యం అయ్యిందో చెబుతారు. ఒక వేళ ఏదైనా సమస్య ఉంటే దానికి పరిష్కరించేందుకు సచివాలయ సిబ్బంది ప్రయత్నిస్తారు.

IPL_Entry_Point