EWS Age Concession : గుడ్ న్యూస్... EWS ఉద్యోగార్థులకు వయోపరిమితి పెంపు-ap govt age concession of 5 years for economically weaker sections in job recruitments ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Govt Age Concession Of 5 Years For Economically Weaker Sections In Job Recruitments

EWS Age Concession : గుడ్ న్యూస్... EWS ఉద్యోగార్థులకు వయోపరిమితి పెంపు

HT Telugu Desk HT Telugu
Feb 25, 2023 01:09 PM IST

AP Govt Latest News: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల భర్తీలో బీసీ,ఎస్పీ,ఎస్టీల మాదిరిగానే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(EWS)కు వయోపరిమితిని ఐదేళ్లు పెంచారు.

కీలక ఉత్తర్వులు ఇచ్చిన ఏపీ సర్కార్
కీలక ఉత్తర్వులు ఇచ్చిన ఏపీ సర్కార్

AP Govt On EWS Age Concession: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఉద్యోగ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఈడబ్ల్యుఎస్‌ వారికి ఐదేళ్ల వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ,ఎస్సీ,ఎస్టీ తరహాలోనే ఈడబ్ల్యుఎస్‌కు ఐదేళ్ల వయోపరిమితిని ప్రభుత్వం పెంచింది. ఫలితంగా ప్రస్తుతం 34 ఏళ్లు ఉన్న వయోపరిమితి 39 ఏళ్లకు పెరగనుంది. తద్వారా ఉద్యోగాల భర్తీలో ఆయా వర్గాలకు మేలు జరగనుంది.

ట్రెండింగ్ వార్తలు

ఏపీ సర్కార్ ఉత్తర్వులు
ఏపీ సర్కార్ ఉత్తర్వులు

పీఆర్సీ అమలు…

ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు సర్కార్ తీపికబురు చెప్పింది. ప్రభుత్వంలోని ప్రజా రవాణాశాఖ (పీటీడీ)లోకి ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు విలీనమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పదోన్నతి పొందిన 2,096 మందికి పీఆర్సీ అమలు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది. 51,488 మంది ఆర్టీసీ ఉద్యోగులు 2020 జనవరి ఒకటి నుంచి పీటీడీలోకి విలీనం అయ్యారు. ఆ తర్వాత వీరిలో 2,096 మందికి ఆర్టీసీ యాజమాన్యం పదోన్నతులు కల్పించింది. డీపీసీ నిబంధనలకు విరుద్ధంగా.. ప్రభుత్వ అనుమతి లేకుండా వీరికి ప్రమోషన్ ఇచ్చారని ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. వీరికి మినహా, మిగిలిన ఉద్యోగులకు గతేడాది సెప్టెంబరు నుంచి పీఆర్సీ అమలు చేశారు. ఆ తర్వా తఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విన్నవించాయి. ఫలితంగా 2096 మంది ఉద్యోగులకు ఈ ఒక్కసారికి పీఆర్సీ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

మరోవైపు హైదరాబాద్‌–విజయవాడ హైవే, విజయవాడ–చెన్నై హైవేలను కలుపుతూ పల్నాడు ప్రాంతంలోని అద్దంకి–నార్కెట్‌పల్లి ప్రధాన రహదారికి కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్‌ హైవేగా నామకరణం చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంపై గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

IPL_Entry_Point