AP Tourism : కేంద్రం సహకారంతో.. రూ.500 కోట్లతో అమరావతిలో భారీ పర్యాటక ప్రాజెక్టు!-ap government plans a huge tourism project in amaravati with 500 crore ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tourism : కేంద్రం సహకారంతో.. రూ.500 కోట్లతో అమరావతిలో భారీ పర్యాటక ప్రాజెక్టు!

AP Tourism : కేంద్రం సహకారంతో.. రూ.500 కోట్లతో అమరావతిలో భారీ పర్యాటక ప్రాజెక్టు!

Basani Shiva Kumar HT Telugu
Jan 27, 2025 09:34 AM IST

AP Tourism : ఏపీ ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది. అమరావతిలో రూ.500 కోట్లతో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయనుంది. అటు విశాఖలో సోమవారం ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సమావేశాన్ని నిర్వహించనున్నారు.

అమరావతి
అమరావతి

కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతిలో రూ.500 కోట్లతో భారీ పర్యాటక ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నామని.. మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం (పీ-4) విధానంలో రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. విశాఖపట్నం నోవాటెల్‌లో సోమవారం ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు వివరించారు.

yearly horoscope entry point

ఆసక్తి ఉన్నవారు..

పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆసక్తి ఉన్నవారు ఈ సమావేశంలో పాల్గొనవచ్చని మంత్రి వివరించారు. ఇప్పటికే విజయవాడలో టూరిజం సమ్మిట్‌ నిర్వహించి 200 ప్రతిపాదనలు స్వీకరించినట్లు చెప్పారు. ఏపీలో పలుచోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒబెరాయ్, తాజ్, మేఫేర్, ఐఆర్‌సీటీసీ ముందుకు వచ్చాయని వెల్లడించారు.

త్వరలోనే మారేడుమిల్లి ఉత్సవ్‌..

అతి త్వరలోనే మారేడుమిల్లి ఉత్సవ్‌ నిర్వహించి.. స్థానికంగా ఉన్న అవకాశాలను పెట్టుబడిదారులకు తెలియజేస్తామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. గతంలో జరిగిన ఘటనల దృష్ట్యా.. పాపికొండల పర్యాటకం విషయంలో కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏపీలో అడ్వెంచర్, ఎకో, వెల్‌నెస్, ఆలయ, హెరిటేజ్, అగ్రి, మెడికల్, బీచ్‌ పర్యాటకాలను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

త్వరలోనే టెండర్లు..

పలు గ్రామాల్లోని మండువా లోగిళ్లను అద్దెకు తీసుకుని.. సాంస్కృతిక పర్యాటకాన్ని అభివృద్ధి చెస్తామని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వ సాస్కీ పథకంలో మంజూరైన రూ.177 కోట్లతో.. అఖండ గోదావరి, గండికోటను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. వీటికి సంబంధించి త్వరలోనే.. టెండర్లు పిలుస్తామని వెల్లడించారు.

అన్ని ఘాట్లను కలిపేలా..

రాజమండ్రిలో రూ.98 కోట్లతో 2.7 కిలోమీటర్లు ఉన్న హేవ్‌లాక్‌ వంతెనపై పలు అభివృద్ధి పనులు చేపడతామని మంత్రి వెల్లడించారు. అన్ని ఘాట్లనూ కలిపేలా బోటింగ్‌తో పాటు.. కడియం నర్సరీలను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. సినిమాల బడ్జెట్‌ ప్రకారం.. టికెట్ల ధరల పెంపు ఉండేలా కొత్త పాలసీ తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

Whats_app_banner