ఏపీ వైద్యారోగ్య శాఖలో బదిలీలు, కౌన్సిలింగ్ ప్రక్రియ - కీలక ఆదేశాలు జారీ-ap government issues key orders on medical staff transfers and counseling ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీ వైద్యారోగ్య శాఖలో బదిలీలు, కౌన్సిలింగ్ ప్రక్రియ - కీలక ఆదేశాలు జారీ

ఏపీ వైద్యారోగ్య శాఖలో బదిలీలు, కౌన్సిలింగ్ ప్రక్రియ - కీలక ఆదేశాలు జారీ

వైద్య సిబ్బంది బ‌దిలీలు, కౌన్సిలింగ్‌పై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కీలక ఆదేశాలను జారీ చేసింది. నేటితో ఐచ్ఛిక స్థానాల ప్రక్రియ ముగియటంతో… తదుపరి ప్రక్రియలో తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టత ఇచ్చింది.

వైద్య సిబ్బంది బ‌దిలీలు, కౌన్సిలింగ్‌పై కీలక ఆదేశాలు

వైద్యారోగ్య శాఖలో సాధార‌ణ బ‌దిలీ ప్ర‌క్రియ‌లో ఐచ్ఛిక స్థానాల ప్రాధాన్య‌త‌లు తెలియ‌జేసే గ‌డువు నేటితో (బుధ‌వారం) ముగిసింది. త‌దుప‌రి కౌన్సిలింగ్ తో పాటు బ‌దిలీలు చేప‌ట్టాల్సిన ప్ర‌క్రియ‌పై మంత్రిత్వ శాఖ మరింత స్ప‌ష్ట‌త‌నిచ్చింది.

ఈ విష‌యంపై ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీ ఎం.టి.కృష్ణ‌బాబు…. అన్ని విభాగాధిప‌తుల‌తో ఇవాళ 2 గంట‌ల పాటు చ‌ర్చించారు. పలు కీలక అంశాలపై రూపొందించిన కార్యాచ‌ర‌ణ‌ సూత్రాలను మంత్రి స‌త్య‌ కుమార్ యాద‌వ్ ఆమోదించారు.

1) ప్ర‌స్తుతం ఒకే చోట ప‌నిచేస్తున్న దంప‌తుల్లో ఒక‌రైనా అదే చోట ఐదేళ్ల‌లోపు ప‌నిచేసి ఉంటే వారిని అదే చోట కొన‌సాగించ‌వ‌చ్చు.

2) బ‌దిలీల నిర్ణ‌యాల్లో మొద‌ట ఐదేళ్ల ప‌ద‌వీకాలం పూర్తి చేసిన వారి బ‌దిలీ స్థానాల‌పై నిర్ణ‌యాన్ని తీసుకోవాలి.

3) 2 నుండి ఐదేళ్లలోపు ఒకే చోట ప‌నిచేసిన వారి బ‌దిలీల‌పై వారి ఐచ్ఛికాల్ని బ‌ట్టి కొత్త స్థానాల‌పై నిర్ణ‌యాలు తీసుకోవాలి.

4) ఐదేళ్ల స‌ర్వీసు పూర్తి చేసుకున్న వారికి వారు సూచించిన స్థానాల్లో పోస్టింగ్ ల‌భించ‌క‌పోతే వారికి కౌన్సిలింగ్ చేప‌ట్టాలి.

5) 2 నుండి ఐదేళ్ల లోపు ఒకే చోట ప‌నిచేసి, వారు కోరుకున్న చోట బ‌దిలీ దొర‌క‌క‌పోతే వారిని ప్ర‌స్తుత స్థానాల్లో కొనసాగించాలి.

6) కాంట్రాక్టు నియామ‌కాల‌తో రెగ్యుల‌ర్ పోస్టుల్లో ప‌నిచేస్తున్న వారు ప్ర‌స్తుతానికి య‌థావిధిగా కొన‌సాగుతారు. ఆ రెగ్యుల‌ర్ స్థానాలు ఖాళీలుగా ప‌రిగ‌ణించ‌బ‌డ‌వు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.