AP Govt Public Holidays : 2025 సెలవుల జాబితా విడుదల చేసిన ఏపీ సర్కార్ - మొత్తం ఎన్నంటే..?-ap government has released the list of holidays for 2025 full list check here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt Public Holidays : 2025 సెలవుల జాబితా విడుదల చేసిన ఏపీ సర్కార్ - మొత్తం ఎన్నంటే..?

AP Govt Public Holidays : 2025 సెలవుల జాబితా విడుదల చేసిన ఏపీ సర్కార్ - మొత్తం ఎన్నంటే..?

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 07, 2024 08:51 AM IST

AP Govt Public Holidays 2025 : వచ్చే ఏడాది 2025కి సంబంధించిన సెలవుల జాబితాను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. 2025లో మొత్తం 23 సాధారణ సెలవులు, 21 ఐచ్ఛిక సెలవులు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు.

వచ్చే ఏడాది 23 సాధారణ సెలవులు
వచ్చే ఏడాది 23 సాధారణ సెలవులు

వచ్చే సంవత్సరం 2025కు సాధారణ, ఆప్షనల్ సెలవులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాదిలో మొత్తం 23 సాధారణ సెలవులు ఉంటాయని పేర్కొంది. ఇక 21 ఐచ్ఛిక సెలవులు ఉన్నట్లు త్తర్వుల్లో తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

yearly horoscope entry point

ఇక వచ్చిన సాధారణ సెలవుల్లోనూ రిపబ్లిక్ డే, ఉగాది, శ్రీరామనవమి, మొహర్రం ఆదివారం తేదీల్లో వచ్చాయి. ఇక ఐచ్ఛిక సెలవుల్లో ఈద్‌-ఎ-గదిర్, మహాలయ అమావాస్య కూడా ఆదివారం వచ్చాయి. అయితే జనవరి, ఏప్రిల్, ఆగస్టు మాసాల్లో మాత్రం నాలుగేసి రోజులు హాలీ డేస్ వచ్చాయి. పూర్తి వివరాలతో కూడిన జాబితా ఇక్కడ చూడండి….

ఏపీలో సాధారణ సెలవులు - 2025

  1. భోగి : 13-01-2025(సోమవారం)
  2. సంక్రాంతి : 14-01-2025(మంగళవారం)
  3. కనుమ - 15-01- 2025(బుధవారం)
  4. రిపబ్లిక్ డే : 26-01-2025(ఆదివారం)
  5. మహా శివరాత్రి : 26-02-2025(బుధవారం)
  6. హోలీ : 14-03-2025(శుక్రవారం)
  7. ఉగాది : 30-03-2025(ఆదివారం)
  8. ఈద్ ఉల్ ఫిత్ర్ (రంజాన్) : 31-03-2025(సోమవారం)
  9. బాబు జగ్జీవన్ రామ్ జయంతి : 05-04-2025(శనివారం)
  10. శ్రీరామ నవమి : 06-04-2025(ఆదివారం)
  11. బి.ఆర్. అంబేద్కర్ జయంతి -14-04-2025(సోమవారం)
  12. గుడ్ ఫ్రైడే : 18-04-2025(శుక్రవారం)
  13. ఈదుల్ అజా (బక్రీద్) : 07-06-2025(శనివారం)
  14. మొహరం : 06-07-2025(ఆదివారం)
  15. వరలక్ష్మీవ్రతం - 08- 08- 2025(శుక్రవారం)
  16. స్వాతంత్ర్య దినోత్సవం : 15-08-2025(శుక్రవారం)
  17. శ్రీ కృష్ణాష్టమి : 16-08-2025(శనివారం)
  18. వినాయక చవితి : 27-08-2025(బుధవారం)
  19. ఈద్ మిలాదున్ నబీ : 05-09-2025(శుక్రవారం)
  20. దుర్గాష్టమి - సెప్టెంబర్ 30, 2025(మంగళవారం)
  21. మహాత్మా గాంధీ జయంతి/విజయ దశమి : 02-10-2025(గురువారం)
  22. దీపావళి : 20-10-2025(సోమవారం)
  23. క్రిస్మస్ : 25-12-2025(గురువారం)

ఏపీలో ఐచ్ఛిక సెలవులు-2025

  1. న్యూ ఇయర్ - జనవరి 1, 2025(బుధవారం)
  2. హజ్రత్ అలీ పుట్టినరోజు : 13-01-2025(సోమవారం)
  3. షాబ్-ఇ-మెరాజ్ : 27-01-2025(సోమవారం)
  4. షబే ఎ బరాత్ - 14- 02- 2024(శుక్రవారం)
  5. షాహదత్ HZT అలీ : 22-03-2025(గురువారం)
  6. జుమాతుల్ వాడ / షాబ్-ఇ-ఖాదర్ : 28-03-2025(శుక్రవారం)
  7. మహావీర్ జయంతి : 10.04.2025(గురువారం)
  8. బసవ జయంతి : 30-04-2025(బుధవారం)
  9. బుద్ధ పూర్ణిమ : 12-05-2025(సోమవారం)
  10. ఈద్-ఎ-గదీర్ : 15-06-2025 (ఆదివారం)
  11. రథ యాత్ర : 27-06-2025(శుక్రవారం)
  12. 9వ మొహర్రం : 05-07-2025(శనివారం)
  13. శ్రావణ పూర్ణిమ : 15-08-2025(శుక్రవారం)
  14. పార్సీ నూతన సంవత్సర దినోత్సవం : 15.08.2025(శుక్రవారం)
  15. మహాలయ అమవాస్య - సెప్టెంబర్ 21, 2025(ఆదివారం)
  16. యాజ్ దహుమ్ షరీఫ్ : 09-10-2025(గురువారం)
  17. కార్తీక పూర్ణమ - 11 నవంబర్ 2025
  18. గురునానక్ జయంతి - 11 నవంబర్ 2025
  19. కిస్మస్ ఈవ్ -24 డిసెంబర్ 2025(బుధవారం)
  20. బాక్సింగ్ డే - 26 డిసెంబర్ 2025(శుక్రవారం)
  21. నరక చతుర్ధి : 19-10-2025(ఆదివారం)

ఇక తెలంగాణలో చూస్తే వచ్చే ఏడాదిలో(2025) మొత్తం 27 సాధారణ సెలవులు, 23 ఐచ్ఛిక సెలవులు ఉండనున్నాయి. ఇప్పటికే ఆ ప్రభుత్వం ఉత్తర్వులను కూడా జారీ చేసింది.

 

Whats_app_banner