Vijayawada Police : ముంబై నటి ఇష్యూ...! దర్యాప్తునకు స్పెషల్ పోలీస్ టీమ్
ముంబై సినీ నటి కాదంబరీ జత్వానీకి వేధింపుల వ్యవహారంపై ఏపీ సర్కార్ స్పందించింది. ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. ఏసీపీ స్రవంతి రాయ్ ని ప్రత్యేకంగా అధికారిణిగా నియమించింది. ఈ మేరకు విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు ఉత్తర్వులను జారీ చేశారు.
ముంబై నటిపై వేధింపులు - దర్యాప్తునకు ఏపీ సర్కార్ ఆదేశం
ముంబై సినీనటి కాదంబరీ జత్వానీకి వేధింపుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఏపీకి చెందిన పలువురు పోలీసు అధికారుల పాత్రపై ఆరోపణలు వస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది.
ఈ మేరకు విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు గురువారం ఆదేశాలను జారీ చేశారు. ఏసీపీ స్రవంతి రాయ్ ని విచారణాధికారిణిగా నియమించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయనున్నారు. సాధ్యమైనంత త్వరగా దర్యాప్తునకు సంబంధించిన నివేదికను అందజేయాలని సీపీ ఆదేశించారు. దర్యాప్తులో భాగంగా విజయవాడ పోలీసులు ముంబైకి వెళ్లే అవకాశాలున్నాయి.