AP Fee Reimbursement :గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ అప్లికేషన్లు స్వీకరణ, దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు-ap fee reimbursement scholarship application process start in grama ward sachivalayam required documents ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Fee Reimbursement :గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ అప్లికేషన్లు స్వీకరణ, దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు

AP Fee Reimbursement :గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ అప్లికేషన్లు స్వీకరణ, దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు

AP Fee Reimbursement Apply : ఏపీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గ్రామాల వారీగా అర్హులైన విద్యార్థుల జాబితాలను సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ అప్లికేషన్లు స్వీకరణ, దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు

ఏపీ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పై కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజు రీయింబర్స్మెంట్ ను నేరుగా కాలేజీల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రక్రియను ఇప్పటికే ప్రారభించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అర్హులైన విద్యార్థులు...రేషన్ కార్డు, అందులోని కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డుల జీరాక్స్ లు, తల్లి-విద్యార్థి పేరిట ఉన్న జాయింట్ అకౌంట్ పత్రాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో సమర్పించాలి. వీటితో పాటు దరఖాస్తు ఫారమ్ పూర్తి చేయాల్సి ఉంది. ఈ ఫారమ్ సచివాలయాల్లో అందుబాటులో ఉంది. అయితే ఫీజు రీయింబర్స్మెంట్ ప్రక్రియలో ఫీజులను నేరుగా కాలేజీల ఖాతాల్లో జమ చేయనున్నారు. స్కాలర్ షిప్ లను తల్లి, విద్యార్థి జాయింట్ అకౌంట్ లో జమ చేస్తారు. ఈ నెల 27 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించినట్లు సమాచారం. స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ కు అర్హులైన ఇంజినీరింగ్, డిగ్రీ, ఐటిఐ, పాలిటెక్నిక్ విద్యార్థుల వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయి.

సచివాలయాల్లో సమర్పించాల్సిన పత్రాలు

  • ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు ఫారమ్
  • రేషన్ కార్డు
  • కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు
  • తల్లి, విద్యార్థి జాయింట్ అకౌంట్ వివరాలు

ఫీజు రీయింబర్స్మెంట్ ఫారమ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నేరుగా కాలేజీల ఖాతాల్లోకే

ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లుగా ఫీజు రియింబర్స్‌మెంట్ విధానంలో వైసీపీ అవలంబించిన విధానాలతో కాలేజీలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యాయి. ఫీజు రియింబర్స్‌మెంట్‌లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్‌ చేసే విధానానికి వైసీపీ స్వస్తి పలికింది. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పేరుతో గతంలో ఉన్న పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌ షిప్‌‌ రీయింబర్స్మెంట్‌ పథకాలకు పేరు మార్చి నిబంధనలను మార్చేశారు. గతంలో కన్వీనర్‌ కోటాలో చదువుకునే విద్యార్థులకు ఫీజులను ప్రభుత్వమే నేరుగా కాలేజీలకు చెల్లించేది.

పీజీ కోర్సుల్లో ఫీజు రియింబర్స్‌మెంట్‌ను కేవలం యూనివర్శిటీ క్యాంపస్‌ కాలేజీలకు పరిమితం చేసిన వైసీపీ ప్రభుత్వం ప్రైవేట్‌, ఎయిడెడ్‌ కాలేజీల్లో పీజీ కోర్సులు చదివే విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసింది. జీవో నంబర్ 77 పేరుతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కేవలం యూనివర్శిటీ క్యాంపస్ కాలేజీల్లో చదువుకుంటేనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుందని నిబంధనలు మార్చారు. దీంతో పెద్ద ఎత్తున అడ్మిషన్లు తగ్గిపోయాయి.

ఇక ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్ని చదువుకునే విద్యార్థుకుల కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కాలేజీలకు కాకుండా విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ చేయడం ప్రారంభించారు. దీంతో సకాలంలో కాలేజీలకు ఫీజులు చెల్లించకపోవడంతో వాటి నిర్వహణ కష్టమైంది. 2019 మే నాటికి దాదాపు రూ.3500కోట్ల బకాయిలు ఉండిపోయాయి. 2024 మార్చిలో జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల చేసినా అవి విద్యార్థుల ఖాతాలకు చేరలేదు. దీంతో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడానికి యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. 1,2, 3 ఇయర్ చదువుతున్న విద్యార్థులను పరీక్షలకు అనుమతించడానికి కాలేజీలు నిరాకరించడంతో ఎవరికి వారు ఫీజులు చెల్లించాల్సి వచ్చింది.

సంబంధిత కథనం