AP Engineering Web Options : ఏపీ ఇంజినీరింగ్ ప్రవేశాల‌కు వెబ్ ఆప్షన్ ప్రారంభం, డైరెక్ట్ లింక్ ఇదే-ap engineering courses web options started direct link other details ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Engineering Web Options : ఏపీ ఇంజినీరింగ్ ప్రవేశాల‌కు వెబ్ ఆప్షన్ ప్రారంభం, డైరెక్ట్ లింక్ ఇదే

AP Engineering Web Options : ఏపీ ఇంజినీరింగ్ ప్రవేశాల‌కు వెబ్ ఆప్షన్ ప్రారంభం, డైరెక్ట్ లింక్ ఇదే

HT Telugu Desk HT Telugu
Jul 09, 2024 07:18 PM IST

AP Engineering Web Options : ఏపీలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం అయ్యింది. నాలుగు రోజుల్లో వెబ్ ఆప్షన్లు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

ఏపీ ఇంజినీరింగ్ ప్రవేశాల‌కు వెబ్ ఆప్షన్ ప్రారంభం, డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీ ఇంజినీరింగ్ ప్రవేశాల‌కు వెబ్ ఆప్షన్ ప్రారంభం, డైరెక్ట్ లింక్ ఇదే

AP Engineering Web Options : రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల‌కు వెబ్ ఆప్షన్ ప్రక్రియ ప్రారంభం అయింది. ఏపీ ఈఏపీసెట్‌లో వ‌చ్చిన ర్యాంక్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. అయితే ఈ ప్రక్రియ ఒక రోజు ఆల‌స్యంగా ప్రారంభం అయింది. నాలుగు రోజుల్లో వెబ్ ఆప్షన్లు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టేట‌ప్పుడు జాగ్రత్తలు త‌ప్పని స‌రిగా తీసుకోవాలి. లేక‌పోతే విద్యార్థులకు ఇబ్బందులు త‌లెత్తుతాయి. ఏపీఈఏపీసెట్ క‌న్వీన‌ర్ డాక్టర్ బి. న‌వ్య ఏపీఈఏపీసెట్ ప్రవేశాల‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుద‌ల చేస్తూ వెబ్ ఆప్షన్ ప్రక్రియ జులై 8 నుంచి ప్రారంభం అవుతోంద‌ని ప్రక‌టించారు. కానీ ఇంజినీరింగ్ కోర్సుల‌ ఫీజులు ఖ‌రారు కార‌ణాల‌తో ఒక రోజు ఆల‌స్యంగా జులై 9 నుంచి వెబ్ ఆప్షన్ ప్రక్రియ ప్రారంభ‌మైంది.

yearly horoscope entry point

ఇప్పటికే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్‌, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ప్రక్రియ ముగిసింది. జులై 4న ప్రారంభ‌మైన ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల ప‌రిశీల‌న జులై 10 (బుధ‌వారం)తో ముగియ‌నుంది. జులై 12 వ‌ర‌కు నాలుగు రోజుల పాటు వెబ్ ఆప్షన్ ప్రక్రియ కొన‌సాగ‌నుంది. ఐచ్ఛికాల ఎంపిక‌, మార్పుల‌కు జులై 13వ తేదీ వ‌ర‌కు గ‌డువు ఉంది. జులై 16న ఇంజినీరింగ్ సీట్లు కేటాయిస్తారు. అప్పుడు అభ్యర్థుల ర్యాంక్‌కు అనుగుణంగా కాలేజీల వారీగా సీట్లు కేటాయిస్తారు. జులై 17 నుంచి 22 వ‌ర‌కు విద్యార్థులు త‌మ‌కు కేటాయించిన సీటు ఆధారంగా ఆయా కాలేజీల‌కు వెళ్లి రిపోర్టింగ్ చేసి ప్ర‌వేశాలు పొందాలి. జులై 19 నుంచి త‌ర‌గ‌తులు ప్రారంభం అవుతాయి.

వెబ్ ఆప్షన్‌ కీల‌కం

ఏపీ ఈఏపీసెట్‌లో వ‌చ్చిన ర్యాంక్ ఆధారంగా బీటెక్ ఇంజినీరింగ్ కోర్సుల్లో సీట్ల కేటాయింపు ఉంటుంది. వెబ్ ఆప్షన్‌లో ఇచ్చిన కాలేజీ, బ్రాంచ్‌ల‌కు ర్యాంక్ ఆధారంగా సీట్లు కేటాయింపు ఉంటుంది. ఉన్నత విద్యా మండ‌లి అధికారిక వెబ్ ఆప్షన్‌కు డైరెక్ట్ లింక్ https://eapcet-sche.aptonline.in/EAPCET/weboptions ఇది. దీనిపై క్లిక్ చేయాలి. అక్కడ హాల్ టిక్కెట్టు నంబ‌ర్, పుట్టిన తేదీ ఎంటర్‌ చేయాలి. అప్పుడు లాగిన్ అవుతుంది. ప్రాధాన్య క్రమంలో కోర్సు, కాలేజీల‌ను ఎంపిక చేసుకోవాలి. ప్రాధాన్య క్రమంలో ఎంపిక పూర్తి అయితే, దాన్ని సేవ్ చేసి, స‌బ్మిట్ చేయాలి. రాష్ట్రంలో మొత్తం 232 ఇంజినీరింగ్ కాలేజీల‌కు ప్రభుత్వం అనుమ‌తి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో 24 ప్రభుత్వ యూనివ‌ర్సిటీ కాలేజీలు కాగా, 208 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి.

జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం