ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంపు ప్రచారం, క్లారిటీ ఇచ్చిన మంత్రి గొట్టిపాటి రవికుమార్-ap electricity tariff hike minister ravi kumar clarifies govt not thought hike charges ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంపు ప్రచారం, క్లారిటీ ఇచ్చిన మంత్రి గొట్టిపాటి రవికుమార్

ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంపు ప్రచారం, క్లారిటీ ఇచ్చిన మంత్రి గొట్టిపాటి రవికుమార్

ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంపుపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ క్లారిటీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచే ఆలోచన చేయడంలేదన్నారు. యాక్సిస్ గ్రూప్ ఫీల్డ్ ఎనర్జీ విషయంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంపు ప్రచారం, క్లారిటీ ఇచ్చిన మంత్రి గొట్టిపాటి రవికుమార్

ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంపుపై గత కొన్ని రోజులు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ ఛార్జీలు పెంపుపై కీలక ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వానికి విద్యుత్‌ ఛార్జీలు పెంచే ఆలోచన లేదన్నారు.

విద్యుత్ ఛార్జీల పెంపుపై

విద్యుత్‌ ఛార్జీలను పెంచే ప్రసక్తి లేదని, ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. యాక్సిస్ గ్రూప్ ఫీల్డ్ ఎనర్జీ విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేసేందుకే సమయం సరిపోతుందని అన్నారు.

యాక్సిస్ ఎనర్జీ

గత ప్రభుత్వం విద్యుత్ శాఖను ఒక ఆదాయ వనరుగా వాడుకుందని మంత్రి గొట్టిపాటి ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో యాక్సిస్ ఎనర్జీ యూనిట్‌కు రూ.5.12లకు ఒప్పందం చేసుకుందని, కూటమి ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని సవరించి రూ.4.60లకు యూనిట్ విద్యుత్ సరఫరా చేసేలా ఒప్పందం చేసుకుందన్నారు. ప్రజలపై భారం పడకుండా, తక్కువ ధరకే విద్యుత్‌ను అందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

రాయలసీమలో రెన్యువబుల్ ఎనర్జీ

రాయలసీమ, ప్రకాశం జిల్లాలో రెన్యువబుల్ ఎనర్జీకి ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమారు తెలిపారు. రెన్యువబుల్ ఎనర్జీకి రాయలసీమ అనుకూలమని చెప్పారు.

తప్పు చేసిన వారికే రెడ్‌బుక్ వర్తిస్తుందని, అంతే తప్ప ఎవరినీ ఇబ్బంది పెట్టదన్నారు. రాయలసీమలో 2014-19లో రెనోవబుల్ ఎనర్జీ ద్వారా 7 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేసి చూపించామని తెలిపారు.

కూట‌మి ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీ పెంచ‌లేద‌న్నారు. ఇక‌పై కూడా పెంచ‌కుండా ఉండేందుకు చ‌ర్యలు చేపడతామన్నారు.

పీక్ అవర్స్ లో తక్కువకే సరఫరా

"2022 న‌వంబ‌ర్ లో కేవ‌లం సోలార్ విద్యుత్ ను రూ.5.12 కి యూనిట్ కొనుగోలు చేసేలా గత వైసీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం కూట‌మి ప్రభుత్వం సోలార్, విండ్, బ్యాట‌రీ స్టోరేజ్ విద్యుత్ ను యూనిట్ కు రూ. 4.60 కు పీక్ అవ‌ర్స్ లో స‌ర‌ఫ‌రా చేసేలా ఒప్పందం చేసుకుంది.

పీక్ అవ‌ర్స్ లో కూట‌మి ప్రభుత్వం రూ.4.60కు కొనుగోలు చేస్తున్న యూనిట్ ను గత వైసీపీ ప్రభుత్వం రూ.9.30కు కొనుగోలు చేసింది" -మంత్రి గొట్టిపాటి రవికుమార్

వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ప్రజ‌ల నెత్తిన సుమారు రూ.1.29 ల‌క్షల కోట్ల భారం వేసింది మంత్రి అన్నారు. గ‌త ప్రభుత్వ హ‌యాంలో సెకీతో చేసుకున్న ఒప్పందంతో డిస్కంలు, ట్రాన్స్ కో, జెన్ కోలు పూర్తిగా నాశ‌నం అయ్యాయ‌ని చెప్పారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం