AP EdCET Counselling : ఏపీ ఎడ్ సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, నేటి నుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు-ap edcet first phase counselling schedule released registration starts on august 21st ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Edcet Counselling : ఏపీ ఎడ్ సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, నేటి నుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు

AP EdCET Counselling : ఏపీ ఎడ్ సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, నేటి నుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు

Bandaru Satyaprasad HT Telugu
Aug 21, 2024 03:38 PM IST

AP EdCET Counselling :ఏపీ ఎడ్ సెట్-2024 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి తొలి విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. ఈ నెల 27వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆగస్టు 22 నుంచి 28వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.

ఏపీ ఎడ్ సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, నేటి నుంచే రిజిస్ట్రేషన్
ఏపీ ఎడ్ సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, నేటి నుంచే రిజిస్ట్రేషన్

AP EdCET Counselling : ఏపీ ఎడ్ సెట్-2024 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైంది. ఎడ్ సెట్-2024లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉన్నత విద్యామండలి తెలిపింది. బీఈడీ మొదటి సంవత్సరం, స్పెషల్ బీఈడీలో ప్రవేశాలకు ఏపీ ఎడ్ సెట్-2024 నిర్వహించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు 2024-25 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ, అన్ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఆగస్టు 21 నుంచి ఆగస్టు 27 వరకు ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు

అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లింక్ https://edcet-sche.aptonline.in/EdCET2024/Views/index.aspx లో అవసరమైన డాక్యుమెంట్ల స్కాన్ కాపీలు సమర్పించాలని అధికారులు తెలిపారు. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1200, ఎస్సీ, ఎస్సీ, పీహెచ్ అభ్యర్థులు రూ.600 ప్రాసెసింగ్ ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. ఇతర వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచిన నోటిఫికేషన్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు (PH/CAP/NCC/స్పోర్ట్స్ & గేమ్స్/స్కౌట్స్ & గైడ్స్/ఆంగ్లో ఇండియన్స్) సర్టిఫికెట్ వెరిఫికేషన్ ను విజయవాడ ఆంధ్రా లయోలా కాలేజీ, హెచ్ఎల్సీ లో ఈ నెల 27న నిర్వహిస్తారు.

తొలి విడత కౌన్సెలింగ్

బీఈడీ మొదటి విడత కౌన్సెలింగ్ నేటి(ఆగస్టు 21) నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 27వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని కన్వీనర్ ఉమామహేశ్వరి తెలిపారు. ఆగస్టు 22 నుంచి 28వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు ఈ నెల 27న విజయవాడలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 2 వరకు వెబ్ ఆప్షన్లు ఎంపిక, సెప్టెంబర్ 5 నుంచి సీట్లు కేటాయింపు ఉంటుందని కన్వీనర్ తెలిపారు. విద్యార్థులు కళాశాలలో సెప్టెంబర్ 05 నుంచి 07 వరకు స్వయంగా రిపోర్టు చేయాల్సి ఉంటుంది. బీఈడీ క్లాసులు సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం అవుతాయి.

ఒరిజినల్ సర్టిఫికెట్ల స్కాన్ చేసిన కాపీలను అప్లైడ్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల జాబితా ఇదే

1) A.P. Ed.CET-2024 హాల్ టికెట్

2) A.P. Ed.CET-2024 ర్యాంక్ కార్డు

3) బదిలీ సర్టిఫికేట్ (T.C.)

4) డిగ్రీ మార్కుల మెమోలు/కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో

5) డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్

6) ఇంటర్మీడియట్ మార్కుల మెమో/డిప్లొమా మార్కుల మెమో

7) ఎస్.ఎస్.సి. లేదా దానికి సమానమైన మార్క్స్ మెమో

8) 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్లు

9) నివాస ధృవీకరణ పత్రం ( ప్రైవేట్ అభ్యర్థులకు)

10) 10 సంవత్సరాలుగా ఏపీ బయట ఉద్యోగం చేస్తుంటే...తల్లిదండ్రుల్లో ఎవరిదైనా నివాస ధృవీకరణ పత్రం

11) ఆదాయ ధృవీకరణ పత్రం లేదా రేషన్ కార్డు

12) SC/ST/BC లకు సంబంధిత అధికారుల జారీచేసిన కుల ధృవీకరణ పత్రం

13) ఇటీవల తీసుకున్న EWS సర్టిఫికేట్

14) 2014 జూన్ 2 నుంచి ఏడేళ్ల లోపు ఏపీకి వలసవచ్చిన వారిని స్థానిక అభ్యర్థులుగా గుర్తించారు. వారు లోకల్ స్టేటస్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.

సంబంధిత కథనం