AP ECET 2024 Results: ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల చేసిన జేఎన్‌టియూ అనంతపురం
AP ECET 2024 Results: ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. జేఎన్‌టియూ అనంతపురం ఆధ్వర్యంలో ఈ ఏడాది ఈసెట్ పరీక్షను నిర్వహించారు.
AP ECET 2024 Results: ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స టెస్ట్ 2024ను ఫలితాలు విడుదల అయ్యాయి. అనంతపురం జేఎన్‌టియూలో ఈసెట్ పలితాలను ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమ చంద్రారెడ్డి విడుదల చేశారు. అనంతపురం జేఎన్టీయూ లో ఫలితాలు విడుదల చేసిన ఉన్నత విద్య మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి, జేఎన్టీయూ వీసీ శ్రీనివాసరావులు ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఈ- సెట్ పరీక్షను 36369 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 90.41 శాతం ఉత్తీర్ణులైనట్టు ప్రకటించారు.
ఏపీ ఈసెట్ 2024 ఫలితాలతో పాటు ర్యాంక్ కార్డులను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చారు. ఫలితాల కోసం ఈ లింకును అనుసరించండి.
ర్యాంకు కార్డుల కోసం ఈ లింకును అనుసరించండి…
ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈసెట్ 2024 మే8న నిర్వహించారు. మే 1 నుంచి ఆన్‌లైన్‌లో ఈసెట్ హాల్‌టిక్కెట్లను అందుబాటులో ఉంచారు. మే 8వ తేదీన ఏపీ ఈసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. మే 10వ తేదీన ప్రాథమిక కీ విడుదల చేస్తారు. మే 12వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరిస్తారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్ కోర్సుల్లో రెండో ఏడాది ప్రవేశాల కోసం నిర్వహించే ఈసెట్ నోటిఫికేషన్ 2024 గత మార్చిలో విడుదలైంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల కోసం ఏపీ ఉన్నత విద్యా మండలి మార్చిలో నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 8న ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించారు.
మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులను పూర్తి చేసిన తర్వాత ఇంజనీరింగ్ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాది ప్రవేశాల కోసం ఈసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ద్వారా ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసుకున్న విద్యార్ధులు ప్రవేశాలు పొందవచ్చు.
2024-25 విద్యా సంవత్సరంలో రెండో ఏడాది ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 8వ తేదీన ఈసెట్ 2024 ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి 12గంటల వరకు ఓ సెషన్, మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదున్నర వరకు మరో సెషన్‌లో పరీక్ష నిర్వహించారు.
ఏపీ ఈసెట్ 2024 ఇన్ఫర్మేషన్ బ్రోచర్, విద్యార్హతలు, కోర్సుల వారీగా అర్హతలు, ఇంజనీరింగ్, టెక్నాలజీ డిప్లొమాల వారీగా ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు అనుమతించే కోర్సుల వివరాలు, సీట్ల లభ్యత, యూనివర్శిటీల పరిధిలో కళాశాలల జాబితా వంటి వివరాలు నోటిఫికేషన్ బ్రోచర్‌లో అందుబాటులో ఉన్నాయని కన్వీనర్ భానుమూర్తి వెల్లడించారు.
ప్రవేశపరీక్ష ఇలా..
ఈసెట్ పరీక్షలో 200మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 50 మార్కులు మ్యాథ్స్ నుంచి ఉంటాయి. ఫిజిక్స్ నుంచి 25, కెమిస్ట్రీ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. మరో 100 మార్కులు సంబంధిత విభాగానికి సంబంధించినవి ఉంటాయి.
ఫార్మసీ విభాగంలో ఫార్మాస్యూటిక్స్‌లో 50 మార్కులు, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలో 50, ఫార్మాకాగ్నసీలో 50, ఫార్మాకాలజీలో 50 మార్కలుకు ప్రశ్నలు ఉంటాయి. బిఎస్సీ విద్యార్హతతో దరఖాస్తు చేసేవారికి మ్యాథ్స్‌లో 100 మార్కులు, అనలిటికల్ ఎబిలిటీలో 50, కమ్యూనికేషన్ ఇంగ్లీష్‌లో 50 ప్రశ్నలు ఉంటాయి. అగ్రికల్చర్ బిఎస్సీ ప్రవేశాలకు డిప్లొమా కోర్సులు పూర్తి చేయాల్సి ఉంటుంది. పాలిటెక్నిక్ తర్వాత బిఇ, బిటెక్ కోర్సుల్లో ప్రవేశాలను పొందే వారు మూడేళ్లలో ఇంజనీరింగ్ పూర్తి చేస్తారు
.
సంబంధిత కథనం