AP EAPCET 2023: ఈఏపీసెట్‌కు 3 లక్షలకు పైగా దరఖాస్తులు.. పరీక్షల తేదీలపై కీలక నిర్ణయం -ap eapcet application processes ends and officials key decision on exam dates ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Eapcet Application Processes Ends And Officials Key Decision On Exam Dates

AP EAPCET 2023: ఈఏపీసెట్‌కు 3 లక్షలకు పైగా దరఖాస్తులు.. పరీక్షల తేదీలపై కీలక నిర్ణయం

HT Telugu Desk HT Telugu
Apr 16, 2023 10:35 AM IST

AP EAPCET 2023 Latest News:ఏపీఈఏపీసెట్‌-2023 పరీక్షకు సంబంధించి దరఖాస్తుల గడువు శనివారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు.

ఈఏపీసెట్ కు భారీగా దరఖాస్తులు
ఈఏపీసెట్ కు భారీగా దరఖాస్తులు

AP Engineering, Agriculture and Pharmacy Common Entrance Test 2023: ఇంజినీరింగ్‌, ఫార్మసీ, వ్యవసాయ, బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్‌కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. శనివారంతో గడువు ముగిసిన నేపథ్యంలో అధికారులు పలు వివరాలను వెల్లడించారు. ఈ ఏడాదికి సంబంధించి మొత్తం 3,26,315 దరఖాస్తులు వచ్చాయి. గతేడాదితో పోల్చితే ఈసారి 25 వేల దరఖాస్తులు పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఇందులో చూస్తే ఇంజినీరింగ్‌కు 2,22,850 అప్లికేషన్స్ వచ్చాయి.

ట్రెండింగ్ వార్తలు

దరఖాస్తులు భారీగా వచ్చిన నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పరీక్ష కేంద్రాలు మార్పు చేసినట్లు ప్రకటించారు. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఎంపీసీ స్ట్రీమ్‌ అభ్యర్థులకు మే 15 నుంచి 22 వరకు ఉదయం పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. పెరిగిన దరఖాస్తుల దృష్ట్యా అదనంగా మే 19న మధ్యాహ్నం సెషన్‌లోనూ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాలకు ప్రస్తుతం ఇచ్చిన ప్రాధాన్య క్రమంలో కొన్ని మార్పులు చేశారు.. ఆన్ లైన్ లో నిర్వహించే ఈ పరీక్షకు ప్రతీ రోజు 30 వేల మంది రాసేలా ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు.

ఎలాంటి అపరాధ రుసుం లేకుండా శనివారంతో గడువు ముగియగా... లేట్ ఫీజుతో మాత్రం సమయం ఉంది. రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్ నెల 30 వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. 1000 ఫీజుతో మే 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 5 వేల ఫీజుతో మే 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.10 వేల లేట్ ఫీజుతో మే 14 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. మే 9వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. మే 15 నుంచి పరీక్షలు ఉంటాయి.

ఇక తెలంగాణలో ఎంసెట్ పరీక్ష తేదీలు కూడా ఖరారైన సంగతి తెలిసిందే. తొలుత ఇచ్చిన షెడ్యూల్ కూడా మార్పులు చేసిన అధికారులు… ఫైనల్ తేదీలను కూడా వెల్లడించారు.

ముఖ్య వివరాలు:

ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ విడుదల.

మార్చి 3 నుండి ఆన్లైన్ అప్లికేషన్స్ స్వీకరణ.

ఆన్లైన్ అప్లికేషన్ స్వీకరణకి చివరి తేదీ ఏప్రిల్ 10.

ఏప్రిల్ 12 నుండి 14 వరకు ఎడిట్ చేసుకునే అవకాశం.

ఏప్రిల్ 30 నుండి ఆన్లైన్ లో ఎంసెట్ హల్ టికెట్స్ జారీ.

మే 29 నుండి జూన్ 1 వరకు ఎంసెట్ పరీక్షలు

మే 12,13, 14 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు.

మే 10,11న అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షలు.

ఉదయం 9 నుండి 12 వరకు మొదటి సెషన్ పరీక్ష, మధ్యాహ్నం 3 నుండి 6 వరకు రెండవ సెషన్ పరీక్ష ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎంసెట్ ఫీజు 500 రూపాయలు.

ఇతర విద్యార్థులకు ఎంసెట్ ఫీజు 900 రూపాయలు.

ఈసారి ఎంసెట్ ద్వారా నే బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్

ఈసారి ఎంసెట్ లో ఇంటర్ వెయిటేజీ లేదు.

WhatsApp channel

సంబంధిత కథనం