AP EAPCET Counselling 2024 : ఏపీ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్ - ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ముఖ్యమైన తేదీలివే-ap eapcet 2024 engineering admission process in ap from july 1 key dates check here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Eapcet Counselling 2024 : ఏపీ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్ - ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ముఖ్యమైన తేదీలివే

AP EAPCET Counselling 2024 : ఏపీ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్ - ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ముఖ్యమైన తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 29, 2024 12:41 PM IST

AP EAPCET (EAMCET) Counselling 2024 Updates: ఏపీలో జులై 1 నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ షురూ కానుంది. ఈ మేరకు అధికారులు షెడ్యూల్ ను విడుదల చేశారు.

జులై 1 నుండి ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ
జులై 1 నుండి ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ

AP EAMCET Counselling 2024 Schedule: ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి కీలక అప్జేట్ అందింది. ఏపీ ఈఏపీసెట్ 2024 అడ్మిషన్ల ప్రక్రియ జులై 1 నుండి ప్రారంభమవుతుందని సాంకేతిక విద్యాశాఖ సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ బి నవ్య తెలిపారు.

ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లిపు ప్రక్రియ జులై ఒకటి నుంచే ప్రారంభం అవుతుందని ప్రకటించారు. జులై 7వ తేదీ లోపు పూర్తి చేయవలసి ఉంటుందన్నారు. జులై 4 నుండి 10 వ తేదీ వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు.

జులై 8 నుండి 12 వరకు 5 రోజుల పాటు వెబ్ ఆప్షన్ల ఎంపిక పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని కన్వీనర్ స్పష్టం చేశారు. ఐచ్చికాల మార్పునకు జులై 13వ తేదీని తుది గడువు ప్రకటించారు.

జులై 16వ తేదీన సీట్ల కేటాయింపును పూర్తి చేస్తామని తెలిపారు. సెల్స్ జాయినింగ్, కళాశాలలో రిపోర్టింగ్ కోసం జులై 17 నుంచి 22 వరకు ఆరురోజుల పాటు అవకాశం ఉంటుందని వివరించారు. జులై 19వ తేదీ నుండే తరగతులు ప్రారంభం అవుతాయని ప్రకటించారు. బీ - ఫార్మసీ అడ్మిషన్ల కు సంబంధించి ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.

కౌన్సెలింగ్ షెడ్యూల్ - ముఖ్య తేదీలు

  • ఏపీ ఈఏపీసెట్ 2024 అడ్మిషన్ల ప్రక్రియ జులై 1 నుంచి ప్రారంభం.
  • జులై 1 నుంచి జూలై 7, 2024 - ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు
  • జులై 4 నుండి 10 వ తేదీ వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుంది.
  • జులై 8 నుండి 12 వరకు - వెబ్ ఆప్షన్ ఎంపిక
  • ఐచ్చికాల మార్పునకు అవకాశం - జులై 13, 2024.
  • జులై 16 వ తేదీన సీట్ల కేటాయింపు
  • జులై 17 నుంచి 22 - సెల్స్ జాయినింగ్, కళాశాలలో రిపోర్టింగ్
  • జులై 19వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి.
  • అధికారిక వెబ్ సైట్ - https://cets.apsche.ap.gov.in/

ఏపీ ఈఏపీసెట్-2024 పరీక్షలను కాకినాడ జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 142 ప‌రీక్ష కేంద్రాల్లో మే 16 నుంచి 23 వ‌ర‌కు ప‌రీక్షలు జ‌రిగాయి.

ఈ ప‌రీక్షల‌కు రాష్ట్ర వ్యాప్తంగా 3,62,851 మంది ద‌రఖాస్తు చేసుకోగా, అందులో 3,39,139 మంది ప‌రీక్షల‌కు హాజ‌ర‌య్యారు. అంటే 93.47 శాతం మంది ప‌రీక్షలు రాశారు. ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ కల్పించి వీటి ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు.

ఈ ఏడాది ఇంజినీరింగ్ విభాగంలో 2,74,213 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,58,374 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,95092 మంది ఉత్తీరణ సాధించారు. అగ్రికల్చర్ విభాగంలో 88,638 మంది దరఖాస్తు చేసుకోగా 80,766 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 70,352 మంది ఉత్తీర్ణత సాధించారు.

మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి?

  • Step 1 : అభ్యర్థులు ముందుగా ఈ వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/ లింక్ పై క్లిక్ చేయండి.
  • Step 2 : అనంతరం హోంపేజీలో ఏపీ ఈఏపీసెట్ 2024 పై క్లిక్ చేయండి.
  • Step 3 : హోంపేజీలో రిజల్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • Step 4 : విద్యార్థి రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి ఫలితాలు పొందవచ్చు.

సంబంధిత కథనం