AP EAMCET Key : ఏపీ ఎంసెట్‌ ‘కీ’ విడుదల - డైరెక్ట్‌ లింక్‌ ఇదే-ap eamcet 2023 answer key released ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Eamcet 2023 Answer Key Released

AP EAMCET Key : ఏపీ ఎంసెట్‌ ‘కీ’ విడుదల - డైరెక్ట్‌ లింక్‌ ఇదే

Maheshwaram Mahendra Chary HT Telugu
May 24, 2023 12:33 PM IST

AP EAPCET - 2023 Latest Updates: ఏపీ ఎంసెట్ కీ వచ్చేసింది. ఈ మేరకు అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. అభ్యంతరాలను మే 26వ తేదీ ఉదయం 9 లోపు పంపాలని స్పష్టం చేశారు.

ఏపీ ఎంసెట్ కీ విడుదల
ఏపీ ఎంసెట్ కీ విడుదల

AP Engineering, Agriculture and Pharmacy Common Entrance Test: ఏపీ ఎంసెట్ విద్యార్థులకు కీలక అలర్ట్ ఇచ్చారు అధికారులు. ఇంజినీరింగ్ తో పాటు అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షల ప్రాథమిక 'కీ' లను విడుదల చేశారు. అభ్యంతరాలుంటే 26వ తేదీ ఉదయం 9లోపు తెలపాలని సూచించారు. ఈ మేరకు ఈఏపీసెట్ ఛైర్మన్‌ రంగజనార్దన్ ఓ ప్రకటనలో తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

ఈ నెల 15న మొదలైన ఈఏపీసెట్‌ పరీక్షలకు 93.38 శాతం మంది విద్యార్థులు హాజరుకాగా... ఇంజినీరింగ్‌ విభాగంలో 2,24,724 మంది, ఫార్మసీ, అగ్రికల్చర్‌ విభాగాల్లో 90,573 మంది విద్యార్థులు ఉన్నారు.ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల ప్రాథమిక ‘కీ’ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ https://cets.apsche.ap.gov.in/ లోకి వెళ్లాలి.

'కీ' ఇలా డౌన్లోడ్ చేసుకోండి..

విద్యార్థులు మొదటగా https://cets.apsche.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

Master Question Paper With Preliminary Keys అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

క్లిక్ చేయగానే Engineering మరియు Agriculture & Pharmacy ప్రాథమిక కీ ఆప్షన్లు కనిపిస్తాయి.

సెషన్ల వారిగా రాసిన విద్యార్థులు ఆయా తేదీలపై క్లిక్ చేయాలి.

'కీ' ఓపెన్ అవుతుంది.

డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి పీడీఎఫ్ ను పొందవచ్చు.

అభ్యంతరాలకు గడువు…

ఇక ప్రాథమిక కీ లో ఉండే అభ్యంతరాలను మే 26వ తేదీ లోపు పంపాలని అధికారులు స్పష్టం చేశారు. నిర్ణీత నమూనాలో వీటిని సమర్పించాల్సి ఉంటుంది.

విద్యార్థులు మొదటగా https://cets.apsche.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

కీ అబ్జెక్షన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి.

మీ వివరాలు డిస్ ప్లే అవుతాయి.

కీలోని అభ్యంతరాలను కోడ్ చేస్తూ తగిన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది.

TS EAMCET Results : మరోవైపు తెలంగాణ ఎంసెట్ ఫలితాలపై(TS EAMCET Results 2023) కీలక అప్డేట్ వచ్చింది. ఈ నెల 25న ఎంసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. 25వ తేదీ ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్ ఫలితాలు విడుదల చేస్తారు. జేఎన్‌టీయూ హైదరాబాద్‌లోని గోల్డెన్‌ జూబ్లీ హాల్ లో ఫలితాలను విడుదల చేస్తారని ఎంసెట్‌ కన్వీనర్‌ డా. బి.డీన్‌ కుమార్‌ తెలియజేశారు. మే 10, 11 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌, మెడికల్‌ విభాగాలకు, మే 12 నుంచి 15వరకు ఆరు విడతల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌కు పరీక్షలను నిర్వహించారు. ఇటీవలే అగ్రికల్చర్, మెడికల్, ఇంజినీరింగ్ స్ట్రీమ్ ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్లను విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది ఫలితాల విడుదలకు ఏర్పాట్లు చేశారు.

IPL_Entry_Point