AP Govt Jobs : ఏపీ వైద్యారోగ్యశాఖ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ - 488 పోస్టుల భర్తీకి ప్రకటన, వివరాలివే-ap dme notification for filling 488 assistant professor posts in government medical colleges ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt Jobs : ఏపీ వైద్యారోగ్యశాఖ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ - 488 పోస్టుల భర్తీకి ప్రకటన, వివరాలివే

AP Govt Jobs : ఏపీ వైద్యారోగ్యశాఖ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ - 488 పోస్టుల భర్తీకి ప్రకటన, వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 24, 2024 06:37 AM IST

DME AP Recruitment 2024 : ఏపీలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుడుదలైంది. మొత్తం 488 ఉద్యోగాలను రిక్రూట్ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబరు 9వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో  అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి శుక్రవారం ప్రకటనను జారీ చేసింది. మొత్తం 488 ఉద్యోగాలను రిక్రూట్ చేయనున్నారు.

ఈ పోస్టులను రెగ్యూలర్ బేస్ విధానంలోనే భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తులకు సెప్టెంబర్ 9వ తేదీని తుది గడువుగా పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు https://dme.ap.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు.

ముఖ్య వివరాలు :

ఉద్యోగ ప్రకటన - డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఏపీ వైద్యారోగ్యశాఖ.

ఉద్యోగ ఖాళీల సంఖ్య - 488

భర్తీ చేసే ఉద్యోగాలు - అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

అర్హతలు - మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (MD/MS/DNB/DM) ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు.

దరఖాస్తు విధానం - ఆన్‌లైన్‌

దరఖాస్తు రుసుం - ఓసీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500 చెల్లించాలి.

దరఖాస్తుకులకు తుది గడువు - 09.09.2024

అధికారిక వెబ్ సైట్ - https://dme.ap.nic.in/

ఆన్ లైన్ అప్లికేషన్ లింక్ - https://dmeaponline.com/

997 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:

ఇటీవలనే ఏపీ వైద్యారోగ్య శాఖ ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. డీఎంఈ(డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) పరిధిలోని వైద్య కళాశాలల్లోని వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్, సూపర్ స్పెషాలిటీ ఖాళీలను భర్తీ చేయనుంది. అన్ని పోస్టులు కలిపి 997 ఉద్యోగాలు ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తులకు ఆగస్టు 27వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

ఈ నోటిఫికేషన్ లో చూస్తే సీనియర్ రెసిడెంట్ (క్లినికల్) పోస్టులు 425 ఉండగా… సీనియర్ రెసిడెంట్ (నాన్ క్లినికల్) ఉద్యోగాలు 479 ఉన్నాయి. ఇక సూపర్ స్పెషాలిటీ కింద 93 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 997గా ఉంది.

  • ఉద్యోగ ప్రకటన - డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఏపీ వైద్యారోగ్యశాఖ.
  • ఉద్యోగ ఖాళీలు మొత్తం - 997
  • భర్తీ చేసే పోస్టులు - సీనియర్ రెసిడెంట్, సూపర్ స్పెషాలిటీ ఉద్యోగాలు.
  • అర్హతలు - మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ/ ఎండీఎస్‌) ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు.
  • దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏపీ మెడికల్ కౌన్స్సిల్ లో రిజిస్ట్రర్ అయి ఉండాలి.
  • 44 ఏళ్ల లోపు వయసు ఉన్న అభ్యర్థులు అర్హులవుతారు.
  • ఎంపికైన అభ్యర్థులు ఏడాది పని చేయాల్సి ఉంటుంది.
  • జీతం - నెలకు రూ.70,000 చెల్లిస్తారు.
  • దరఖాస్తు విధానం - ఆన్‌లైన్‌
  • దరఖాస్తు రుసుం - ఓసీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500 చెల్లించాలి.
  • దరఖాస్తుకులకు తుది గడువు - 27 ఆగస్టు 2024.
  • అధికారిక వెబ్ సైట్ - https://dme.ap.nic.in/
  • ఆన్ లైన్ అప్లికేషన్ లింక్ - https://dmeaponline.com/