AP IAS IPS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీ- సీఆర్‌డీఏ కమిషనర్‌గా కన్నబాబు
AP IAS IPS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 25 ఐఏఎస్, 27 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
AP IAS IPS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ట్రాన్స్ ఫర్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 మంది ఐఏఎస్ లు, 27 మంది ఐపీఎస్ లను సీఎస్ విజయానంద్ బదిలీ చేశారు. ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్ గా రాజీవ్ కుమార్ మీనాను నియమించారు. ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీపీగా బి.రాజకుమారి, శాంతిభద్రతల అదనపు డీజీగా ఎన్.మధుసూదన్‌రెడ్డి నియమితులయ్యారు. ఐజీపీ (ఆపరేషన్స్),టెక్నికల్ సర్వీసెస్ ఐజీపీ(అదనపు బాధ్యతలు) సీహెచ్ శ్రీకాంత్, ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్‌గా జి. పాలరాజు బదిలీ అయ్యారు.
27 మంది ఐపీఎస్ లు బదిలీ
- పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ గా రాజీవ్ కుమార్ మీనా
- లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా మధుసూదన్ రెడ్డి
- టెక్నీకల్ సర్వీసెస్ ఐజీగా శ్రీకాంత్
- ఎఫ్ఎస్ ఎల్ డైరెక్టర్ గా పాలరాజు
- ఏసీబీ డైరెక్టర్ గా రాజ్యలక్ష్మీ
- ఏపీఎస్పీ ఐజీగా రాజకుమారి
- స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ డీఐజీ గా అన్బురాజన్
- గ్రేహౌండ్స్ డీఐజీ గా బాబ్జీ
- ఏపీఎస్పీ డీఐజీ గా ఫకీరప్ప
- కర్నూలు ఎస్పీగా విక్రాంత్ పాటిల్
- తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు
- ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగా సుబ్బారాయుడు
- ఏపీఎస్పీ కర్నూలు కమాండెంట్ గా దీపిక
- లీగల్, హ్యూమన్ రైట్స్ కో ఆర్డినేషన్ ఎస్పీగా సుబ్బారెడ్డి
- సీఐడీ ఎస్పీలుగా పరమేశ్వర్ రెడ్డి, శ్రీధర్
- విశాఖపట్నం డీసీపీ గా కృష్ణకాంత్ పాటిల్
- అల్లూరి సీతారామరాజు అదనపు ఎస్పీగా ధీరజ్
- అల్లూరి సీతారామరాజు ఆపరేషన్ అదనపు ఎస్పీగా జగదీష్
- ఇంటెలిజెన్స్ ఎస్పీగా రామ్మోహన్ రావు
- సీఐడీ ఎస్పీగా, శ్రీదేవిరావు, చక్రవర్తి
- కడప ఎస్పీగా అశోక్ కుమార్
- ఇంటెలిజెన్స్ ఎస్పీగా రమాదేవి
- విజయవాడ డీసీపీ అడ్మిన్ గా సరిత
- కాకినాడ ఎస్పీగా బిందుమాధవి
భారీగా ఐఏఎస్ లు బదిలీ
ఏపీలో భారీగా ఐఏఎస్‌లకు బదిలీ అయ్యారు. మొత్తం 25 మంది ఐఏఎస్‌లకు సీఎస్ విజయానంద్ పోస్టింగ్‌లు, బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఆర్‌డీఏ కమిషనర్‌గా కన్నబాబు, సీఎం ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్ నియమితులయ్యారు. జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అజయ్ జైన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బి. రాజశేఖర్, జీవీఎంసీ కమిషనర్‌గా సంపత్ కుమార్ ను నియమించారు.
పబ్లిక్ ఎంట్రర్‌ప్రైజెస్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సునీత, సాధారణ పరిపాలనా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణీ మోహన్‌కు ఆర్కియాలజీ, మ్యూజియం కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.పీయూష్ కుమార్‌ను ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా కొనసాగిస్తూ, ప్లానింగ్ డిపార్టమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ముఖేష్ కుమార్ మీనాను జీఏడీ పోలిటికల్ సెక్రటరీగా, ఎస్ సురేష్ కుమార్‌ను ఎంఏ అండ్ యూడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. సౌరబ్ గౌర్‌ను సివిల్ సప్లైస్ కమిషనర్‌గా, కోన శశిధర్‌ను ఉన్నత విద్య, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యదర్శిగా పూర్తి అదనపు భాద్యతలు అప్పగించారు. కాటమనేని భాస్కర్‌ను ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ కార్యదర్శిగా బదిలీ చేశారు.
ఆర్టీజీఎస్, గ్రామ వార్డు సచివాలయాలు కార్యదర్శిగా పూర్తి అదనపు భాద్యతలు అప్పగిస్తున్నట్లు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. వి.కరుణను సెర్ప్ సీఇవోగా బదిలీ అయ్యారు. ఎన్.యువరాజ్‌కు ఐ అండ్ ఐ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎంఎం నాయక్‌ను సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా, ప్రవీణ్ కుమార్‌ను పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఎంవీ శేషగిరిబాబును కమిషనర్ లేబర్ డిపార్టమెంట్‌కు బదిలీ అయ్యారు. ఎస్ సత్యనారాయణను బీసీ వెల్పేర్, ఈడబ్ల్యూఎస్ సెక్రటరీగా నియమించారు. వాడ్రేవు వినయ్ చంద్‌ను రెవెన్యూ శాఖ కార్యదర్శిగా నియమించారు. వీరపాండ్యన్‌ను వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా నియమించారు. హరినారాయణ్‌ను ఐజీ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్‌కు బదిలీ చేశారు. పీఎస్ గిరీషాను ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీగా నియమించారు. పి.సంపత్ కుమార్‌ను సీడీఎంఏగా బదిలీ చేశారు. వి అభిషేక్‌ను పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సంబంధిత కథనం