AP Police Recruitment: ఆ జిల్లాల్లో పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు వాయిదా, ప్రధాని పర్యటన, పండుగలే కారణం..
AP Police Recruitment: ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షల్లో భాగంగా నిర్వహిస్తున్న శరీర కొలతలు, దేహ దారుఢ్య పరీక్షలు పలు జిల్లాల్లో వాయిదా పడ్డాయి. ఈ ఏడాది జనవరి 11 నుంచి 20వ తేదీ మధ్య అయా జిల్లాల్లో వాటిని నిర్వహిస్తారు.
AP Police Recruitment: ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షల్లో భాగంగా నిర్వహిస్తోన్న ఫిజికల్ ఈవెంట్స్ వాయిదా పడ్డాయి.వైకుంఠ ఏకాదశితో పాటు ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అయా జిల్లాల్లో ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి.
విశాఖపట్నంలో జనవరి 8వ తేదీన ప్రధాని మోదీ పర్యటన జరుగనుంది. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఫిజికల్ ఈవెంట్స్ పరీక్షలను నిర్వహించేందుకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాట్లు చేసింది. ప్రధాని మోదీ సభకు లక్షలాది మంది ప్రజలను సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖలో భారీ రోడ్ షోకు ఏర్పాట్లు చేస్తున్నారు. 3లక్షల మందితో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో ఫిజికల్ ఈవెంట్స్ వాయిదా వేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో జనవరి 8న జరగాల్సిన పరీక్షలు జనవరి 11న నిర్వహిస్తారు.
అనంతపురంలో జనవరి 8 నుంచి 10 వరకు జరగాల్సిన జరగాల్సిన శరీర కొలతల పరీక్షలు (Physical Measurement Test - PMT) శారీరక సామర్థ్య పరీక్షలు (Physical Efficiency Test - PET) వైకుంఠ ఏకాదశి పండుగ మరియు ఇతర సాంకేతిక కారణాలతో వాయిదా వేశారు. వాయిదా వేసిన పరీక్షలు జనవరి 17, 18, 20వ తేదీల్లో నిర్వహిస్తారు.
చిత్తూరు జిల్లాలో జనవరి 8,9 తేదీల్లో ఈవెంట్లు జరగాల్సి ఉండగా వాటిని 17,18 తేదీల్లోనిర్వహిస్తారు.
అభ్యర్థులకు ముఖ్య సూచనలు...
పాత తేదీల్లో పరీక్షల కోసం ఇచ్చిన అడ్మిట్ కార్డ్ (Hall Ticket) కొత్త తేదీల్లో కూడా చెల్లుబాటు అవుతుంది.
సవరించిన తేదీలకు సంబంధించి మీ అడ్మిట్ కార్డ్ మరియు ఒరిజినల్ మరియు అటెస్టడ్ జిరాక్స్ కాపీలను తీసుకు వెళ్లాల్సి ఉంటుంది.
అభ్యర్థులకి మరింత సమాచారం మేరకు APSLPRB అధికారిక వెబ్‌సైట్‌ను లేదా హెల్ప్ లైన్ నెంబర్ 9441450639 కు సంప్రదించగలరు.
సంబంధిత కథనం