CM Jagan: డ్రోన్ల వినియోగంపై విద్యార్థులకు శిక్షణ ఇప్పించండి -ap cm ys jagan review on agriculture department ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan: డ్రోన్ల వినియోగంపై విద్యార్థులకు శిక్షణ ఇప్పించండి

CM Jagan: డ్రోన్ల వినియోగంపై విద్యార్థులకు శిక్షణ ఇప్పించండి

Mahendra Maheshwaram HT Telugu
Aug 05, 2022 05:29 PM IST

వ్యవసాయశాఖపై సీఎం జగన్ సమీక్షించారు. విత్తనాల సరఫరా, ఎరువుల పంపిణీ, వ్యవసాయ ఉత్పత్తులకు అందుతున్న ధరలపై అధికారులతో చర్చించారు. పూర్తిస్థాయిలో ఇ– క్రాపింగ్‌ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

<p>వ్యవసాయంపై సీఎం జగన్ సమీక్ష</p>
<p>వ్యవసాయంపై సీఎం జగన్ సమీక్ష</p> (twitter)

AP CM Jagan Review:ఈ-క్రాపింగ్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలన్నారు ఏపీ సీఎం జగన్. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయశాఖపై సమీక్షించిన ఆయన... అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైతులకు ఎరువులు అందించడంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. రైతులకు గరిష్ఠ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆర్బీకేల్లో ఉన్న అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ నుంచి ప్రతి రోజూ నిరంతరం సమాచారం తెప్పించుకోవాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. విత్తనాల సరఫరా, ఎరువుల పంపిణీ, వ్యవసాయ ఉత్పత్తులకు అందుతున్న ధరలు తదితర అంశాలపై పర్యవేక్షణ ఉండాలని సూచించారు. రైతులకు ఎరువులు అందించడంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. ఎక్కడ నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వైయస్సార్‌ ఉచిత పంటల బీమా పథకంతో ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన భాగస్వామ్యం కానుందని సీఎం తెలిపారు.

వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంపైనా ముఖ్యమంత్రి జగన్ అధికారులతో చర్చించారు. డ్రోన్ల వినియోగంపై మాస్టర్‌ ట్రైనర్లను తయారు చేయాలన్నారు. డ్రోన్ల నిర్వహణ, మరమ్మతుపై శిక్షణ ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గానికి ఒక ఐటీఐ లేదంటే ఒక పాలిటెక్నిక్‌ కాలేజీలోని విద్యార్థులకు డ్రోన్ల వినియోగం, నిర్వహణ, మరమ్మతులపై సంపూర్ణ శిక్షణ ఇప్పించాలన్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత కథనం

టాపిక్