CM Jagan to Tirupathi: సూళ్లూరుపేటలో సిఎం జగన్ పర్యటన వాయిదా
CM Jagan to Tirupathi: ముఖ్యమంత్రి జగన్ నేడు తిరుపతి జిల్లా సూళ్లూరు పేట పర్యటన వాయిదా పడింది. భారీ వర్షంతో తిరుపతి జిల్లా పర్యటన వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు.
CM Jagan to Tirupathi: సిఎం జగన్ తిరుపతి పర్యటన వాయిదా పడింది. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా నేడు పలు కార్యక్రమాల్లో సిఎం జగన్ పాల్గొనాల్సి ఉండగా భారీ వర్షాల కారణంగా పర్యటన వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తడ మండలం మాంబట్టు ఎస్‌ఈజెడ్ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభా ప్రాంగణం వద్ద పలు అభివృద్ది పనులకు తిరుపతి జిల్లా వాకాడ మండలం రాయదరువులో ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు సిఎం శంకుస్థాపన చేయాల్సి ఉంది. . దీంతో పాటు పులికాట్ సరస్సు సముద్ర ముఖద్వారం పునరుద్దరించే పనులకు శ్రీకారం చుడతారని ప్రకటించారు.
మత్స్యకారులకు పలు పథకాలు…
ఓఎన్జీసీ పైప్‌లైన్ కారణంగా ఉపాధి కోల్పోయిన డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23,458 మత్స్యకార కుటుంబాలకు ఓఎన్జీసీ ద్వారా నాలుగో విడత పరిహారంగా నెలకు రూ.11,500చొప్పున ఆర్నెల్లకు రూ.69వేల పరిహారాన్ని చెల్లించనున్నారు. ఇందుకుగాను రూ.161.86కోట్ల ఆర్ధిక సాయాన్ని తడ మండలం మాంబట్టు గ్రామంలో జరిగే సభలో నిధుల్ని విడుదల చేస్తారు.
ఏపీలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం ద్వారా సముద్రంలో చేపల వేటపై నిషేధం ఉన్న సమయంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వరకు అర్హత ఉన్న ప్రతి మత్స్యకార కుటుంబానికి ఏటా రూ.10వేల రుపాయలు చెల్లిస్తున్నారు. మర, యాంత్రిక పడవలతో పాటు సముద్రంలో సాంప్రదాయ పడవలపై చేపలు వేటాడే వారికి కూడా మత్స్యకార భరోసా ద్వారా ఆర్ధిక సాయం అందిస్తున్నారు. నాలుగేళ్లలో ఈ పథకంలో రూ.538కోట్ల రుపాయలు అందించారు.
మత్స్యకారులకు సంక్షేమ కార్యక్రమాలు…
చేపల వేటలో మరణించిన మత్స్యకార కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం చెల్లిస్తున్నారు.ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల ద్వారా మత్స్యకారుల జీవన ప్రమానాలను పెంచేలా రూ.3,793కోట్ల రుపాయల వ్యయంతో ప్రపంచ స్థాయిలో 10ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
మరోవైపు ఏపీలో చేపల వేటపై ఆధారపడిన మత్స్యకారులకు డీజిల్ ఆయిల్‌పై సబ్సిడీ అందిస్తున్నారు. లీటరుకు రూ.9రుపాయల సబ్సిడీని రాస్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. స్మార్ట్ కార్డుల ద్వారా ఆయిల్ కొనుగోలు సమయంలోనే ధర తగ్గించి కొనుగోలు చేసేలా అమలు చేస్తున్నారు. నాలుగున్నరేళ్లలో డీజిల్ సబ్సిడీ ద్వారా రూ.118.27కోట్ల లబ్దిని చేకూర్చారు.
ప్రభుత్వాల నిర్లక్ష్యంతో మూసుకుపోయిన పులికాట్ సరస్సు ముఖద్వారాన్ని రూ.94.75కోట్ల రుపాయల వ్యయంతో పునరుద్ధరించి సరస్సుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు శ్రీకారం చుడుతున్నారు. తద్వారా 20వేల మంది మత్స్యకారులకు లబ్ది చేకూరనుంది.
ఏపీలో 1,15,618మంది లబ్దిదారులకు వైఎస్సార్ మత్స్యకార భరోసా ద్వారా నాలుగున్నరేళ్లలో రూ.538.01కోట్లను చెల్లించారు. 20,514 డీజిల్ పడవలకు రూ.118.27కోట్లను డీజిల్ సబ్సిడీగా చెల్లించారు. ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన 159మంది మత్స్యకారులకు రూ.15.90కోట్ల పరిహారం చెల్లించారు. జిఎస్పీసి తవ్వకాలతో ఉపాధి కోల్పోయిన 16,554కుటుంబాలకు రూ.78.22 పరిహారం చెల్లించారు. ఓఎన్జీసీ తవ్వకాలతో ఉపాధి కోల్పోయిన 23,458మంది కుటుంబాలకు రూ.485.58కోట్లను చెల్లించారు. అక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీల ద్వారా 41,850మందికి రూ.3,250కోట్లను చెల్లించారు.
అక్వా రైతులకు సబ్సిడీ విద్యుత్‌ను యూనిట్ రూ.1.50కు అందిస్తున్నారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.451.77కోట్ల సబ్సిడీలతో కలిపి ఇప్పటి వరకు రూ.3250కోట్లను అక్వా సాగుదారులకు చెల్లించినట్లు ఏపీ ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ఏపీ నుంచి ఏటా మత్స్యకారులు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళుతుండటంతో రాష్ట్రంలో కొత్తగా 10ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 4 పోర్టుల్ని నిర్మిస్తున్నారు. రెండేళ్ల క్రితం పాకిస్తాన్ కోస్ట్‌గార్డ్‌కు చిక్కిన 23మంది మత్స్యకారుల్ని ఏపీ ప్రభుత్వం విదేశాంగ శాఖ ద్వారా సంప్రదింపులతో విడుదల చేసింది. వారికి ఒక్కొక్కరికి రూ.5లక్షల ఆర్ధిక సాయం అందించినట్లు రాష్ట్రం ప్రభుత్వం చెబుతోంది.