CM Chandrababu : కేంద్ర బడ్జెట్ ను స్వాగతించిన సీఎం చంద్రబాబు, ప్రజానుకూల ప్రగతిశీల బడ్జెట్ అంటూ కితాబు-ap cm chandrababu welcomes union budget 2025 reflects pm modi viksit bharat ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Chandrababu : కేంద్ర బడ్జెట్ ను స్వాగతించిన సీఎం చంద్రబాబు, ప్రజానుకూల ప్రగతిశీల బడ్జెట్ అంటూ కితాబు

CM Chandrababu : కేంద్ర బడ్జెట్ ను స్వాగతించిన సీఎం చంద్రబాబు, ప్రజానుకూల ప్రగతిశీల బడ్జెట్ అంటూ కితాబు

Bandaru Satyaprasad HT Telugu
Feb 01, 2025 05:44 PM IST

CM Chandrababu : కేంద్ర బడ్జెట్ ను సీఎం చంద్రబాబు స్వాగతించారు. రాబోయే ఐదేళ్లలో ఆర్థిక వృద్ధికి ఆరు కీలక రంగాలను బడ్జెట్‌ గుర్తించిందన్నారు. బడ్జెట్ లో మధ్యతరగతి ప్రజలు, మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారన్నారు.

కేంద్ర బడ్జెట్ ను స్వాగతించిన సీఎం చంద్రబాబు, ప్రజానుకూల ప్రగతిశీల బడ్జెట్ అంటూ కితాబు
కేంద్ర బడ్జెట్ ను స్వాగతించిన సీఎం చంద్రబాబు, ప్రజానుకూల ప్రగతిశీల బడ్జెట్ అంటూ కితాబు

CM Chandrababu : కేంద్ర బడ్జెట్-2025 పై సీఎం చంద్రబాబు స్పందించారు. బడ్జెట్ ను స్వాగతిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ దార్శనికతను బడ్జెట్ ప్రతిబింబిస్తుందన్నారు. మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారన్నారు.

yearly horoscope entry point

"కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రజానుకూల, ప్రగతిశీల బడ్జెట్‌ను ప్రవేశపెట్టినందుకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ బడ్జెట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ కోసం దార్శనికతను ప్రతిబింబిస్తుంది. ఇది మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తుంది. అదే సమయంలో రాబోయే ఐదు సంవత్సరాలలో వృద్ధికి ఆరు కీలక రంగాలను గుర్తించింది.

బడ్జెట్ జాతీయ శ్రేయస్సు వైపు ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. ఇది సమగ్రమైన బ్లూప్రింట్‌గా పనిచేస్తుంది, మన దేశానికి సంపన్న భవిష్యత్తును వాగ్దానం చేస్తుంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మధ్యతరగతికి పన్ను ఉపశమనం అందిస్తుంది. నేను ఈ బడ్జెట్‌ను స్వాగతిస్తున్నాను"- సీఎం చంద్రబాబు

వైసీపీ విమర్శలు

బడ్జెట్ లో బీహార్ కు ఫుల్, ఏపీకి నిల్ అంటూ వైసీపీ విమర్శలు చేసింది. బడ్జెట్‌లో ఏపీ ఊసేఎత్తలేదని, బీహార్‌కి మాత్రం ప్యాకేజీలు ప్రకటించిందని తెలిపింది. ఏపీకి కేటాయింపులు లేకపోయినా కేంద్రంపై టీడీపీ, జనసేన నేతలు కనీసం నోరెత్తడంలేదని ఆరోపించింది. ఎన్డీయేలో భాగస్వామిగా ఉండి ఏపీకి ఏం సాధించారని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ప్రశ్నించింది.

ఏపీకి కేటాయింపులు

కేంద్ర బడ్జెట్‌ 2025-26లో ఏపీ కేటాయింపుపై స్పష్టత వచ్చింది. పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, విశాఖ పోర్టుకు బడ్జెట్ లో నిధులు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు కేటాయించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి బ్యాలెన్స్‌ గ్రాంటుగా మరో రూ.12,157 కోట్ల కేటాయింపులు చేసింది. దీంతో పాటు విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.3,295 కోట్లు, విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు నిధులు బడ్జెట్‌లో కేటాయించారు.

పోలవరానికి కేంద్రం కేటాయించిన రూ.12,157 కోట్లను బడ్జెట్ లో ప్రస్తావించింది. దీంతో పాటు రూ.30,436 కోట్లకు ఆమోదం తెలుపుతున్నట్లు వెల్లడించారు. అదే విధంగా 41.15 మీటర్ల వరకు నీరు నిలిపేలా నిర్మాణం చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ఏపీలోని విమానాశ్రయాలు, పోర్టులు, రోడ్లు, రైల్వే కనెక్టివిటీలోనూ కేటాయింపులు చేసినట్లు స్పష్టం చేసింది. వీటిపై అధికారికంగా లెక్కలు వెల్లడి కావాల్సి ఉంది.

వికసిత్ భారత్ కు ఒక రోడ్ మ్యాప్

"కేంద్ర బడ్జెట్ 2025-26 కేవలం లెక్కల పద్దు మాత్రమే కాదు, ప్రధాని మోదీ దార్శనికత, స్వావలంబన, వృద్ధి మరియు శ్రేయస్సుతో కూడిన వికసిత్ భారత్ కు ఒక రోడ్ మ్యాప్. రైతు సంక్షేమం నుంచి మధ్యతరగతికి ఉపశమనం వరకు, మహిళలు, యువతకు సాధికారత కల్పించడం నుంచి స్టార్టప్ లకు ప్రోత్సాహం వరకు, మౌలిక సదుపాయాలు కల్పన నుంచి పెట్టుబడులను ప్రోత్సహించడం వరకు, ఈ బడ్జెట్ దేశంలోని ప్రతి ఒక్కరిని, వారి కలను సాకారం చేసే దిశగా సాగింది. సాహసోపేతమైన, సమ్మిళిత, భవిష్యత్తుకు బంగారు బాట పరిచేలా ఉన్న బడ్జెట్ ను రూపొందించినందుకు నరేంద్ర మోదీకి, ఆర్థికమంత్రి నిర్మలా సీతరామన్ కృతజ్ఞతలు" - కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

Whats_app_banner