CBN Davos Tour : సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన-సక్సెస్ అంటోన్న కూటమి పార్టీలు, పెట్టుబడులేవంటూ వైసీపీ సెటైర్లు-ap cm chandrababu lokesh davos tour for investments ysrcp satires on mous signed ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn Davos Tour : సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన-సక్సెస్ అంటోన్న కూటమి పార్టీలు, పెట్టుబడులేవంటూ వైసీపీ సెటైర్లు

CBN Davos Tour : సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన-సక్సెస్ అంటోన్న కూటమి పార్టీలు, పెట్టుబడులేవంటూ వైసీపీ సెటైర్లు

Bandaru Satyaprasad HT Telugu
Jan 25, 2025 01:44 PM IST

CBN Davos Tour : ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ దావోస్ లో పర్యటించి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను దిగ్గజ కంపెనీల ప్రతినిధులకు వివరించారు. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన సక్సెస్ అయ్యిందని కూటమి పార్టీలు అంటున్నాయి. ఏపీకి పెట్టుబడులు రాలేదని వైసీపీ విమర్శలు చేస్తుంది.

సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన-సక్సెస్ అంటోన్న కూటమి పార్టీలు, పెట్టుబడులేవంటూ వైసీపీ సెటైర్లు
సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన-సక్సెస్ అంటోన్న కూటమి పార్టీలు, పెట్టుబడులేవంటూ వైసీపీ సెటైర్లు

CBN Davos Tour : పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ లో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ బృందం నాలుగు రోజుల పాటు 30కి పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీలు నిర్వహించారు. 30 లక్షల కోట్ల పెట్టుబడుల సమీకరణకు ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను సీఎం చంద్రబాబు ప్రమోట్ చేశారని ప్రభుత్వ వర్గాలు, కూటమి పార్టీలు చెబుతున్నాయి. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన సక్సెజ్ అయ్యిందని అంటున్నాయి. అయితే ఒక్క ఒప్పందం కూడా చేసుకోలేదని, ఏపీకి పెట్టుబడులు రాలేదని ప్రతిపక్ష వైసీపీ విమర్శలు చేస్తుంది. దావోస్ పర్యటన ఫెయిల్ అయ్యిందని విమర్శిస్తుంది.

yearly horoscope entry point

ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు బృందం స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొన్నారు. ప్రపంచంలోని టాప్ కంపెనీలు ఈ సదస్సులో పాల్గొని తమ వ్యాపార విస్తరణకు మార్గాలను సుగమనం చేసుకుంటాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు భారత్ సహా పలు దేశాల నుంచి ప్రభుత్వ ప్రతినిధులు పోటీపడుతుంటారు. పెట్టుబడులు సాధించేందుకు దావోస్ లో పర్యటించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ మొదటి రోజు నుంచి ప్రముఖ కంపెనీల సీఈవోలు, వారి ప్రతినిధులు, మేనేజ్మెంట్ డైరెక్టర్ లతో వరుస సమావేశాలు నిర్వహించారు. దాదాపు నాలుగు రోజుల పర్యటనలో సుమారు 30కి పైగా ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ బృంద సభ్యులు భేటీ అయ్యారు.

కంపెనీల ఆసక్తి

ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ను మెరుగుపరిచే దిశగా సీఎం చంద్రబాబు దావోస్ సదస్సులో సాంకేతికత, మౌలిక సదుపాయాల అభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ వంటి విషయాలను ప్రస్తావించారు. పెట్టుబడులకు ఏపీ సరైన గమ్యస్థానంగా ప్రమోట్ చేశారు. ఏపీలో పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ విధానాలు, ఆవిష్కరణలను దిగ్గజ కంపెనీల ప్రతినిధులను వివరించారు. అధునాతన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, డిజిటల్ టెక్నాలజీ ప్రాజెక్టులు, సేంద్రీయ వ్యవసాయం వంటి విభాగాల్లో ఏపీలో ఉన్న అవకాశాలను తెలియజేశారు. దీంతో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపాయి. ఐటీ, ఏఐ, ఫార్మా, డేటా హబ్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ఉన్న అవకాశాలను సీఎం చంద్రబాబు బృందం కంపెనీల ప్రతినిధులకు వివరించారు.

క్లీన్ ఎనర్జీ పాలసీ

ఎన్విజన్ సీఈవో లీ జంగ్ తో దావోస్ ఏపీ మంత్రి నారా లోకేశ్ తో భేటీ అయ్యారు. 2030నాటికి గ్రీన్ హైడ్రోజన్ రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి.. ఏడున్నర లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి లోకేశ్ అన్నారు. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 రెన్యువబుల్ ఎనర్జీ పరిశ్రమ విడిభాగాల తయారీని కూడా ప్రోత్సహిస్తున్నామని లీ జంగ్ తో తెలిపారు. ఏపీని గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆ దిశగా పెట్టుబడులు వచ్చాయన్నారు. ఎన్టీపీసీ, జెన్కోతో కలిసి విశాఖలో రూ.1.87 లక్షల కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు.

ఏపీ బ్రాండ్ ఇమేజ్ ప్రమోట్

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నేతృత్వంలో దావోస్ వెళ్లిన బృందం... సుమారు 30 లక్షల కోట్ల పెట్టుబడుల సమీకరణకు ఏపీ బ్రాండ్‌ ఇమేజ్ ను ప్రమోట్ చేశారు. ఏపీలోని అనుకూలతలను పారిశ్రామికవేత్తలకు, వివిధ దేశాల ప్రతినిధులకు, దిగ్గజ కంపెనీల సీఈవోలకు వివరించారు. దీంతో పలు కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి. అపోలో టైర్స్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ నీరజ్ కన్వర్ తో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. ఏపీలో కొత్త టైర్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయాలని కోరారు. టైర్ టెక్నాలజీ ఆవిష్కరణలు, ఏపీ నాలెడ్జ్ ఎకానమీకి దోహదపడేలా రాష్ట్రంలో ఆర్ అండ్ డి కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు.

పెట్టుబడుల పోటీ

పెట్టుబడుల ఆకర్షణకు ఏపీ, తెలంగాణ పోటీపడ్డాయి. అయితే ఇప్పటికే మెట్రోపాలిటన్ సిటీగా పేరుపొందిన హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపాయి. ఈ మేరకు పెట్టుబడుల ఎంవోయూలపై సంతకాలు చేశాయి. ఏపీ రాజధాని అమరావతి ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి కాకపోవడం, విశాఖను పెట్టుబడులు పెట్టేందుకు అంతగా ఆసక్తి చూపకపోవడంతో ఒప్పందాలపై సంతకాలు జరగలేదు. కూటమి ప్రభుత్వం రాజధాని అభివృద్ధికి శరవేగంగా పనిచేస్తుంది. దీంతో రానున్న రోజుల్లో అమరావతి సహా ఏపీలో పెట్టుబడులు రానున్నాయని ప్రభుత్వాధినేతలు అంటున్నారు. అయితే దావోస్ సదస్సుల్లో జరిగిన సమావేశాల్లో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపాయి.

వైసీపీ విమర్శలు

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దావోస్ పర్యటనపై వైసీపీ విమర్శలు చేస్తుంది. దావోస్ పర్యటనలో ఏపీకి పెట్టుబడులు లేదని, ఒప్పందాలపై సంతకాలు జరగలేదని సెటైర్లు వేస్తుంది. పక్క రాష్ట్రాల్లో వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తిగా లేవని ఆరోపించింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని అందుకే పెట్టుబడుదారులు ఏపీకి వచ్చేందుకు ఆసక్తి చూపడంలేదని విమర్శలు చేస్తుంది. కనీసం ఒక్క ఒప్పందం కూడా చేసుకోలేదని సెటైర్లు వేస్తుంది.

Whats_app_banner