CM Chandrababu : సంక్షేమ పథకాల అమలులో వెనకడుగు వేయం, అప్పు చేసైనా ఆ స్కీమ్స్ అమలు చేస్తాం-సీఎం చంద్రబాబు-ap cm chandrababu comments on super six welfare schemes not interested to divert funds ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Chandrababu : సంక్షేమ పథకాల అమలులో వెనకడుగు వేయం, అప్పు చేసైనా ఆ స్కీమ్స్ అమలు చేస్తాం-సీఎం చంద్రబాబు

CM Chandrababu : సంక్షేమ పథకాల అమలులో వెనకడుగు వేయం, అప్పు చేసైనా ఆ స్కీమ్స్ అమలు చేస్తాం-సీఎం చంద్రబాబు

Bandaru Satyaprasad HT Telugu
Jan 27, 2025 07:50 PM IST

CM Chandrababu : అప్పు చేసైనా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదన్నారు. డబ్బులు ఉంటే పథకాల అమలుకు క్షణం కూడా ఆలోచించమని చెప్పారు. స్టేట్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్‌ లో ఏపీ బీహార్ కంటే వెనుకబడిందన్నారు.

సంక్షేమ పథకాల అమలులో వెనకడుగు వేయం, అప్పు చేసైనా ఆ స్కీమ్స్ అమలు చేస్తాం-సీఎం చంద్రబాబు
సంక్షేమ పథకాల అమలులో వెనకడుగు వేయం, అప్పు చేసైనా ఆ స్కీమ్స్ అమలు చేస్తాం-సీఎం చంద్రబాబు

CM Chandrababu : సంక్షేమ పథకాలు అమలు చేయడానికి నిధుల్లేవని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను పథకాల కోసం మళ్లించలేమన్నారు. డబ్బులు ఉంటే పథకాల అమలుకు క్షణం కూడా ఆలోచించమని చెప్పారు. అప్పు చేసైనా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.

yearly horoscope entry point

"మేము చెప్పిన ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రూ.4 వేలకు పెంచాం. 64 లక్షల మందికి, ఏడాదికి రూ.33 వేల కోట్లు ఇస్తున్నాం. దీపం పథకం కింద ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తున్నాం. అన్న క్యాంటీన్లతో, రూ.5 కే భోజనం పెడుతున్నాం. గత ప్రభుత్వం పెట్టి వెళ్లిన రూ.22 వేల కోట్ల బకాయిలు కట్టాం. గత ప్రభుత్వంలో అప్పులు తెచ్చి, అభివృద్ధి గురించి పూర్తిగా మర్చిపోయారని నీతి ఆయోగ్ రిపోర్ట్ బయట పెట్టింది. అప్పు తెచ్చి ఆదాయం పెంచే వాటిపై ఖర్చు చేయకుండా, రాష్ట్రాన్ని మరింత అప్పుల్లోకి నెట్టేశారు" - సీఎం చంద్రబాబు

నిధులు మళ్లించలేం

ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే అభివృద్ధి పనులు సరిగా చేయలేమని సీఎం చంద్రబాబు అన్నారు. ఇదే కొనసాగితే చివరికి బాధపడేది ప్రజలే, రాష్ట్ర, దేశ భవిష్యత్ కోసం అందరూ ఆలోచించాలని కోరారు. అభివృద్ధి పనులపై నిధులు ఎక్కువ ఖర్చు చేయాలని, అభివృద్ధి పనుల వల్లే సంపద పెరుగుతుందని చెప్పారు. అలాగని అప్పులు చేసి.. పనులు చేస్తే ఇబ్బందులు పెరుగుతాయన్నారు.

'గత ప్రభుత్వ దుష్పరిపాలన, అవినీతి అక్రమాలపై వాస్తవాలు ప్రజలకు తెలియాలి. విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరానికి కేంద్రం నిధులు ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన నిధులను మళ్లించలేను. డబ్బులు ఉంటే.. పథకాల అమలుకు క్షణం కూడా ఆలోచించను. మాట తప్పడం ఇష్టంలేక ప్రజలకు వాస్తవం చెబుతున్నా. అప్పు చేసి అయినా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలు చేస్తాం' అని సీఎం చంద్రబాబు అన్నారు.

బీహార్ కంటే వెనుకబడ్డాం

'ప్రధాని అధ్యక్షత వహించే నీతి ఆయోగ్, స్టేట్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్‌పై నివేదిక ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసానికి నీతి అయోగ్‌ నివేదికే నిదర్శనం. నాయకుల సమర్థతపై ఆ రాష్ట్ర ప్రజల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. నాయకుల అసమర్థత వలన రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారుతుంది అనటానికి, ఈ నివేదికే ఒక ఉదాహరణ.

స్టేట్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ -2025 నివేదికలో, 18 రాష్ట్రాలకు ర్యాంకులు ఇస్తే, ఏపీ 17వ స్థానంలో ఉంది. బీహార్ ఏపీ కంటే పైన ఉంది. నీతి ఆయోగ్ తయారు చేసిన రిపోర్ట్ లో గత 5 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై క్లారిటీ ఇచ్చారు. అప్పులు చేసి తిరిగి చెల్లించే శక్తి ఏపీకి లేదు. గత ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టు పెట్టింది' అని సీఎం చంద్రబాబు అన్నారు.

రాష్ట్రంలో ఉన్న వాస్తవ ఆర్థిక పరిస్థితి ప్రజల ముందు ఉంచుతామని సీఎం చంద్రబాబు అన్నారు. సంపద సృష్టిస్తేనే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందన్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ లో చెప్పిన పథకాలు అమలు చేస్తున్నాం, మిగిలిన పథకాల అమలుకు ఇప్పటికే డేట్లు ఇచ్చామన్నారు. సంక్షేమ పథకాల అమలులో వెనకడుగు వేయమని తెలిపారు.

Whats_app_banner