MP Gorantla Video : గోరంట్ల వీడియో ఇష్యూ.. రాజమౌళి సినిమా ఎగ్జాంపుల్ చెప్పిన సీఐడీ చీఫ్-ap cid chief pv sunil kumar on gorantla madhav video issue ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Cid Chief Pv Sunil Kumar On Gorantla Madhav Video Issue

MP Gorantla Video : గోరంట్ల వీడియో ఇష్యూ.. రాజమౌళి సినిమా ఎగ్జాంపుల్ చెప్పిన సీఐడీ చీఫ్

Anand Sai HT Telugu
Aug 18, 2022 03:00 PM IST

ఎంపీ గోరంట్ల వివాదంపై చర్చ నడుస్తూనే ఉంది. తాజాగా ఈ అంశంపై సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ స్పందించారు. ఒక పురుషుడు, మహిళ మధ్య జరిగిన వీడియో కాల్ ను వేరొకరు రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారని తెలిపారు.

ఎంపీ గోరంట్ల మాధవ్
ఎంపీ గోరంట్ల మాధవ్

గోరంట్ల వీడియో ఇష్యూపై ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఒక పురుషుడు, మహిళ మధ్య జరిగిన వీడియో కాల్ ను వేరొకరు రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారన్నారు. ఎంపి గోరంట్ల మాధవ్ ఆ విడియోలో ఉన్నట్టు గా కొందరు ఆరోపణలు చేసినట్టుగా చెప్పారని తెలిపారు. వీడియోలో మాట్లాడుకున్న దానిని వేరే ఫోన్ లో రికార్డు చేసి పంపారని వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

ఆ తర్వాత ఫోరెన్సిక్ రిపోర్టు అంటూ.. ఓ పత్రాన్ని వైరల్ చేసినట్టుగా సునీల్ కుమార్ చెప్పారు. అమెరికాలోని ఓ ప్రైవేటు ఫోరెన్సిక్ ల్యాబ్ ఎలా ప్రామాణికమని ప్రశ్నించారు. దానిని మేం గుర్తించబోమన్నారు. జిమ్ క్లిఫోర్డ్ ఇచ్చిన ధృవీకరణ పత్రం కూడా అసలైనది కాదన్నారు. దీన్ని స్వయంగా జిమ్ క్లిఫర్డ్ ఆ అంశాన్ని ధృవీకరించారన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిమ్ క్లిఫార్డ్ కు సీఐడీ తరఫున లేఖ రాశామని సునీల్ కుమార్ వెల్లడించారు. ఆయన నుంచి జవాబు కూడా వచ్చిందన్నారు. తానిచ్చిన రిపోర్ట్ అసలైంది కాదనీ ఈమెయిల్ ద్వారా తెలిపారన్నారు.

'రాజమౌళి సినిమాలో పులులు, సింహాలను ఫోన్ ద్వారా తీసి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపితే అది ఒరిజినల్ గానే చెబుతారు. మహిళ, పురుషుడి మధ్య జరిగిన వీడియో సంభాషణను తనిఖీ చేస్తే మాత్రమే అది అసలైనదా, మార్ఫింగ్ చేశారా అని చెప్పగలం. అదే అంశాన్ని ఎస్పీ ఫకిరప్ప చెప్పారు. ఒరిజినల్ వీడియో క్లిప్ లేకుండా దానిని ఎలా తనిఖీ చేయగలం. నిపుణులు ఇచ్చిన రిపోర్ట్ లో మార్పు చేర్పులు చేస్తే ఇక దానికి ప్రామాణికత ఎక్కడుంది. ఎక్లిప్స్ ఫోరెన్సిక్ సంస్థ ఇచ్చిన నివేదిక ఒరిజినల్ కాదనీ సీఐడీకి పంపిన లేఖలో వెల్లడించారు. ఫోన్ లో ప్లే అయిన వీడియో గురించి ఎలాంటి అభిప్రాయాన్ని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ సంస్థ తెలియజేయలేదు.' అని సునీల్ కుమార్ చెప్పారు.

వీడియో తనది కాదని మాధవ్ చెప్పారు. మార్ఫింగ్ చేశారని ఫిర్యాదు చేశారు. అది ఇద్దరి మధ్య జరిగిన వీడియో కాల్. దీనిపై కొందరు ఫోరెన్సిక్ రిపోర్ట్ అని విడుదల చేశారు. టీడీపీ విడుదల చేసిన ఫోరెన్సిక్ రిపోర్టులో వాస్తవాలు లేవు. ఆ వీడియోను ఎవరో షూట్ చేశారు. మూడో వ్యక్తి షూట్ చేసిన వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపి రిపోర్ట్ తీసుకున్నారు. ప్రైవేట్ ల్యాబ్ ఇచ్చే నివేదికకు విలువ ఉండదు. వీడియోలో ఉన్న కంటెంట్ ఒరిజినల్ అని ఆ ల్యాబ్ చెప్పలేదు. రిపోర్టును మార్చి ప్రచారం చేశారు. ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వివరణ తీసుకున్నాం. రిపోర్టును ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి.

- సీఐడీ చీఫ్ సునీల్ కుమార్

IPL_Entry_Point