AP Cabinet Decisions : చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు-ఏపీ కేబినెట్ నిర్ణయాలివే-ap cabinet decisions 200 units free power for weavers ysr district name change ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Cabinet Decisions : చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు-ఏపీ కేబినెట్ నిర్ణయాలివే

AP Cabinet Decisions : చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు-ఏపీ కేబినెట్ నిర్ణయాలివే

AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. చేనేత కార్మికుల గృహాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పవర్‌లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెల్పింది. వై.ఎస్.ఆర్. జిల్లా పేరును వై.ఎస్.ఆర్. కడప జిల్లాగా మార్చాలనే ప్రతిపాదనను ఆమోదించింది.

చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు-ఏపీ కేబినెట్ నిర్ణయాలివే

AP Cabinet Decisions : సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఇ-కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తదుపరి ఖర్చులకు గ్రాంట్ల డిమాండ్ల అనుబంధ ప్రకటనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్శిటీ (VVITU)ని బ్రౌన్‌ఫీల్డ్ కేటగిరీ కింద ప్రైవేట్ విశ్వవిద్యాలయ స్థాపనకు అనుమతి ఇచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టం 2016 షెడ్యూల్‌ను సవరించడానికి చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ఉపాధ్యాయ బదిలీలపై

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీల కోసం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025ను ప్రవేశపెట్టడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సీఆర్డీఏ ప్రాంతంలోని వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపుల సమీక్షకు సంబంధించి మంత్రుల బృందం చేసిన సిఫార్సులను ఆమోదించడానికి, అమరావతి భూ కేటాయింపు నిబంధనల ప్రకారం మంత్రుల బృందం చేసిన సిఫార్సులపై అవసరమైన చర్యలు తీసుకోవడానికి కమిషనర్, APCRDAకి అనుమతి ఇవ్వడానికి చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెల్పింది.

ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హడ్కో, కేఎఫ్డబ్ల్యూ, ఇతర ఆర్థిక ప్రాజెక్టులకు సంబంధించిన రూ.15,095.02 కోట్ల విలువైన 37 పనుల ప్యాకేజీకి సంబంధించి బోర్డు నిర్ణయాన్ని అమలు చేయడానికి అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్‌కు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికుల గృహాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పవర్‌లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెల్పింది. ఈ నిర్ణయం వల్ల 93 వేల మంది చేనేత కార్మిక గృహాలకు, 10,534 పవర్ లూమ్ యూనిట్లకు లబ్దిచేకూరనుంది.

వైఎస్ఆర్ కడప జిల్లాగా

షెడ్యూల్డ్ కులాల వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ నివేదికపై మంత్రుల బృందం సిఫార్సులకు మంత్రి మండలి ఆమోదం తెల్పింది. వై.ఎస్.ఆర్. జిల్లా పేరును వై.ఎస్.ఆర్. కడప జిల్లాగా మార్చాలనే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెల్పింది. వైఎస్ఆర్ తాడిగడప మునిసిపాలిటీని తాడిగడప మునిసిపాలిటీ గా పేరు మారుస్తూ ఆంధ్ర ప్రదేశ్ మునిసిపాలిటీల చట్టంను సవరించేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

గత ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతల్లో అత్యవసర ప్రాతిపధికన రూ.6373.23 లక్షల వ్యయంతో నామినేషన్ పద్దతిలో తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన చేపట్టిన 517 పనుల పరిపాలనా అనుమతులను ధ్రువీకరించేందుకు చేసిన పనులకు మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం