ఏపీ కేబినెట్ భేటీ - 'వాహనమిత్ర స్కీమ్'కు ఆమోదం, పలు కీలక నిర్ణయాలివే-ap cabinet approves bill amending nala fee abolition act and other details here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీ కేబినెట్ భేటీ - 'వాహనమిత్ర స్కీమ్'కు ఆమోదం, పలు కీలక నిర్ణయాలివే

ఏపీ కేబినెట్ భేటీ - 'వాహనమిత్ర స్కీమ్'కు ఆమోదం, పలు కీలక నిర్ణయాలివే

సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులకు ఆమోదం తెలపడంతో పాటు, అభివృద్ధి ప్రాజెక్టులు, ప్రజా సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు.

ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అసెంబ్లీ ప్రాంగణంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే 13 బిల్లులకు ఆమోదముద్ర పడింది.

నాలా ఫీజు రద్దు చట్టాన్ని సవరిస్తూ చేసిన బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ఏపీ జీఎస్టీ బిల్లు 2025లో పలు సవరణల ప్రతిపాదనలను కూడా మంత్రివర్గం ఆమోదించింది. లిఫ్ట్‌ పాలసీ కింద చిన్న సంస్థల ఏర్పాటుకు భూములు కేటాయింపుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

ఇక వైఎస్‌ఆర్‌ తాడిగడప మున్సిపాలిటీని తాడిగడప మున్సిపాలిటీగా సవరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. న్యాయ విశ్వ విద్యాలయం ఏర్పాటు ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది.

ఓటర్ల జాబితా తయారీకి తేదీలు ఖరారు ప్రతిపాదనకు, పెద్ద ప్రాజెక్టుల అమలుకు స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV) ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా వాహనమిత్ర కింద రూ.15 వేలు ఇచ్చే ప్రతిపాదనకు కేబినెట్ సమావేశంలో ఆమోదించడం జరిగింది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం