AP BC EBC Kapu Loans : బీసీ, ఈబీసీ, కాపు కార్పొరేషన్ లోన్ల దరఖాస్తు గడువు పెంపు, ఈ నెల 25 చివరి తేదీ
AP BC EBC Kapu Loans : ఏపీ బీసీ, ఈబీసీ, కాపు కార్పొరేషన్ లోన్ల దరఖాస్తు గడువును ఈ నెల 25వ తేదీ వరకు పెంచారు. ఈ మేరకు బీసీ కార్పొరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. కొత్త అప్లికేషన్లను https://apobmms.apcfss.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
AP BC EBC Kapu Loans : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ, ఈబీసీ, కాపు కార్పొరేషన్ కింద స్వయం ఉపాధి పథకాల రుణాలకు దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దరఖాస్తులు నేటితో ముగియగా...తాజాగా దరఖాస్తు గడువును ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు బీసీ కార్పొరేషన్ శనివారం సాయంత్రం ఓ ప్రకటన చేసింది. మండల పరిషత్ అభివృద్ధి, మునిసిపల్ కమిషనర్ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసింది.
వివిధ కార్పొరేషన్ల కింద స్వయం ఉపాధి రుణాల అప్లికేషన్లను స్వీకరించడానికి చివరి తేదీని 22-03-2025 నుంచి 25-03-2025 వరకు గడువు పొడిగించారు. కొత్త అప్లికేషన్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ https://apobmms.apcfss.in/ ద్వారా 25-03-2025 వరకు చేసుకోవచ్చు. కాపు కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాల కోసం నమోదు చేసుకోవడానికి వయోపరిమితిని 50 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు పెంచారు.
బీసీ, ఈబీసీ సబ్సిడీ రుణాల మంజూరుకు నిబంధనలు :
- అన్ని వనరులు కలుపుకుని గ్రామీణ ప్రాంతంలోని కుటుంబ ఆదాయం రూ.81,000 లేదా అంతకంటే తక్కువగా ఉండవలెను.
- 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు గలవారు అర్హులు
- తెల్ల రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి.
- ఒక కుటుంబంలో...తెల్ల రేషన్ కార్డులో ఒక్కరు మాత్రమే లబ్ది పొందుటకు అర్హులు.
వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు, పరిశ్రమలు, చిన్న తరహా వ్యాపారం, సేవలు, రవాణా విభాగం వంటి సెక్టార్లకు సంబందించిన యూనిట్లకు సబ్సిడీపై రుణాలు మంజూరు చేస్తారు. పైన తెలిపిన విధంగా అర్హతలు కలిగిన వారు https://apobmms.apcfss.in/ ఈ నెల 10-03-2025 నుంచి 22-03-2025 వారి పేర్లను APOBMSS వెబ్సైటు లో నమోదు చేసుకోవాలని సూచించారు. తాజాగా దరఖాస్తు గడువును మార్చి 25 వరకు పెంచారు. స్వయం ఉపాధి పథకాలు, జనరిక్ మెడికల్ షాపుల కోసం డి.ఫార్మసీ, బి.ఫార్మసీ లేదా ఎం.ఫార్మసీ అర్హతలు కలిగిన నిరుద్యోగ యువత 25-03-2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- స్వయం ఉపాధి పథకాలు - వ్యవసాయం, వ్యవసాయం అనుబంధ, రవాణా, పరిశ్రమలు, సేవ, వ్యాపార రంగాలలో స్వయం ఉపాధి పథకాలు
- ఎంఎస్ఎంఈ కింద జనరిక్ ఫార్మసీలు -డి.ఫార్మసీ / బి.ఫార్మసీ / ఎం.ఫార్మసీ అభ్యర్థులకు చెందిన నిరుద్యోగ యువతకు జనరికి ఫార్మసీలు
- లబ్ధిదారుడు ఏదైనా బీసీ, ఈబీసీ, బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, వైశ్య కమ్యూనిటీకి చెందినవారై ఉండాలి. కుల ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి.
- లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారై ఉండాలి.
- లబ్ధిదారుడి వయస్సు పరిమితి 21 నుంచి 60 సంవత్సరాలు.
- లబ్ధిదారుడు దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) వర్గంలో ఉండాలి.
- స్వయం ఉపాధి పథకాల్లో రవాణా రంగానికి లబ్ధిదారునికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
- జనరిక్ ఫార్మసీ పథకాలకు లబ్ధిదారునికి డి.ఫార్మసీ / బి.ఫార్మసీ / ఎం.ఫార్మసీ ఉండాలి.
దరఖాస్తు ఎలా చేయాలి?
- ముందుగా లబ్ధిదారుడు https://apobmms.apcfss.in/ వెబ్ సైట్ లో తన ప్రాథమిక వివరాలను నమోదు చేసుకుని యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ పొందాలి.
- యూజర్ ఐడీ : రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన మొబైల్ నంబర్
- పాస్‌వర్డ్ : రిజిస్ట్రేషన్ సమయంలో వచ్చే ఓటీపీ
- లబ్ధిదారుడు తన దరఖాస్తును పూర్తి చేయడానికి చిరునామా, కులం, స్వయం ఉపాధి వివరాలను పూర్తి చేయాలి. అనంతరం దరఖాస్తును ప్రింట్ తీసుకోవాలి.
సంబంధిత కథనం