AP Assembly Budget 2024 live Updates: ఏపీ అసెంబ్లీలో 2024 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్
- AP Assembly Budget 2024 live Updates: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ 2024 సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే రెండు విడతలుగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా మిగిలిన నాలుగు నెలల కాలానికి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడతారు.
Mon, 11 Nov 202405:28 AM IST
శాఖల వారీగా కేటాయింపులు
1.పర్యావరణం అటవీ శాస్త్ర సాంకేతిక శాఖకు రూ.687కోట్లను కేటాయించారు.
2.మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక టాస్క్‌ఫోర్స్‌లో 3172 యూనిట్లకు శిక్షణ ఇచ్చేందుకు పోలీస్ శాఖకు రూ.8,495కోట్లను కేటాయించారు.
3. పోలీస్ బలగాల ఆధునీకరణకు రూ.62కోట్లను కేటాయించారు. 13ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు.
4. పర్యాటక సాంస్కృతిక శాఖకు రూ.322కోట్ల కేటాయింపు
5. రోడ్లు భవనాల శాఖకుే రూ.9,554కోట్ల కేటాయింపు
6.రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.15వేల కోట్ల నిధులను కేంద్రం సహకారంతో సమీకరణ
7. ఇంధన శాఖకు రూ.8207కోట్ల కేటాయింపు
8. పరిశ్రమల శాఖకు రూ.3127 కోట్ల కేటాయింపు
9. జలవనరుల శాఖకు రూ.16,705కోట్ల కేటాయింపు
10. గృహ నిర్మాణ రంగానికి రూ.4102 కోట్ల కేటాయింపు
11. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.11,490కోట్లను కేటాయించారు.
12. పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి వాఖలకు రూ.16,739కోట్లను కేటాయించారు.
13. వైద్య ఆరోగ్య శాఖకు రూ.18,421 కోట్లను కేటాయించారు.
14. ఉన్నత విద్యాశాఖకు రూ.2,326 కోట్ల కేటాయింపు
15. పాఠశాల విద్యాశాఖకు రూ.29,909 కోట్ల కేటాయింపు
16. స్కిల్ డెవలప్‌బమెంట్ కోసం రూ.1215కోట్ల కేటాయింపు
17. మహిళా, స్త్రీ శిశు సంక్షేమ శాఖకు రూ.4,285కోట్ల కేటాయింపు
18. షెడ్యూల్ కులాల సంక్షేమం కోపం రూ.18,497కోట్లు, షెడ్యూల్ తెగల కోసం రూ.7557కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.39,007కోట్లు, అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమానికి రూ.4376కోట్లు కేటాయించారు.
19.వ్యవసాయం అనుబంధ రంగాలకు రూ.11,855కోట్లను కేటాయించారు.
Mon, 11 Nov 202405:28 AM IST
ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌ను రూ. 2.94లక్షల కోట్లు
ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌ను రూ. 2.94లక్షల కోట్లతో అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఏపీ వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో రెవిన్యూ వ్యవయయం రూ.2,35, 916.99కోట్లుగా ఉంది.
బడ్జెట్‌లో మూల ధన వ్యయం రూ.32,712.84 కోట్లు కాగా రెవిన్యూ లోటును రూ.34,743.38కోట్లుగా ఉంది. ద్రవ్య లోటు రూ.68,742.65కోట్లుగా ఉంది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో రెవిన్యూ లోటు 4.19శాతం, ద్రవ్యలోటు 2.12శాతం ఉంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో రెవిన్యూ వ్యయం రూ.2,12,450కోట్లు కాగా మూలధన వ్యయం రూ23,330కోట్లుగాఉంది. 2023 * 24లో రెవిన్యూ లోటు రూ.38,682కోట్లుగా ఉంది.
Mon, 11 Nov 202405:09 AM IST
ఉన్నత విద్యకు రూ.2,326కోట్ల కేటాయింపు
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా శాఖకు వార్షిక బడ్జెట్‌లో రూ.2,326కోట్లను కేటాయించారు.
Mon, 11 Nov 202405:08 AM IST
పాఠశాల విద్యాశాఖకు రూ.29వేల కోట్లు
పాఠశాల విద్యాశాఖకు 2024-25 విద్యా సంవత్సరంలో రూ.29,909 కోట్లను కేటాయించారు
Mon, 11 Nov 202405:06 AM IST
వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.11,855కోట్లు
ఏపీ బడ్జెట్‌లో వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.11,855కోట్లను కేటాయించారు.
Mon, 11 Nov 202405:04 AM IST
కాలేజీ ఖాతాల్లోకి ఫీజు రియింబర్స్‌మెంట్
విద్యార్థులకు స్కాలర్ షిప్‌లను నేరుగా కాలేజీ ఖాతాల్లో జమ చేస్తున్నామని, ఫీజు బకాయిలను దశలవారీగా కాలేజీలకు చెల్లించనున్నట్టు వెల్లడించారు.
Mon, 11 Nov 202405:01 AM IST
పశుపోషణ రంగాలకు ప్రాధాన్యత
అన్నదాత సుఖీభవ, ప్రధానమంత్రి కిసాన్ పథకంలో పెట్టుబడి సాయాన్ని రైతులకు అందిస్తోంది. పంటల బీమాలో స్వచ్ఛంధ నమోదు విధానాన్ని అమలు చేస్తున్నారు. పశుపోషణ, కోళ్ల పెంపకంలో దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది.
Mon, 11 Nov 202404:58 AM IST
రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేటాయింపులు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ కేటాయింపులు చేసినట్టు పయ్యావుల పేర్కొన్నారు.
Mon, 11 Nov 202404:57 AM IST
2019-24 మధ్య వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పాలన సాగించిందని పయ్యావుల ఆరోపించారు. అక్రమ తవ్వకాలతో ఖజానాకు నష్టం కలిగించారు. వ్యక్తిగత ప్రయోజనాలతో ఇసుక, ఎక్సైజ్ విధానాలను రూపొందించారని బడ్జెట్ ప్రసంగంలో ఆరోపించారు.
Mon, 11 Nov 202404:56 AM IST
యథేచ్ఛగా నిధుల మళ్లింపు
గత ప్రభుత్వంలో యథచ్ఛగా నిధులు మళ్లించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటాలను చెల్లించడంలో విఫలమైంది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు లక్షా 32వేల కోట్ల బకాయిలు మిగిల్చింది.
Mon, 11 Nov 202404:47 AM IST
దేశంలో ఆర్థిక గందరగోళ పరిస్థితులు
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించి దానిని నిలబెట్టే బాధ్యత ప్రభుత్వంపై ఉందని పయ్యావుల చెప్పారు.
Mon, 11 Nov 202404:46 AM IST
శ్వేత పత్రాల ద్వారా గతంలో జరిగిన నష్టాన్ని వివరించాం..
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో జరిగిన నష్టాలను శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు వివరించాము. పరిమితికి మించి రుణాలను అధిక వడ్డీలకు తీసుకోవడం వంటి అంశాలను ప్రజలకు వివరించామని ఆర్థిక మంత్రి పయ్యావుల వివరించారు.
Mon, 11 Nov 202404:42 AM IST
పది రోజుల పాటు సమావేశాల నిర్వహణ
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పది రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బిఏసీ సమావేశంలో బడ్జెట్ నిర్వహించే తేదీలను ఖరారు చేయనున్నారు.
Mon, 11 Nov 202404:41 AM IST
సూపర్ సిక్స్ పథకాలకు ప్రాధాన్యత
ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ సిక్స్ ఎన్నికల హామీలకు బడ్జెట్‌లోప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ మేరకు బడ్జెట్‌లో కేటాయింపులు చేయనున్నారు.
Mon, 11 Nov 202404:40 AM IST
అసెంబ్లీ సమావేశాలకు దూరంగా వైసీపీ
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సార్సీపీ సభ్యులు దూరంగా ఉన్నారు. సమావేశాలకు హాజరు కాకూడదని వైసీపీ అధ్యక్షుడు జగన్ నిర్ణయించారు. మండలి సభ్యులు మాత్రం సమావేశాలకు హాజరు కానున్నారు.
Mon, 11 Nov 202404:38 AM IST
ఒకే ఏడాది రెండు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లు
సార్వత్రిక ఎన్నికల సంవత్సరం కావడంతో నాలుగు నెలల వ్యవధితో గత మార్చిలో తొలి ఓటాన్ అకౌంటక్ బడ్జెట్‌ను వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత మరోసారి నాలుగు నెలల వ్యవధితో మరో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
Mon, 11 Nov 202404:37 AM IST
ఏపీ బడ్జెట్‌కు క్యాబినెట్ అమోదం
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2024-25కు ఏపీ క్యాబినెట్ అమోద ముద్ర వేసింది. క్యాబినెట్ అమోదం తర్వాత బడ్జెట్‌ను గవర్నర్ అమోదం కోసం ఈ ఆఫీస్‌లో పంపారు. గవర్నర్ ఆన్‌లైన్‌లో ఏపీ వార్షిక బడ్జెట్‌ను అమోదించనున్నారు.
Mon, 11 Nov 202404:32 AM IST
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. 2024-25 వార్షిక బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. దాదాపు రూ.2.9లక్షల కోట్ల అంచనాలతో ఏపీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాాలు ఉన్నాయి.