November 17 Telugu News Updates : సిట్ ఏర్పాటుపై సుప్రీంలో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్
తెలంగాణ, ఏపీ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. తాజా వార్తల కోసం రిఫ్రెష్ చేస్తూ ఉండండి.
Thu, 17 Nov 202205:15 PM IST
చంద్రబాబుకు నిరసన సెగ
టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలులో పర్యటిస్తున్నారు. ఆయనకు ఎమ్మిగనూరులో నిరసన సెగ తగిలింది.
Thu, 17 Nov 202205:01 PM IST
కేవలం ఏపీనే అప్పులు చేస్తోందా?
ఉత్తరాంధ్రకు సచివాలయం వెళ్తే.. ఇబ్బంది ఏంటని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు.. అప్పులు చేస్తున్నాయన్నారు. కేవలం ఏపీ మాత్రమే చేస్తున్నట్టుగా చెబుతున్నా్రని విమర్శించారు.
Thu, 17 Nov 202211:48 AM IST
సిట్ ఏర్పాటుపై సుప్రీంలో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్
టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలపై సిట్ ఏర్పాటు అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. ఏపీ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం గతంలో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, వాదనలను ముగించింది. తీర్పును రిజర్వ్ చేసింది.
Thu, 17 Nov 202209:42 AM IST
సీఎం కేసీఆర్ సమీక్ష
ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన, రోడ్లు భవనాలు,, పంచాయతీ రాజ్ శాఖల మంత్రులు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి పైన..రోడ్లను ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉంచేందుకు చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. పాడయిన రోడ్లను ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేయడం, పరిపాలన సంస్కరణ లో భాగంగా బాధ్యతల వికేంద్రీకరణపై మాట్లాడారు. పనుల నాణ్యత పెంచే దిశగా రోడ్లు భవనాలు శాఖలో చేపట్టాల్సిన నియామకాలు.. తదితర కార్యాచరణపై ముఖ్యమంత్రి సమీక్షించారు.
Thu, 17 Nov 202207:53 AM IST
ఇవే చివరి ఎన్నికలు…
కర్నూలు రోడ్ షోలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్ అయ్యారు. 2024 ఎన్నికలు చంద్రబాబుకు చివరి అని... టీడీపీకి కూడా సమాధి కట్టే ఎన్నికలని వ్యాఖ్యానించారు.గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన... మరోసారి ఆయన భార్య పేరును ప్రస్తావించారని, ఇదంతా ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాల కోసం ఎంతకైనా చంద్రబాబు దిగజారుతున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలను ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు.
Thu, 17 Nov 202206:39 AM IST
కత్తితో దాడి…
ఏపీలోని తునిలో తెలుగుదేశం పార్టీ నేత శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగింది. ఏకంగా భవాని మాల వేషంలో వచ్చిన దుండగుడు... ఒక్కసారిగా కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో శేషగిరిరావు చేతికి, తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దాడి అనంతరం నిందితుడు బైక్‌పై పరారయ్యాడు.
Thu, 17 Nov 202205:33 AM IST
లిక్కర్ కేసులో ఈడీ వేగం….
ఢిల్లీ మద్యం స్కామ్‌లో ఈడీ వేగం పెంచుతోంది. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పన సమయంలో.. ఢిల్లీ-ఏపీ, తెలంగాణ మధ్య ప్రత్యేక విమానాల్లో ప్రయాణించిన వారిపై ఈడీ నిఘా పెట్టింది. రాజకీయనేతలు, వ్యాపారవేత్తల సమాచారాన్ని విశ్లేషిస్తున్నట్లు సమాచారం. శరత్‌చంద్రారెడ్డి భార్య కనికా టేక్రివల్ సంస్థ ‘జెట్ సెట్ గో’ నిర్వహిస్తున్న.. విమానాల్లో ప్రయాణించినవారి వివరాలను ఈడీ తీసుకుంది.
Thu, 17 Nov 202202:46 AM IST
సంచలన వ్యాఖ్యలు…
కర్నూలు జిల్లాలోని మూడు రోజుల పర్యటనలో భాగంగా.. తొలి రోజు పత్తికొండ సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని.. టీడీపీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. ఈ సారి గెలిపించకుంటే ఇవే తన చివరి ఎన్నికలు అవుతాయని వ్యాఖ్యానించటం హాట్ టాపిక్ గా మారింది. ప్రజలు మళ్లీ తనను ఆశీర్వదించాలని కోరారు. నిండు సభలో తనను, తన భార్యను వైసీపీ నేతలు అవమానించారని చంద్రబాబు గుర్తు చేశారు. గౌరవ సభను కౌరవ సభగా మార్చారని ధ్వజమెత్తారు.
Thu, 17 Nov 202202:16 AM IST
నిమ్స్ విస్తరణ
నిమ్స్‌కు అనుబంధంగా మరో నూతన ఆసుపత్రిని నిర్మించడానికి ప్రభుత్వం రూ.1,571 కోట్లకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
Thu, 17 Nov 202202:14 AM IST
చలి తీవ్రత…
Cold Wave Increased in Telangana: వర్షాకాలం(Rain Season) ముగియడంతో రాష్ట్రంలో క్రమంగా చలి పెరుగుతోంది. అక్టోబర్ చివరి వారంలోనే చలి తీవ్రత పెరగటం మొదలైంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. సాయంత్రం 5 దాటితే చాలు .. చలి వణికిస్తోంది. ఉదయం పూట చాలా చోట్ల పొగ మంచు కమ్ముకుంటోంది. తెల్లవారుజామున మంచు కురియడంతో.. ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత మరితం పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Thu, 17 Nov 202201:17 AM IST
నోటీసులు..
విదేశాల్లో కేసినో వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. ప్రత్యేక విమానాల్లో శ్రీలంక, నేపాల్, ఇండోనేషియా తీసుకెళ్లి అక్కడ కేసినో ఆడించిన వ్యవహారంలో ఇప్పటికే చీకోటి ప్రవీణ్‌పై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సోదరులు మహేశ్, ధర్మేందర్ సంబంధాలపై ఈడీ బుధవారం ప్రశ్నించింది. కేసీనోలతో సంబంధమున్న వారికి నోటీసులు ఇవ్వడం ప్రారంభించింది. అందులో భాగంగానే శుక్రవారం విచారణకు హాజరుకావాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది.
Thu, 17 Nov 202201:13 AM IST
మరిన్ని ప్రత్యేక రైళ్లు…
South Central Railway Special Trains Latest: దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... ప్రయాణికుల కోసం మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. తిరుపతి, సికింద్రాబాద్, శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను చూస్తే......
secunderabad tirupati special trains: సికింద్రాబాద్- తిరుపతి మధ్య ప్రత్యేక రైలును ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ నెల 19వ తేదీన సికింద్రాబాద్ రాత్రి 08.05 నిమిషాలకు రైలు బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 9 గంటలకు తిరుపతి చేరుతుంది.
ఈ ట్రైన్ జనగాం, కాజీపేట్, వరంగల్, మహబూబుబాద్, డోర్నకల్, ఖమ్మం, మంథిని, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గుడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.
Thu, 17 Nov 202201:13 AM IST
ఇబ్బందులు
Paddy Procurement Process: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 11 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాగా.... క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. సెంటర్లలో ప్యాడీ క్లీనర్లు, తేమ యంత్రాలు, తూకం కాంటాలు అరకొరగా ఉన్నాయి. అధికారుల చర్యలు మాత్రం నామమాత్రంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతన్నలు.. ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు.