AP AGRICET 2024 Hall Ticket : ‘ఏపీ అగ్రిసెట్ ’ హాల్ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి
AP AGRICET 2024 Hall Ticket : బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులకు నిర్వహించే ఏపీ అగ్రిసెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://angrauagricet.aptonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 27వ తేదీన ప్రవేశ పరీక్ష జరగనుంది.
ఆచార్య ఎన్జీ రంగా యూనివర్శిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల కోసం నిర్వహించే అగ్రికల్చర‌్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (అగ్రిసెట్) హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. 2024-25 విద్యా సంవత్సరానికి నాలుగేళ్ల బీఎస్సీ (ఆనర్స్) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించిన ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ (ఏఎన్‌జీఆర్ఏయూ)… హాల్ టికెట్లను అందుబాటలోకి తెచ్చింది. అగ్రిసెట్ పరీక్ష ఈనెల 27న జరగనుంది.
ఇలా డౌన్లోడ్ చేసుకోండి….
అగ్రిసెట్-2024కు సంబంధించిన హాల్ టికెట్లను https://angrauagricet.aptonline.in/AGRICET/AGRICET_HomePage.aspx వెబ్ సైట్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పేమెంట్ ఐడీ, రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ ఎంట్రీ చేసి ప్రాసెస్ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 13 ప్రాంతాల్లో ఈనెల (ఆగస్టు) 27న కంప్యూటర్ ఆధారిత పరీక్ష జరుగుతుంది.
పరీక్ష విధానం:
అగ్రిసెట్‌కు సంబంధించి పరీక్షా విధానం ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. అగ్రిసెట్ పరీక్ష ఆగస్టు 27న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు గంటన్నర సేపు జరుగుతుంది. ఇంగ్లీష్, తెలుగు మీడియాల్లో పరీక్ష ఉంటుంది. 120 ప్రశ్నలు ఉంటాయి. నెగిటివ్ మార్కులు ఉండవు. ఆగస్టు 16 నుంచి ఆగస్టు 23 వరకు అగ్రిసెట్ హాల్‌టిక్కెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. అగ్రిసెట్ మాక్ టెస్టులు ఆగస్టు 20 నుంచి ఆగస్టు 25 వరకు జరుగుతాయి. ఫలితాలు వెల్లడి, కౌన్సిలింగ్ తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని ఏఎన్‌జీఆర్ఏయూ తెలిపింది. పరీక్ష కేంద్రాలు రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల్లో ఉంటాయి.
ఎన్ని సీట్లు…?
రాష్ట్రంలో మొత్తం 268 సీట్లు. అందులో యూనివర్శిటీ అగ్రికల్చరల్ కాలేజీలో 196, అనుబంధ అగ్రికల్చరల్ కాలేజీలో 72 సీట్లు ఉన్నాయి. ఇందులో అగ్రికల్చరల్ కోర్సుకు 220 సీట్లు కాగా, అందులో 161 ప్రభుత్వ, 59 అనుబంధ కాలేజీ సీట్లు ఉన్నాయి. సీడ్ టెక్నాలజీ కోర్సుకు 37 సీట్లు కాగా, అందులో 27 ప్రభుత్వ, 03 అనుబంధ కాలేజీ సీట్లు ఉన్నాయి. ఆర్గానిక్ ఫార్మింగ్ కోర్సుకు 11 సీట్లు కాగా, అందులో 08 ప్రభుత్వ, 03 అనుబంధ కాలేజీ సీట్లు ఉన్నాయి. అనుబంధ కాలేజీల్లో ఉన్న 72 సీట్లలో 24 సీట్లు మేనేజ్‌మెంట్ కోటా కింద భర్తీ చేస్తారు. అంటే ఒక్కొ కాలేజీకి నాలుగు సీట్లు మేనేజ్‌మెంట్ కోటా కింద భర్తీ చేస్తారు.
ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ (ఏఎన్‌జీఆర్ఏయూ) నాలుగేళ్ల బీఎస్సీ (ఆనర్స్) కోర్సుకు సంబంధించి 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ కోసం జులై 10న అగ్రిసెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి జులై 15న నుంచి ప్రారంభించగా.. చివరు తేదీ జులై 31న నిర్ణయించింది. అదనపు రుసుముతో దరఖాస్తుకు చేసుకోవడానికి ఆగస్టు 1 నుంచి ఆగస్టు 5 గడువు ఇచ్చింది. అప్లికేషన్‌లో ఏదైనా మార్పు చేసుకోవాలంటే ఆగస్టు 7 నుంచి 8 మధ్య ఎడిట్ ఆప్షన్‌లో చేసుకోవచ్చు. దరఖాస్తు హర్డ్ కాపీలు పంపాల్సి ఉంటుంది. హర్డ్ కాపీలను పంపేందుకు ఆగస్టు 14 వరకు గడువు ఇచ్చింది.