AP SSC Exams 2025 : ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల, ముఖ్య తేదీలివే
ఏపీ పదో తరగతి విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించేందుకు షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 28వ తేదీ నుంచి ఫీజుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. నవంబరు 11వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈ తేదీ దాటికే ఆలస్య రుసుం చెల్లించాలి.
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 28 నుంచి ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. నవంబర్ 11వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
ఆలస్య రుసుంతో తేదీలు….
నిర్ణయించిన తేదీలలోపు కట్టకపోతే… ఆలస్య రుసుం చెల్లించాల్సి ఉంటుంది.నవంబర్ 12వ తేదీ నుంచి నవంబరు 18వ తేదీల్లో చెల్లిస్తే… రూ.50 అదనంగా కట్టాలి. ఇక నవంబర్ 19 నుంచి 25వ తేదీల్లో చెల్లిస్తే… రూ.200 అదనపు రుసుం చెల్లించాలి. నవంబర్ 26 నుంచి నవంబరు 30 వరకు రూ.500 ఆలస్య రుసుము చెల్లించాలి.
ఈ ఫీజును ఆన్ లైన్ విధానంలోనే చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వ పరీక్షల విభాగం స్పష్టం చేసింది. పాఠశాల లాగిన్ ద్వారా ప్రధానోపాధ్యాయులూ కూడా చెల్లించవచ్చు.
- ఏపీ టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రారంభం - 28 అక్టోబర్ 2024.
- ఫీజు చెల్లింపునకు తుది గడువు - 11 నవంబర్ 2024.
- ఆలస్య రుసుంతో నవంబర్ 12 - 18 - రూ. 50 అదనంగా చెల్లించాలి.
- నవంబర్ 19 నుంచి 25 - రూ.200 అదనపు రుసుం చెల్లించాలి.
- నవంబర్ 26 నుంచి నవంబరు 30 వరకు - రూ.500 ఆలస్య రుసుము చెల్లించాలి.
- అధికారిక వెబ్ సైట్ - https://bse.ap.gov.in/
ఫీజుల వివరాలు…
ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి రెగ్యులర్ విద్యార్థులు రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. ఇక సప్లిమెంటరీ అభ్యర్థులు అయితే… 3 పేపర్ల వరకు రూ.110 కట్టాలి. అంతకంటే ఎక్కువ ఉంటే రూ.125గా నిర్ణయించారు. ఇక వయసు తక్కువగా ఉండి ఎగ్జామ్స్ కు హాజరయ్యే వారు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది.
ఇక రాష్ట్రంలో గత మూడేళ్ల విద్యార్థులకు పాత సిలబస్‌తోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇదే విషయంపై ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు కొత్త సిలబస్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. వెబ్‌సైట్‌లో ప్రశ్నాపత్రాలు, మోడల్ పేపర్లు, మార్కుల వెయిటేజీ వంటి అప్‌లోడ్ చేశారు.
పదో తరగతి 2021-22, 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల్లో పదో తరగతి చదివి ఫెయిల్ అయిన విద్యార్థులకు పాత సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మూడు సంవత్సరాల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్థులు, ఈ ఏడాది ఫెయిల్ అయిన సబ్జెట్ల రాయలనుకుంటే వారు పాత సిలబస్ ప్రకారమే రాయడానికి అవకాశం ఉంది. ప్రైవేట్, రీ ఎన్‌రోల్ చేసుకున్న విద్యార్థులు, ఆయా సంవత్సరాల్లో ఏ సిలబస్ ప్రకారం అయితే పరీక్షలు రాశారో, ఈ ఏడాది పబ్లిక్ పరీక్షల్లో కూడా వారికి పాత సిలబస్ వర్తిస్తుంది.
ప్రస్తుత విద్యా సంవత్సరం (2024-25) పదో తరగతి విద్యార్థులకు మాత్రం మారిన కొత్త సిలబస్ ప్రకారం పబ్లిక్ పరీక్షలు ఉంటాయి. అందుకు సంబంధించిన ప్రశ్నా పత్రాలు, బ్లూ ప్రింట్, ఏడు పేపర్లకు సంబంధించి ప్రశ్నల వారీగా మార్కుల వెయిటేజీ, మోడల్ పేపర్లను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ https://bse.ap.gov.in/ లో ఉంచారు.