AP ACB Clarification: ఏ ప్రభుత్వ శాఖను టార్గెట్ చేయలేదంటున్న ఏపీ ఏసీబీ
AP ACB Clarification: ఏపీలో ఏ ప్రభుత్వ శాఖను ప్రత్యేకంగా అవినీతి నిరోధక శాఖ లక్ష్యంగా చేసుకోలేదని ఏసీబీ ప్రకటించింది. ఏపీ రెవిన్యూ ఉద్యోగ సంఘం నాయకులు ఏసీబీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఏసీబీ వివరణ ఇచ్చింది.
AP ACB Clarification: ఏపీలో ఏ ప్రభుత్వ శాఖను, కార్యాలయాన్ని ఏసీబీ ప్రత్యేకంగా టార్గెట్ చేసుకోలేదని అవినీతి నిరోధక శాఖ స్పష్టం చేసింది. ఏపీ రెవిన్యూ సర్వీసెస్ సంఘం నేతల ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ వివరణ ఇచ్చింది.
ట్రెండింగ్ వార్తలు
రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పనులు, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ ఆస్తుల దోపిడీ వంటి వాటిలో అవినీతిని నిరోధించడానికి ఏసీబీ నిరంతరం కృషి చేస్తోందని ఏసీబీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
అవినీతిని నిరోధించడానికి ఏసీబీ చేస్తున్న నిరంతర ప్రక్రియలో భాగంగా 14400 టోల్‌ఫ్రీ నంబరుతో పాటు మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మొబైల్ నంబరుకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నట్లు ఏసీబీ ప్రకటించింది.
అవినీతి నిరోధక శాఖ కార్యాలయానికి నేరుగా వచ్చే ఫిర్యాదులు, 14400 టోల్ ఫ్రీ నంబర్, యాప్‌కు వచ్చే ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ఫిర్యాదులో పేర్కొన్న అధికారి క్షేత్ర స్థాయిలో అవినీతినికి పాల్పడుతున్నారని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అవినీతి నిరోధక శాఖ ఉద్దేశ పూర్వకంగా ఏ ప్రభుత్వ శాఖ మీద, ఉద్యోగులపై ఏక పక్ష చర్యలు తీసుకోవడం లేదని ఏసీబీ స్పష్టం చేసింది.
గత ఆదివారం తిరుపతిలో జరిగిన రెవిన్యూ ఉద్యోగుల సమావేశంలో ఏసీబీపై ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. రెవిన్యూ శాఖను ఏసీబీ పరిధి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకంగా రెవిన్యూ శాఖను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపణలు గుప్పించడంతో కలకలం రేగింది. తమకు నెలల తరబడి జీతాలు అందడం లేదని, తాము కూడా కుటుంబాలను పోషించుకోవాలని , రెవిన్యూ కార్యాలయాలల్లో మాత్రమే ఏసిబి సోదాలు చేస్తోందని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ ఖర్చులు చెల్లించకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఆరోపించారు. ఉద్యోగులకు శిక్షణ లేకుండా మెరుగైన పనితీరు ప్రదర్శించడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు.
టాపిక్