Annamayya Crime : అన్నమ‌య్య జిల్లాలో ఘోరం, క‌న్న కూతుళ్లుపైనే తండ్రి అఘాయిత్యం-పోక్సో కేసు న‌మోదు-annamayya pocso case filed on father molested two daughters arrested ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Annamayya Crime : అన్నమ‌య్య జిల్లాలో ఘోరం, క‌న్న కూతుళ్లుపైనే తండ్రి అఘాయిత్యం-పోక్సో కేసు న‌మోదు

Annamayya Crime : అన్నమ‌య్య జిల్లాలో ఘోరం, క‌న్న కూతుళ్లుపైనే తండ్రి అఘాయిత్యం-పోక్సో కేసు న‌మోదు

HT Telugu Desk HT Telugu
Jan 07, 2025 06:22 PM IST

Annamayya Crime : అన్నమయ్య జిల్లాలో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న బిడ్డలపైనే ఓ కిరాతక తండ్రి కన్నేశాడు. ఇద్దరు కూతుళ్లపై లైంగిక దాడి చేశాడు. విషయం భార్యకు తెలిసి పోలీసులను ఆశ్రయించింది. నిందితుడ్ని పోలీసులను అరెస్టు చేశారు.

అన్నమ‌య్య జిల్లాలో ఘోరం, క‌న్న కూతుళ్లుపైనే తండ్రి అఘాయిత్యం-పోక్సో కేసు న‌మోదు
అన్నమ‌య్య జిల్లాలో ఘోరం, క‌న్న కూతుళ్లుపైనే తండ్రి అఘాయిత్యం-పోక్సో కేసు న‌మోదు

Annamayya Crime : అన్నమ‌య్య జిల్లాలో ఘోరమైన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. క‌న్న కూతుళ్లుపైనే కిరాతక తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీన్ని చూసిన భార్య పోలీసులుకు ఫిర్యాదు చేసింది. ఆ కమాంధు తండ్రిపై పోలీసులు పోక్సో కేసు న‌మోదు చేశారు.

yearly horoscope entry point

ఈ ఘ‌ట‌న అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండ‌లంలోని కొండయ్యగారిపల్లె పంచాయతీలో వెలుగులోకి వ‌చ్చింది. కన్న బిడ్డలతో కామ వాంక్ష తీర్చుకుంటున్న ఓ కామాంధ తండ్రి పైన పోక్సో కేసు నమోదు చేసినట్లు నిమ్మన‌ప‌ల్లి పోలీసులు తెలిపారు. మ‌ద‌న‌ప‌ల్లె రూర‌ల్ సీఐ ర‌మేష్ తెలిపిన వివ‌రాల ప్రకారం నిమ్మనపల్లె మండలం కొండయ్యగారిపల్లె పంచాయతీకి చెందిన బోయకొండ(28), చిట్టెమ్మ దంప‌తులు నివాసం ఉంటున్నారు. ఈ దంప‌తుల‌కు నలుగురు కూతుళ్లతో పాటు ఒక కుమారుడు ఉన్నాడు.

సుమారు12 ఏళ్ల వయసున్న ఇద్దరి కూతుళ్లపై తండ్రి బోయకొండ కన్నేశాడు. వారిని భ‌య‌పెట్టి త‌న కామ‌వాంఛ తీర్చుకుంటున్నాడు. త‌న ఇద్దరు కుమార్తెల‌పై త‌న కామవాంఛ తీర్చుకుంటుండ‌గా ఆయ‌న భార్య చిట్టెమ్మ చూసింది. దీంతో వెంట‌నే భ‌ర్త చేసే నీచ‌మైన ప‌నుల‌ను అడ్డుకుంది. కామాంధుడైన త‌న భ‌ర్త నుంచి పిల్లల‌ను కాపాడింది. వెంట‌నే నిమ్మన‌ప‌ల్లె పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. స‌మాచారం అందుకున్న మ‌ద‌న‌ప‌ల్లి రూర‌ల్ సీఐ ర‌మేష్ హుటాహుటిన నిమ్మన‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్‌కు చేరుకున్నారు.

అక్కడ నుంచి ఎస్ఐ, ఇత‌ర పోలీసు సిబ్బందితో క‌లిసి కొండయ్యగారిపల్లె పంచాయతీలోని గ్రామానికి చేరుకున్నారు. బాధితుల‌ను విచారించారు. వారి నుంచి స‌మాచారం సేక‌రించారు. అనంత‌రం బోయ‌కొండ‌పై పోక్సో కేసు న‌మోదు చేశారు. ఆయ‌నను అదుపులోకి తీసుకుని, ద‌ర్యాప్తు చేస్తామ‌ని తెలిపారు. పోక్సో కేసు డీఎస్పీ ఆధ్వర్యంలో ద‌ర్యాప్తు చేస్తామని విచార‌ణ ముగిసిన త‌రువాత ఛార్జ్‌షీట్ దాఖ‌లు చేస్తామ‌ని తెలిపారు. ఈ కేసు పోక్సో ప్రత్యేక న్యాయ‌స్థానంలో విచార‌ణ జరుగుతుందని తెలిపారు.

"రాష్ట్రంలో చిన్నారుల‌పై అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరుగుపోతున్నాయి. ప్రతి రోజు చిన్నారుల‌పై లైంగిక‌ దాడి కేసులు వెలుగుచూస్తున్నాయి. వీటిని నియంత్రణ‌లో ప్రభుత్వాలు చ‌ర్యలు చేప‌ట్టినా ఆశించిన ఫ‌లితాలు రావ‌టం లేదు. పోక్సో కేసులు కూడా విచార‌ణ జాప్యం జ‌రుగుతోంది. ఎందుకంటే కేసు విచార‌ణ‌కు త‌గిన‌న్ని పోక్సో ప్రత్యేక న్యాయ‌స్థానాలు అందుబాటులో లేవు. దీనివ‌ల్ల పోక్సో నిందితుల‌పై చ‌ర్యలు వేగ‌వంతం కావటం లేదు.బాధితుల‌కు స‌త్వర న్యాయం అందేట‌ట్లు చేయాలి" అని మ‌హిళా సంఘాలు కోరుతున్నాయి. చిన్నారులు, మ‌హిళ‌ల‌పై అత్యాచారాల నియంత్రణ‌కు అవ‌గాహ‌న చ‌ర్యలు చేప‌ట్టాల‌ని సూచిస్తున్నాయి.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌రజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం