Annadata Sukhibhava Scheme : అన్నదాత సుఖీభవ పథకంపై అప్డేట్, ఆ నెలలో నిధులు విడుదల-త్వరలో విధివిధానాలు!-annadata sukhibhava scheme update funds to farmers in three installments ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Annadata Sukhibhava Scheme : అన్నదాత సుఖీభవ పథకంపై అప్డేట్, ఆ నెలలో నిధులు విడుదల-త్వరలో విధివిధానాలు!

Annadata Sukhibhava Scheme : అన్నదాత సుఖీభవ పథకంపై అప్డేట్, ఆ నెలలో నిధులు విడుదల-త్వరలో విధివిధానాలు!

Bandaru Satyaprasad HT Telugu
Jan 06, 2025 03:57 PM IST

Annadata Sukhibhava Scheme : రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయనుంది. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంతో కలిపి ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ స్కీమ్ అమలుకు సర్కార్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

అన్నదాత సుఖీభవ పథకంపై అప్డేట్, ఆ నెలలో నిధులు విడుదల-త్వరలో విధివిధానాలు!
అన్నదాత సుఖీభవ పథకంపై అప్డేట్, ఆ నెలలో నిధులు విడుదల-త్వరలో విధివిధానాలు!

Annadata Sukhibhava Scheme : ఏపీలో కూటమి ప్రభుత్వం...ఎన్నికల హామీల్లో ఒక్కొక్కటి అమలు చేసేందుకు ప్రయత్నిస్తుంది. తాజాగా అన్నదాత సుఖీభవ పథకంపై ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. కొత్త సంవత్సరంలో రైతులకు శుభవార్త చెప్పింది. రైతుల సంక్షేమానికి సంబంధించిన అన్నదాత సుఖీభవ పథకం అమలుపై ఇటీవల కేబినెట్ లో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి మూడు విడతల్లో రూ.6 వేలు ఇస్తుంది. పీఎం కిసాన్ నిధులతో కలిపి రూ.20 వేలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

yearly horoscope entry point

పీఎం కిసాన్ నిధులు తరహాలో మూడు విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని భావిస్తుంది. ఈ మేరకు కేంద్రం ఒక్కో విడతలో ఎంత మొత్తం నిధులు విడుదల చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత విడుదల చేయాలని విషయాలపై చర్చిస్తుంది. త్వరలోనే అన్నదాత సుఖీభవ విధి విధానాలను ఖరారు చేసి పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అర్హత ఉన్న ప్రతిరైతుకు ఏడాదికి రూ. 20వేలు అందిస్తామని కూటమి నేతలు చెబుతున్నారు. ఈ మేరకు ఇటీవల బడ్జెట్ లో అన్నదాత సుఖీభవ పథకానికి రూ. 4,500 కోట్లను కేటాయించారు.

అన్నదాత సుఖీభవ నిధులను ఈ ఏడాది మే నెలలో విడుదల చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇటీవల నరసాపురంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి రామానాయుడు మాట్లాడుతూ...అన్నదాత సుఖీభవ పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మత్స్యకారులకు మే నెలలోనే రూ.20 వేలు అందిస్తుందన్నారు.

వైసీపీ హయాంలో రైతుభరోసా పేరిట రైతులకు పెట్టుబడి సాయం అందించేవారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట కేంద్రం ఏటా అందించే రూ.6 వేలకు మరో రూ.7,500 కలిపి ఏటా రూ.13,500 అందించేవారు. ఎన్నికల హామీల్లో ఈ మొత్తాన్ని రూ.20 వేలకు పెంచుతామని కూటమి పార్టీలు ప్రకటించాయి. కూటమి ప్రభుత్వం ఈ హామీ అమలుపై దృష్టి సారించింది. మూడు విడతల్లో రూ. 20 వేలు సాయం అందించేంందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పేరిట పోర్టల్ ప్రారంభించింది. అన్నదాత సుఖీభవ పథకం కింద పీఎం కిసాన్ నిధులు రూ.6 వేలకు మరో 14 వేలు కలిపి రూ.20 వేలు అందించనున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం