Telugu News  /  Andhra Pradesh  /  Andhrapradesh And Telangana Telugu Live News Updates 30 November 2022

సీఎం జగన్ మదనపల్లె టూర్

November 30 Telugu News Updates: జేసీ ప్రభాకర్‌రెడ్డి కంపెనీ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ

  •  వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుపై షర్మిలతో పాటు ఆరుగురికి నాంపల్లి న్యాయస్థానం మంగళవారం రాత్రి బెయిల్ మంజూరు చేసింది. మధ్యాహ్నం ప్రగతి భవన్​ వద్ద ఆందోళన నిర్వహించినందుకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రాత్రి 9 గంటల సమయంలో నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ జరిపిన న్యాయమూర్తి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశించారు. మరిన్ని వార్తల అప్డేట్స్ కోసం… ఈ లైవ్ పేజీని ఫాలో అవ్వండి…… 

Wed, 30 Nov 202210:47 IST

జేసీ ప్రభాకర్‌రెడ్డి కంపెనీ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ

టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి కంపెనీ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. బీఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరిగినట్టుగా పేర్కొంది. జేసీ అనుచరుడు గోపాల్ రెడ్డి ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. సుమారు రూ.22.10 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్టుగా ఈడీ తెలిపింది.

Wed, 30 Nov 20227:25 IST

ఇక టికెట్లు అక్కడే…

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టికెట్లు బుధవారం నుంచి తిరుపతి లోనే మంజూరు చేస్తున్నారు. మాధవం అతిథిగృహంలో ఏర్పాటు చేసిన ఈ కౌంటర్లను జేఈవో శ్రీ వీరబ్రహ్మం శాస్త్రోక్తంగా పూజలు చేసి ప్రారంభించారు. గుంటూరుకు చెందిన శ్రీ ఎన్ లక్ష్మి హరీష్, శ్రీమతి జి.రూప సింధు కు జేఈవో తొలి టికెట్ అందించారు.

Wed, 30 Nov 20227:20 IST

తల్లుల ఖాతాలోకి నిధులు…

మదనపల్లె సభకు సీఎం జగన్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్… పిల్లలకు మన ఇచ్చే ఆస్తి చదువే. కుటుంబాల తలరాత మారాలన్నా.. పేదరికం దూరం కావాలన్నా చదువే మార్గమని చెప్పారు. విద్యా దీవెన కింద తల్లుల ఖాతాలో నిధులు జమ చేశారు.

Wed, 30 Nov 20227:12 IST

సీబీఐ నోటీసులు…!

గత కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాలను ఈడీ, ఐటీ సోదాలు కుదిపేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సీబీఐ ఎంట్రీ ఇచ్చేసింది. బుధవారం రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి ఓ బృందం వచ్చింది. కరీంనగర్ లోని ఆయన ఇంటికి వచ్చిన అధికారులు... కుటుంబసభ్యులకు నోటీసులు ఇచ్చారు. మరోవైపు మంత్రి గంగుల ఇవాళ ఉదయమే కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు వెళ్లారు.

Wed, 30 Nov 20226:29 IST

ఆర్టీసీ ఆఫర్… 

సంక్రాంతి పండగకు ఊరు వెళ్లే వారికి రాయితీని ప్రకటించింది ఏపీఆర్టీసీ. రానూపోనూ టిక్కెట్టును ముందుగా బుక్‌ చేసుకుంటే తిరుగు ప్రయాణంలో (ఏసీ, నాన్‌ ఏసీ ఏ బస్సుకైనా) 10 శాతం డిస్కౌంట్‌ ఇవ్వనుంది. ఇక ఈసారి సంక్రాంతికి మాత్రం స్పెషల్‌ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీని వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. గత దసరా సీజనుకు నడిపిన స్పెషల్స్‌కు కూడా ఆర్టీసీ అదనపు చార్జీ వసూలు చేయకుండానే నడిపింది. అది ప్రయాణికుల ఆదరణను చూరగొనడంతో ఆశించిన స్థాయిలో ఆదాయమూ సమకూరింది. దీంతో ఈ సంక్రాంతికి కూడా అదే మాదిరిగా నడపాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రయాణికులకు ఊరట కలిగించనుంది.

Wed, 30 Nov 20226:10 IST

ఈడీ విచారణ

సినీ హీరో విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యారు. లైగర్ చిత్రంలో పెట్టుబడులపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

Wed, 30 Nov 20225:55 IST

సీఎం జగన్ టూర్.. 

సీఎం జగన్ మదనపల్లికి చేరుకున్నారు. మరికాసేపట్లో విద్యా దీవెన నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.   

Wed, 30 Nov 20225:27 IST

ట్వీట్ వార్… 

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీక్షా దివాస్ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత చేసిన ఓ ట్వీట్... ఇందుకు కారణమైంది. "తెలంగాణ కోసం జరిగిన ప్రతి బలిదానం కాంగ్రెస్ పార్టీ చేసిన హత్యే. సొంత నియోజకవర్గం అమేథిలో గెలుస్తానని నమ్మకం లేక కేరళ రాష్ట్రం వాయనాడ్ వెళ్లారు మీ నాయకుడు రాహుల్ గాంధీ.. ఎంపీగా ఓడిపోయినా అక్కడే స్థానిక సంస్థల కోటాలో మీ పార్టీ పైనే ఎమ్మెల్సీ కి పోటీ చేసి గెలిచా" అంటూ కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు. కాసేపటికే తెలంగాణ కాంగ్రెస్ ట్విటర్ ఖాతా నుంచి రిప్లే వచ్చింది.

‘‘ఇది దీక్షా దివాస్ కాదు.. దగా దివాస్! కవిత గారూ. దొంగ దీక్షతో ఉద్వేగాలను రెచ్చగొట్టి, యువతను బలిదానాల వైపు నడిపించిన దుర్దినం. దొంగ దీక్ష నాటకమాడిన మీ నాయన సీఎం కుర్చీ ఎక్కిండు.. చిత్తశుద్దితో ఉద్యమం చేసి, బలిదానాలు చేసిన బిడ్డలకు కనీసం గుర్తింపే లేకపాయే!’’ అని ట్వీట్ లో రాసుకొచ్చారు.

Wed, 30 Nov 20224:01 IST

సూసైడ్..!

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల పరిధిలో విషాదం వెలుగు చూసింది. చదువు విషయంలో తల్లిదండ్రులు మందలించారని బాలిక సూసైడ్ చేసుకుంది.

Wed, 30 Nov 20224:01 IST

కవిత ట్వీట్ 

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. " తాము వదిలిన “బాణం”

తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు” అంటూ రాసుకొచ్చారు. అయితే ఈ ట్వీట్ తో బీజేపీతో పాటు షర్మిలను టార్గెట్ చేశారా..? అన్న చర్చ మొదలైంది. 

Wed, 30 Nov 20222:54 IST

మంత్రి కేటీఆర్ సమీక్ష… 

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీపై మంత్రి కేటీఆర్ సమీక్షించారు. మంగళవారం సిరిసిల్లలో పర్యటించిన ఆయన... అర్హులైన అందరికీ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. సొంత జాగలో ఇంటికి 3 లక్షలు ఇస్తామని... వచ్చే నెల నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు.

Wed, 30 Nov 20222:00 IST

నోటిఫికేషన్.,,, 

ఏపీలోనూ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఒక్కొక్కటిగా వచ్చేస్తున్నాయి. పోలీస్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన రాగా... తాజాగా బీఎస్సీ నర్సింగ్‌ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ సర్కార్. ప్రభుత్వాస్పత్రుల్లోని 461 స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదలైంది. ఇవాళ్టి నుంచే (నవంబర్ 30) దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్‌ 5ను తుది గడువుగా నిర్ణయించారు. http://cfw.ap.nic.in వెబ్‌సైట్‌ ద్వారా ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

Wed, 30 Nov 20221:35 IST

సీఎం జగన్ టూర్…. 

సీఎం జగన్ ఇవాళ అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. మదనపల్లెలో జగనన్న విద్యాదీవెన పథకం కింద విద్యార్థులకు నిధులను విడుదల చేయనున్నారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేస్తారు. ఈ దఫాలో మొత్తం 11.02 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది.

Wed, 30 Nov 20221:08 IST

నోటిఫికేషన్లు జారీ… 

TSPSC Ground Water department Jobs: నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. గ్రూప్ 1 ఇవ్వగా... మరోవైపు గ్రూప్ 2, 3, 4 పోస్టుల భర్తీకి కూడా త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే తాజాగా... గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా వివరాలను వెల్లడించింది.

Wed, 30 Nov 20221:08 IST

ముందుస్తు ఎన్నికలపై చర్చ…. 

తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చేస్తుంటే ఎన్నికల వాతావరణం తలపిస్తుంది. ఓవైపు గులాబీ బాస్ కారు స్పీడ్ ను మరింత పెంచే పనిలో పడ్డారు. ఇదే సమయంలో బండి సంజయ్ పాదయాత్ర, ప్రక్షాళన దిశగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. మరోవైపు షర్మిల ప్రజాప్రస్థానయాత్ర కొనసాగుతోంది. సరిగ్గా ఎన్నికలకు ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో.... ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. కేసీఆర్ ముందస్తుకు వెళ్తారనే చర్చ జరిగినప్పటికీ... అలా జరగలేదు. కేసీఆర్ కూడా వెళ్లేది లేదంటూ క్లారిటీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం సీన్ చూస్తుంటే... మరోసారి ముందస్తు ఎన్నికలపై తెగ చర్చ నడుస్తోంది.

Wed, 30 Nov 20221:08 IST

బెయిల్ మంజూరు… 

వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుపై షర్మిలతో పాటు ఆరుగురికి నాంపల్లి న్యాయస్థానం మంగళవారం రాత్రి బెయిల్ మంజూరు చేసింది. మధ్యాహ్నం ప్రగతి భవన్​ వద్ద ఆందోళన నిర్వహించినందుకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రాత్రి 9 గంటల సమయంలో నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ జరిపిన న్యాయమూర్తి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశించారు.

ఆర్టికల్ షేర్ చేయండి