Andhra Woman In Kuwait : కువైట్ లో చిక్కుకున్న ఏపీ మహిళ క్షేమంగా స్వగ్రామానికి- మంత్రులు, ఏపీ ఎన్నార్టీ సాయం-andhra woman stuck in kuwait tortured by employer safely reached home ap govt helped ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Woman In Kuwait : కువైట్ లో చిక్కుకున్న ఏపీ మహిళ క్షేమంగా స్వగ్రామానికి- మంత్రులు, ఏపీ ఎన్నార్టీ సాయం

Andhra Woman In Kuwait : కువైట్ లో చిక్కుకున్న ఏపీ మహిళ క్షేమంగా స్వగ్రామానికి- మంత్రులు, ఏపీ ఎన్నార్టీ సాయం

Bandaru Satyaprasad HT Telugu
Sep 14, 2024 02:44 PM IST

Andhra Woman In Kuwait : కువైట్ లో చిక్కుకున్న ఏపీ మహిళను క్షేమంగా స్వగ్రామానికి తీసుకొచ్చారు. మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్ రెడ్డి సూచనలతో ఏపీ ఎన్ఆర్టీ సాయంతో ఆ మహిళ నిన్న రాత్రి కువైట్ నుంచి బయలుదేరి ఉదయం చెన్నై చేరుకుంది. అనంతరం ఆమె స్వగ్రామానికి తీసుకొచ్చారు.

కువైట్ లో చిక్కుకున్న ఏపీ మహిళ క్షేమంగా స్వగ్రామానికి
కువైట్ లో చిక్కుకున్న ఏపీ మహిళ క్షేమంగా స్వగ్రామానికి

Andhra Woman In Kuwait : ఉపాధి కోసం కువైట్ వెళ్లి పనిప్రదేశంలో ఇబ్బందులు పడుతున్న అన్నమయ్య జిల్లా తంబేపల్లి మండలం నారాయణ రెడ్డి పల్లి గ్రామానికి చెందిన తిరుపతి కవిత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. ఆమెను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావాలని కోరారు. దీంతో ప్రవాసాంధ్రుల సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఏపీ ఎన్నార్టీ 24x7 హెల్ప్ లైన్ ద్వారా కువైట్ లో ఉన్న సామాజిక కార్యకర్త జిలకర మురళి షేక్ రసీదా బేగం సాయంతో ఆ మహిళను ఏపీలోని స్వగ్రామానికి తీసుకొచ్చారు. శుక్రవారం రాత్రి కువైట్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఫ్లైట్ ఐ ఎక్స్ 698 లో బయలుదేరిన కవిత ఉదయం 7 గంటలకు చెన్నై ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.

ఉపాధి కోసం ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి, ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నంలో భాగంగా కువైట్ వెళ్లిన కవితకు పని ప్రదేశంలో అనేక ఇబ్బందులకు గురయినట్లు ఆమె వీడియో ద్వారా తెలియజేశారు. ఆమెకు ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా దగ్గరలో ఉన్న తన సోదరి వద్ద తాత్కాలిక ఆశ్రయం పొంది మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని వీడియో ద్వారా సంప్రదించారు. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన రవాణా శాఖ మంత్రి, ప్రవాసంధ్రుల సాధికారత సంబంధాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో మాట్లాడారు. కవితను తన స్వస్థలానికి సురక్షితంగా తీసుకురావాల్సిందిగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి కోరారు. నిన్న ఉదయం మంత్రి కార్యాలయానికి సమాచారం అందిన వెంటనే తక్షణం స్పందించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఏపీ ఎన్ఆర్టీ అత్యవసర విభాగాన్ని అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి సూచనల మేరకు స్పందించిన ఏపీ ఎన్ఆర్టీ 24 గంటల అత్యవసర విభాగం కువైట్ లో ఉన్న సామాజిక కార్యకర్త జిలకర మురళిని ఫోన్ ద్వారా సంప్రదించారు.

12 గంటలోపే స్వదేశానికి

మురళి తోపాటు అక్కడే ఉన్న రషీదా బేగం అనే ప్రవాసాంధ్ర మహిళ ఇరువురు కలిసి కవిత ఆశ్రయం పొందిన ప్రాంతానికి వెళ్లి, ఆవిడను సురక్షితంగా దేశానికి తిరిగి పంపేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందించారు. గత రాత్రి కువైట్ నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ద్వారా బయలుదేరిన కవిత శనివారం ఉదయం 7 గంటలకు చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ విషయంపై స్పందించిన కవిత భర్త వెంకటేశ్వర్లు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి విదేశాలకు తన భార్య వెళ్లిందని, ఆ పని ప్రదేశంలో అనేక ఇబ్బందులు ఎదురవడంతో తాను తిరిగి వస్తుందన్న నమ్మకాన్ని కోల్పోయానన్నారు. చివరి ఆశగా మంత్రి రాంప్రసాద్ రెడ్డిని సంప్రదించామని, ఆయన తక్షణమే స్పందించి ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు విషయం తెలియజేసి 12 గంటల లోపే తమన భార్యను దేశానికి తీసుకొచ్చేందుకు సాయం చేశారని తెలిపారు.

అన్నమయ్య జిల్లా నారాయణరెడ్డిపల్లెకు చెందిన కవిత ఉపాధి కోసం కువైట్‌ వెళ్లారు. అక్కడ తనను ఓ గదిలో బంధించి చిత్ర హింసలకు గురి చేస్తున్నారని, తనను కాపాడాలంటూ గురువారం ఆమె వీడియో కాల్‌ ద్వారా మంత్రి రాంప్రసాద్‌రెడ్డిని కోరారు. తన భర్త దివ్యాంగుడని, ముగ్గురు పిల్లలు ఉన్నారని, తనను స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని కన్నీటి పర్యంతం అయ్యింది. దీనిపై తక్షణం స్పందించిన మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్ ఆమెను స్వస్థలానికి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.

సంబంధిత కథనం