ఆంధ్రప్రదేశ్ లో రానున్న రెండు రోజులు భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. బుధవారం అల్లూరి, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, వైఎస్ఆర్ కడప, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, కోనసీమ, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు50-60కిమీ వేగంతో ఈదురుగాలులకు అవకాశం ఉన్నందున హోర్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలోని గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదని సూచించారు.
అలాగే రేపు(బుధవారం) 41-43°C మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 12 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 35 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం తిరుపతి జిల్లా వెంకటగిరిలో 43.2°C అధిక ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.
ద్రోణి ప్రభావంతో రాగల నాలుగు రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో పాటు ఉపరితల చక్రవాక ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది.
క్యుములోనింబస్ మేఘాల వల్ల పగటిపూట ఉష్ణోగ్రతలు, సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
రాగల నాలుగు రోజుల పాటు ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం ఉదయం వరకు తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 50-60 కి.మీ)తో కూడిన వర్షాలతో పాటు వడగండ్ల వర్షాలు నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది.
రేపు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్కర్నూల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది.
సంబంధిత కథనం