AP TG Mlc Elections : ఏపీ, తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల-andhra pradesh telangana mla quota mlc election schedule released ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tg Mlc Elections : ఏపీ, తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

AP TG Mlc Elections : ఏపీ, తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

AP TG Mlc Elections : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 20న పోలింగ్ , కౌంటింగ్ నిర్వహిస్తారు. ఏపీలో 5 , తెలంగాణలో 5 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఏపీ, తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

AP TG Mlc Elections : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మార్చి 29లోపు ఏపీలో ఐదుగురు, తెలంగాణకు చెందిన ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు మార్చి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 20న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు కౌంటింగ్ నిర్వహిస్తారు.

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • మార్చి 3 - నోటిఫికేషన్
  • మార్చి 20- పోలింగ్, కౌంటింగ్
  • ఏపీలో - 5 ఖాళీలు
  • తెలంగాణలో- 5 ఖాళీలు

ఏపీ, తెలంగాణలో 29.03.2025న పదవీ విరమణ చేస్తున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయడానికి ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 10 మంది అభ్యర్థులు పదవీకాలం ముగియనుంది.

ఆంధ్రప్రదేశ్(29.03.2025 నాటికి ఖాళీ)

1.కృష్ణ మూర్తి జంగా (15.05.2024 నాటికి ఖాళీ)

2.దువ్వారపు రామారావు

3.పర్చూరి అశోక్ బాబు

4.బి. తిరుమల నాయుడు

5. యనమల రామకృష్ణుడు

తెలంగాణ(29.03.2025 నాటికి ఖాళీ)

1.మొహమ్మద్ మహమూద్ అలీ

2.సత్యవతి రాథోడ్

3.సెరి సుభాష్ రెడ్డి

4. మల్లేశం యాగీ

5.మీర్జా రియాజుల్ హసన్ ఎఫెండి

ముఖ్యమైన తేదీలు

1. నోటిఫికేషన్ జారీ - మార్చి 03, 2025 (సోమవారం)

2. నామినేషన్లు వేయడానికి చివరి తేదీ - 10 మార్చి, 2025 (సోమవారం)

3.నామినేషన్ల పరిశీలన - 11 మార్చి, 2025 (మంగళవారం)

4. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ - 13 మార్చి, 2025 (గురువారం)

5.పోలింగ్ తేదీ - 20 మార్చి, 2025 (గురువారం)

6.పోలింగ్ సమయం - 09:00 am- 04:00 pm

7.ఓట్ల లెక్కింపు- 20 మార్చి, 2025 (గురువారం) సాయంత్రం 05:00 గంటలకు

8. ఈ తేదీలోపు ఎన్నికల నిర్వహణ - 24 మార్చి, 2025 (సోమవారం)

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం