ఏపీకి కుంకీ ఏనుగులు ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం, పవన్ కల్యాణ్ సమక్షంలో అందజేత-andhra pradesh receives 6 kumki elephants from karnataka pawan kalyan attends ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీకి కుంకీ ఏనుగులు ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం, పవన్ కల్యాణ్ సమక్షంలో అందజేత

ఏపీకి కుంకీ ఏనుగులు ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం, పవన్ కల్యాణ్ సమక్షంలో అందజేత

ఏపీకి నాలుగు కుంకీ ఏనుగులను అప్పగించింది కర్ణాటక ప్రభుత్వం. బెంగళూరు విధానసౌధలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో కుంకీ ఏనుగులను అప్పగించారు.

ఏపీకి కుంకీ ఏనుగులు, పవన్ కల్యాణ్ సమక్షంలో అందించిన కర్ణాటక ప్రభుత్వం

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో ఏపీకి ఆరు ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం అందించింది. బెంగళూరు విధానసౌధలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సమక్షంలో కుంకీ ఏనుగులను అప్పగించారు.

కుంకీ ఏనుగుల అప్పగింత, వాటి సంరక్షణకు సంబంధించిన డాక్యుమెంట్లను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, పవన్ కల్యాణ్ కు అందజేశారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ...కుంకీ ఏనుగులు అందించిన కర్ణాటక ప్రభుత్వానికి, సీఎం సిద్ధరామయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి సాయం అడిగినా కర్ణాటక ప్రభుత్వం ముందుకొస్తోందని చెప్పారు.

ఏపీ, కర్ణాటక మధ్య సహకారం ఇలాగే కొనసాగాలని పవన్‌ కల్యాణ్ ఆకాంక్షించారు. కుంకీ ఏనుగుల సంరక్షణకు ఏపీలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో ఏనుగుల సమస్య

కుంకీ ఏనుగుల అప్పగింతపై ఏపీ, కర్ణాటక మధ్య 9 ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. పంట పొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగులను నియంత్రించేందుకు కుంకీ ఏనుగులను ఉపయోగిస్తామని పవన్ తెలిపారు.

ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఏనుగుల వల్ల పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. చిత్తూరు, శ్రీకాకుళం, సాలూరు ప్రాంతాల్లో అటవి ఏనుగుల సమస్య అధికంగా ఉందన్నారు.

అటవీ భూమిని ఆక్రమించడం వల్ల ఏనుగులు జనవాసాల్లోకి వస్తున్నాయో లేక ఏం జరుగుతుందో తెలియడం లేదని పవన్ అన్నారు. ఈ తరహా సమస్యను కర్ణాటక ప్రభుత్వం చాలా పకడ్బందీ నిరోధిస్తుందని చెప్పారు.

అందులో భాగంగా కర్ణాటక ప్రభుత్వం చాలా ఏనుగులకు శిక్షణ ఇచ్చిందన్నారు. అవి ఎలా వ్యవహరించాలో కూడా శిక్షణ ఇచ్చారని చెప్పారు.

అటవి ఏనుగుల నియంత్రణకు

ఇకపై ఏనుగులు జనావాసా ప్రాంతంలోకి రాకుండా, వాటికి ప్రత్యేక మార్గం ద్వారా వెళ్లేలా ఏర్పాటు చేయాల్సి ఉందని పవన్ అన్నారు. దీంతో ఆ ప్రాంతంలోని రైతుల భద్రతతో పాటు సురక్షిత చర్యలు తీసుకుంటామన్నారు.

అడవి ఏనుగుల దాడి కారణంగా పలు గ్రామాల ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారని చెప్పారు. అడవి ఏనుగులను నియంత్రించడానికి కుంకీ ఏనుగులను ఉపయోగిస్తామన్నారు.

పూర్తిస్థాయిలో శిక్షణ

కుంకీలు ఏనుగులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తారు. ఎక్కడైనా గ్రామాలపై, పంట పొలాల్లోకి ఏనుగులు వస్తే వాటిని తరిమికొట్టడంలో కుంకీలు కీలక భూమిక పోషిస్తాయి. కొన్నిసార్లు గాయపడిన లేదా చిక్కుకున్న అడవి ఏనుగును రక్షించడానికీ కుంకీలను ఉపయోగిస్తారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం