AP PG CET : సెప్టెంబర్ 3 నుంచి పీజీ ఎంట్రన్స్‌ పరీక్షలు….-andhra pradesh post graduation common entrance test from september 3 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh Post Graduation Common Entrance Test From September 3

AP PG CET : సెప్టెంబర్ 3 నుంచి పీజీ ఎంట్రన్స్‌ పరీక్షలు….

HT Telugu Desk HT Telugu
Aug 23, 2022 07:36 AM IST

ఆంధ్రప్రదేశ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్ కామన్‌ ఎంట్రన్స్ పరీక్షలు సెప్టెంబర్ 3 నుంచి నిర్వహించనున్నారు. గత ఏడాది విద్యా సంవత్సరం ఆలశ్యమవడం, డిగ్రీ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో జాప్యం జరగడంతో ఆ ప్రభావం ఈ ఏడాది కూడా కొనసాగుతోంది.

పీజీ సెట్ షెడ్యూల్ ప్రకటించిన ఉన్నత విద్యా మండలి
పీజీ సెట్ షెడ్యూల్ ప్రకటించిన ఉన్నత విద్యా మండలి

ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో వైఎస్సార్‌ జిల్లాలోని యోగి వేమన యూనివర్శిటీ నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్‌ పరీక్షలు సెప్టెంబర్‌ 3 నుంచి నిర్వహించనున్నారు. ఏపీ పీజీ సెట్ 2022 పరీక్షల్ని సెప్టెంబర్ 3 నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఆగష్టు 18వరకు ఎంట్రన్స్‌ పరీక్షల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 147 సబ్జెక్టుల్లో పీజీ కోర్సుల కోసం 39,359మంది దరఖాస్తు చేసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

యూనివర్శిటీలతో పాటు పీజీ సెంటర్స్‌లో పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం సెప్టెంబర్ 3 నుంచి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 3, 4,7, 10,11 తేదీలలో రాష్ట్రంలోని ఎంపిక చేసిన కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో ఎంట్రన్స్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి రోజు మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి సెషన్‌లో ఉదయం 9.30 నుంచి 11గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం ఒకటి నుంచి రెండున్నర వరకు రెండో సెషన్‌, సాయంత్రం నాాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు మూడో సెషన్ నిర్వహిస్తారు. ఆగష్టు 25 నుంచి విద్యార్ధులు హాల్‌ టిక్కెట్లను డౌన్‌ లోడ్ చేసుకోవచ్చు.

పీజీ కోర్సుల్లో ఎక్కువ మంది కెమికల్ సైన్స్ డిగ్రీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కెమికల్ సైన్సెస్‌ 9,899 మంది లైఫ్ సైన్సెస్ 5,960మంది దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ప్రతి యూనివర్శిటీ విడివిడిగా ప్రవేశపరీక్షలు నిర్వహించేది. దీంతో విద్యార్దులకు ఇబ్బందులు తలెత్తేవి. దీంతో ఉన్నత విద్యా మండలి అన్ని యూనివర్శిటీలకు కలిపి పీజీ ఎంట్రన్స్‌ నిర్వహిస్తోంది. పీజీ ఎంట్రన్స్‌లో సంస్కృతం, ఉర్దూ, తమిలం, బిఎఫ్‌ఏ, పర్ఫార్మింగ్ ఆర్ట్స్‌ అండ్ మ్యూజిక్, ఆర్ట్స్‌, టూరిజం, జియోగ్రఫి కోర్సులకు పెద్దగా దరఖాస్తులు రాకపోవడం అందుబాటులో ఉన్న సీట్ల కంటే దరఖాస్తుల సంఖ్య తక్కువగా ఉండటంతో వాటికి ప్రవేశపరీక్ష నిర్వహించడం లేదు. డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా అయా కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.

WhatsApp channel

టాపిక్