KGBV Notification : కేజీబీవీల్లో 1358 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, ఈ నెల 5తో ముగియనున్న దరఖాస్తుల గడువు-andhra pradesh kgbv recruitment notification applications last date on june 5th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh Kgbv Recruitment Notification Applications Last Date On June 5th

KGBV Notification : కేజీబీవీల్లో 1358 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, ఈ నెల 5తో ముగియనున్న దరఖాస్తుల గడువు

Bandaru Satyaprasad HT Telugu
Jun 03, 2023 09:53 PM IST

KGBV Notification : కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి ఈ నెల 5వ తేదీతో దరఖాస్తుల గడువు ముగియనుంది. ఏపీ సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో నిర్వహించే కేజీబీవీల్లో మొత్తం 1358 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది.

కేజీబీవీల్లో ఉద్యోగాలు
కేజీబీవీల్లో ఉద్యోగాలు

KGBV Notification : ఏపీ సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో నిర్వహించస్తున్న కేజీబీవీ(KGBV)ల్లో ఖాళీగా ఉన్న 1358 పోస్టుల భర్తీ కోసం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల కోసం ఇప్పటి వరకు 17,963 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 12,093 మంది తమ దరఖాస్తులు సమర్పించారని సమగ్ర శిక్షా సంచాలకులు తెలిపారు. ఈ నెల 5వ తేదీతో ఉద్యోగాల దరఖాస్తుల గడువు ముగియనుంది. ఈ పోస్టులకు అత్యధికంగా కర్నూలు జిల్లా నుంచి 2142 మంది, తదుపరి అనంతపురం నుంచి 1645 మంది దరఖాస్తు చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి అతి తక్కువగా 256 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు 20 వేలకు పైగా వస్తాయని సమగ్ర శిక్షా అధికారులు భావిస్తున్నారు. అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కావున అభ్యర్థులు 73866 86501, 95730 61629, 94412 70099 నెంబర్లకు ఫోన్ చేయవచ్చని సూచించరు. లేదా apss_kgbv@schooledu.in కు మెయిల్ చేయవచ్చన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 5వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

1358 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర శిక్షా సొసైటీ-పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా మొత్తం 1358 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రిన్సిపల్-92 పోస్టులు, పీజీటీ- 846 పోస్టులు, సీఆర్‌టీ-374 పోస్టులు, పీఈటీ-46 పోస్టులు భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో ప్రకటించారు. అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించి మే 29 నుంచి జూన్‌ 5 వరకు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ ఉత్తీర్ణులై ఉండాలని నోటిఫికేషన్ లో తెలిపారు. జనరల్‌ అభ్యర్థులకు 18-42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది : 05.06.2023
  • మెరిట్ జాబితా విడుదల (1:3 నిష్పత్తిలో) : 06.06.2023 - 07.06.2023
  • సర్టిఫికేట్ వెరిఫికేషన్ : 08.06.2023 - 09.06.2023
  • పర్సనాలిటీ టెస్ట్ (జిల్లాస్థాయిలో) : 10.06.2023 - 12.06.2023
  • తుది ఎంపిక : 12.06.2023
  • అభ్యర్థుల నియామక పత్రాల జారీ : 13.06.2023
  • రిపోర్టింగ్ తేదీ : 14.06.2023

IPL_Entry_Point