Telugu News  /  Andhra Pradesh  /  Andhra Pradesh High Court Serious Comments On Obscenity In Bigg Boss Show
బిగ్ బాస్ షో పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
బిగ్ బాస్ షో పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

AP HC On Big Boss Show: బిగ్​బాస్​ రియాల్టీ షోపై ఏపీ హైకోర్టు సీరియస్

30 September 2022, 16:52 ISTHT Telugu Desk
30 September 2022, 16:52 IST

AP High Court on Bigg Boss reality show: బిగ్​బాస్​ రియాల్టీ షోపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధర్మాసనం సీరియస్ కామెంట్స్ చేసింది.

ap high court serious comments on bigboss show: బిగ్ బాస్ షోలోని అశ్లీలతపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బిగ్‌బాస్‌ రియాల్టీ షోను బ్యాన్‌ చేయాలని దాఖలైన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపింది. బిగ్​బాస్ షోలో అశ్లీలత పెరిగిందంటూ దాఖలైన పిల్ పై న్యాయవాది శివప్రసాద్‌ రెడ్డి వాదనలు వినిపించారు. బిగ్​బాస్ రియాల్టీ షోలో ఐబీఎఫ్ గైడ్​లైన్స్ పాటించలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.అశ్లీలత ఎక్కువగా ఉందని వాదించారు.

ట్రెండింగ్ వార్తలు

బిగ్‌బాస్‌ రియాల్టీ షోలోని అశ్లీలతపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఘాటుగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. 1970ల్లో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసు కదా గుర్తు చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది స్పందిస్తూ... ఈ అంశంపై కొంత సమయం కావాలని కోరారు. పూర్తి వివరాలతో వివరణ ఇస్తామని చెప్పారు. మరోవైపు ప్రతివాదులకు నోటీసులపై తదుపరి వాయిదాలో నిర్ణయిస్తామని స్పష్టం చేస్తూ.... విచారణను అక్టోబర్‌11కు వాయిదా వేసింది.

అయితే బిగ్ బాస్ రియాల్టీ షో వేర్వురు భాషాల్లో ప్రసారం అవుతోంది. అయితే విచారణ సందర్భంగా కేవలం ఏ ఒక్క భాషానో కాకుండా...ఒవరాల్ గా బిగ్ బాస్ షోలో అశ్లీలత ఎక్కువగా ఉందనే అంశంపై విచారణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ పిల్ ను సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దాఖలు చేశారు.

ఇదిలా ఉంటే బిస్‌బాస్‌ను బ్యాన్‌ చేయాలంటూ కొద్దిరోజులుగా డిమాండ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో పై సీపీఐ నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా షోను రద్దు చేయాలని కోరిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులతో కలిసి చూడలేని ఈ షోను బ్యాన్ చేయాలని పలువురు తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్నారు.

ఈనేపథ్యంలో తదుపరి విచారణ ఏపీ హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది..? రియాల్టీ షో నిర్వహకులకు ఏమైనా నోటీసులు ఇస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.