AP Goir Website: తెరుచుకున్న ఏపీ ప్రభుత్వ జీవోల వెబ్‌సైట్ Goir, అందుబాటులోకి జీవోలు
AP Goir Website: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవోల వెబ్‌సైట్ ఎట్టకేలకు తెరుచుకుంది మూడేళ్లకు పైగా ప్రజలకు అధికారిక సమాచారం అందకుండా గోప్యత పాటించిన జీవో ఐఆర్ వెబ్‌సైట్‌ను ఏపీ ప్రభుత్వం గురువారం అందుబాటులోకి తీసుకువచ్చింది.
AP Goir Open: ప్రభుత్వ ఉత్తర్వులను గోప్యంగా ఉంచే చీకటి పాలనకు ఎట్టకేలకు విముక్తి లభించింది.ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ జీవోలను గతంలో మాదిరి జీవోఐఆర్ వెబ్‌సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది.
మూడున్నరేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉత్తర్వుల్ని ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారు. హైకోర్టు ఆదేశించినా గత ప్రభుత్వం బేఖాతరు చేసింది. ఏపీ GOIR website ను గురువారం నుంచి పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో నంబర్ 79ను మంగళవారం విడుదల చేశారు. దీని ప్రకారం గురువారం నుంచి జీవోఐఆర్ సైట్‌లో ప్రభుత్వ ఉత్తర్వుల్ని అప్డేట్ చేస్తున్నారు.
దేశంలోనే తొలిసారి ఏపీలోనే…
ప్రభుత్వ జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో 2008 జనవరిలో GOIR website ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించారు.ప్రభుత్వ నిర్ణయాలతో పాటు, విధానాలపై మీడియాలో కథనాలు రావడం, కోర్టులలో కేసులు దాఖలు కావడంతో ఆగస్టు 15, 2021 న జగన్ ప్రభుత్వం GOIR websiteలో జీవో లను రిజిస్టర్ చేసి పబ్లిష్ చేసే విధానాన్ని ఉపసంహరించుకుంది.
2008కు ముందు ఆచరణలో ఉన్న ఫిజికల్ రిజిస్టర్‌లలో జీవోలను నమోదు చేసే ప్రక్రియను తీసుకొచ్చింది. వైసీపీ పాలనలో జరిగిన వ్యవహారాలు ఎవరికీ తెలియ కూడదనే ఉద్దేశంతో ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు.
గడిచిన 3ఏళ్లలో ఇచ్చిన జీవో లను, జీవో లను నమోదు చేసిన ఫిజికల్ రిజిస్టర్ లను GOIR website లో అందుబాటులో ఉంచాలని హైకోర్టు ఆదేశించినా దానిని పాటించలేదు. వీటిని తక్షణం ఆన్ లైన్ లోకి తీసుకురాకపోతే రోజులు గడిచే కోద్దీ రిజిస్టర్ లు, జీవోలు మాయమైపోతాయి. 2021-24 మధ్య కాలానికి సంబందించిన ప్రభుత్వ ఉత్తర్వులు దొరకకుండా పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వ ఉత్తర్వులను ప్రభుత్వమే ప్రభుత్వ website లో ఉంచకపోతే ఏవి నకిలీ ఉత్తర్వులో ఏవి నిజమైన ఉత్తర్వులో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉంది.
గతంలో ఏమి జరిగేది…
2008లో GOIR వెబ్సైట్ అందుబాటులోకి రాకముందు ప్రభుత్వంలోని ప్రతి శాఖ జీవోల విడుదలను మ్యాన్యువల్గా అంటే 3 రకాల రిజిస్టర్ల ద్వారా(పుస్తకరూపంలో) ఇచ్చేది
- కేటగిరీ 1 GO.MS : దీనిద్వారా పాలసీ పరమైన, ఎక్కువకాలపరిమితి ఉండే ప్రభుత్వ నిర్ణయాలను ఈ GO.Ms కేటగిరీ పేరుతో విడుదల చేస్తారు.
- కేటగిరీ 2: GO.Rt నిర్దిష్ట కాలపరిమితితో కూడిన ప్రభుత్వ నిర్ణయాలను ఈ GO.Rt పేరుతో విడుదల చేస్తారు.
- కేటగిరీ 3: GO.P. కేబినెట్ తీసుకున్న కొన్ని నిర్ణయాలను GO.P. పేరుతో విడుదల చేస్తారు.
నోట్ ఫైల్స్‌లో సంబంధిత శాఖ సెక్రటరీ/ మినిస్టర్/సీఎం తీసుకున్న నిర్ణయం తాలూకు ఆర్డర్ కాపీని సిద్ధం చేసి మ్యాన్యువల్ రిజిస్టర్లో(పుస్తకంలో) సబ్జెక్టు వివరాలు, సంబంధిత సెక్షన్ వివరాలు నమోదు చేసి రిజిస్టర్లో ఉన్న సీరియల్ నెంబర్ని సిద్ధం చేసుకున్న ఆర్డర్ కాపీపై ఆ నెంబర్ వేసి నోట్ ఫైల్, ఈ ఆర్డర్ కాపీని స్టాక్ ఫైలుగా నమోదు చేసేవారు.
ఈ ఆర్డర్ కాపీని సంబంధిత శాఖలకు, ఆ నిర్ణయాన్ని అమలు చేయాల్సిన ఏజెన్సీలకు పంపి, నోట్ఫైలును, ఆర్డర్ కాపీని స్టాక్ ఫైలు రూపంలో రికార్డు రూములో భద్రపరిచేవారు.
మాన్యువల్ విధానంలో ఇబ్బందులెన్నో…
ఈ మొత్తం వ్యవహారం చూసుకోవడానికి గతంలో ప్రతీ సెక్షన్‌కు ఒక సెక్షన్ అధికారి, ఇద్దరు నుంచి ముగ్గురు అసిస్టెంట్ సెక్షన్ అధికారులు, ఒక రికార్డు అసిస్టెంట్, ఒక అటెండర్, ప్రింటర్లు, జిరాక్సు మెషీన్లు, వీటిని భద్రపరచడానికి రికార్డు రూములు ఉండేవి. జీవోలను భద్రపరచడానికి ర్యాక్స్, ఇదంతా నిర్వహించడానికి ప్రతిశాఖకు భారీగా నిధులు అవసరమయ్యేవి. ప్రభుత్వ ఖజానాపై ఈ భారం అధికంగా ఉం డేది.
ఖజానాపై ఇంత ఖర్చుని భరిస్తూ కూడా ఏ జీవో ఎప్పుడు, ఎందుకోసం, ఏ సందర్భంలో ఇచ్చామో తెలుసుకోవాలంటే సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే కొన్ని రికార్డులు మిస్ అవడం, కొన్నింటికి చెదలు పట్టడం, షార్ట్ సర్క్యూట్ల వల్ల మంటలు చెలరేగి రికార్డులు తగలబడిపోవడం లాంటి ఘటనలు కూడా జరిగేవి.
సమాచార హక్కు చట్టం 2006లోని నిబంధనల దృష్ట్యా ప్రభుత్వ ఉత్తర్వులను తనంతట తానే ఆన్లైన్లో ప్రజలందరికీ అం దుబాటులో ఉంచాల్సిన పరిస్థితుల నేపథ్యంలో పెరిగిన టెక్నాలజీని అందిపుచ్చుకుని, అత్యంత పారదర్శకంగా ప్రభుత్వ ఉత్తర్వులన్ని ఆన్లైన్లోనే రిజిస్టర్ (మ్యాన్యువల్ రిజిస్టర్ల స్థానంలో) చేసే వ్యవస్థకు శ్రీకారం చుట్టడంలో భాగంగా GOIR వెబ్సైట్ రూపకల్పన చేశారు.
వివాదాస్పద నిర్ణయాలతో ఉక్కిరిబిక్కిరి….
వ్యవస్థలో పారదర్శకత కోణంలో చూస్తే ఆన్‌లైన్‌లో ప్రభుత్వ జీవోలను ఉంచడం ఒక విప్లవాత్మక చర్యగా పరిగణించాలి. ప్రభుత్వ ఉత్తర్వులు విడుదలైన క్షణంలోనే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, సామాన్యులకు కూడా ఏకకాలంలో ఆ ఉత్తర్వులను అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత GOIR వెబ్ సైటుదే.
2008లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తీసుకొచ్చిన వెబ్‌సైట్‌ను ఆ తర్వాత వచ్చిన 3 ప్రభుత్వాలు కొనసాగించాయి. వైఎస్ తనయుడు జగన్‌కు మాత్రం దానిపై వ్యతిరేకత రావడం విశేషం. గతంలో ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉత _ర్వులన్నీ GOIR వెబ్ సైట్లో రిజిస్టర్ కావడం వల్ల ఇబ్బందిగా భావించలేదు.
వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొన్నాళ్లకే ప్రభుత్వం తీసుకుంటున్న అనేక అసంబద్ధ నిర్ణయాల వెనుక వాస్తవాలపై చర్చ జరగడం, సోషల్ మీడియాలో ట్రోల్ అవడం, కోర్టుల నుంచి వ్యతిరేక తీర్పులు రావడం, ప్రజలు వాస్తవాలు తెలుసుకోవడం సర్కారుకు ఇబ్బందికరంగా పరిణమించింది.
ఈ పరిస్థితి నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఉత్తర్వులను ఆన్లైన్లో ఖాళీ పేజీలతో రిజిస్టర్ చేయడం మొదలుపెట్టారు. దీనివల్ల జీవో నెంబరు కనిపిస్తున్నప్పటికీ జీవోలో ఏముందో తెలియకపోవడం తో ఈ నెంబరు కలిగిన జీవో దేనికి సంబంధించినది అని బయటకు తెలిసేది కాదు.
మీడియా ప్రతినిధులు, ఔత్సాహికులు సంబంధిత శాఖల అధికారులను సంప్రదించడం, విషయాన్ని తెలుసుకోవడం, మళ్లీ మీడియాలో వార్తలు రావడం, సోషల్ మీడియాలో ట్రోల్స్, కోర్టుల్లో కేసులు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీంతో ఇలా కూడా లాభం లేదనుకున్న సర్కారు ఏకంగా ప్రభుత్వ ఉత్తర్వులను రిజిస్టర్ చేసే GOIR సైటును మూసేసింది.
దీని స్థానంలో 14 ఏళ్లకు పూర్వం అంటే 2008లో GOIR సైటు రూపకల్పనకు ముందు ఉన్న మ్యాన్యువల్ రిజిస్టర్లో ప్రభుత్వ ఉత్తర్వులను రిజిస్టర్ చేయడాన్ని ప్రవేశపెట్టింది.
ఆర్టీఐ చట్టం 2005 ప్రకారం, ప్రభుత్వ ఉత్తర్వులను ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న నిబంధనల ప్రకారం GOIR సైటును తిరిగి అందుబాటులోకి తేవాలని కొంతమంది కోర్డు మెట్లెక్కడంతో, కోర్టుల్లో ఇబ్బంది ఎదురవుతుం దనే ఉద్దేశంతో హడావిడిగా ప్రభుత్వం జీవో నెంబరు 100ని ఇష్యూ చేసి ప్రభుత్వ ఉత్తర్వులను నాలుగు కేటగిరీలుగా విభజించి విడుదల చేయడం సర్కారుకు ఇబ్బందికరంగా పరిణమించింది.
ఈ పరిస్థితి నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఉత్తర్వులను ఆన్లైన్లో ఖాళీ పేజీలతో రిజిస్టర్ చేయడం మొదలుపెట్టారు. దీనివల్ల జీవో నెంబరు కనిపిస్తున్నప్పటికీ జీవోలో ఏముందో తెలియకపోవడం తో ఈ నెంబరు కలిగిన జీవో దేనికి సంబంధించినదో తెలిసేది కాదు. దీంతో ఇలా కూడా లాభం లేదనుకున్న సర్కారు ఏకంగా ప్రభుత్వ ఉత్తర్వులను రిజిస్టర్ చేసే GOIR సైటును మూసేసింది. దీని స్థానంలో 14 ఏళ్లకు పూర్వం అంటే 2008లో GOIR సైటు రూపకల్పనకు ముందు ఉన్న మ్యాన్యువల్ రిజిస్టర్లో ప్రభుత్వ ఉత్తర్వులను రిజిస్టర్ చేయడాన్ని ప్రవేశపెట్టింది.
ఆర్టీఐ చట్టం 2005 ప్రకారం, ప్రభుత్వ ఉత్తర్వులను ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న నిబంధనల ప్రకారం GOIR సైటును తిరిగి అందుబాటులోకి తేవాలని కొంతమంది కోర్టు మెట్లెక్కడంతో, కోర్టుల్లో ఇబ్బంది ఎదురవుతుం దనే ఉద్దేశంతో హడావిడిగా ప్రభుత్వం జీవో నెంబరు 100ని ఇష్యూ చేసి ప్రభుత్వ ఉత్తర్వులను నాలుగు కేటగిరీలుగా విభజించిం ది.
నాలుగు క్యాటగిరీలు…
టాప్ సీక్రెట్, సీక్రెట్, కాన్ఫిడెన్షియల్, రోటీన్ నేచర్ అని ప్రభుత్వం జీవో 100లో చెప్పింది. టాప్ సీక్రెట్, సీక్రెట్, కాన్ఫిడెన్షియల్ జీవోలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్లైన్లో ఉంచబోమని కూడా ఈ జీవోలోనే చెప్పింది. రోటీన్ నేచర్ ఉన్న జీవోలను వారానికొకసారి ఆర్డర్ ఇష్యూ చేసిన వారంలోపు ఏపీ ఈ - గజెట్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని, అందులో ఏమైనా అర్జెంట్ నేచర్ ఉంటే ఎక్స్ట్రార్డినరీ గజెట్లో పెడతామని చెప్పారు. అయితే, ఎక్స్ట్రార్డినరీ గజెట్ ఇప్పటివరకు ప్రజలకు అందుబాటులో ఉంచలేదు.
జీవో 100 లోనే ప్రభుత్వం చెప్పిన ఇంకొక కారణం ఏంటంటే, GOIR వెబ్సైటులో రిజిస్టర్ అవుతున్న జీవోలకు సిగ్నేచర్ లేదు కాబట్టి జీవోలను మ్యాన్యువల్ రిజిస్టర్లో నమోదు చేసి సంబంధింత సెక్షన్ అధికారితో సంతకం పెట్టించిన తర్వాత ఆ ఉత్తర్వు రొటీన్ నేచర్ అయితే ఏపీ ఈ-గజెట్లో ఆర్డర్ ఇచ్చిన వారంలోపు అప్లోడ్ చేస్తామని పేర్కొంది.
ప్రభుత్వ ఉత్తర్వులన్నీ ఆన్లైన్ రిజిస్టర్లో నమోదు కావడంతో ఉత్తర్వుల సంఖ్య ఎక్కువగా ఉండి ప్రజలు తమకు ఏ సమాచారం అవసరమో తెలుసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని అందుచేత వాళ్లకి ఏమి అవసరమో తామే నిర్ణలు ఎస్తామని వాటిని మాత్రమే ఏవే ఈ-గజెట్లో అప్లోడ్ చేస్తామని బుకాయించింది.
ఎట్టకేలకు మూడేళ్లకు పైగా చెరలో ఉన్న ప్రభుత్వ జీవోల వెబ్‌సైట్‌ను ఆగస్టు 29 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్‌లు జీవో నంబర్ 79 జారీ చేశారు.