Salaries Please : జీతాలివ్వండి మహా ప్రభో…. వేడుకుంటున్న ఉద్యోగులు….-andhra pradesh government employees request to top officials for salaries of january month ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh Government Employees Request To Top Officials For Salaries Of January Month

Salaries Please : జీతాలివ్వండి మహా ప్రభో…. వేడుకుంటున్న ఉద్యోగులు….

HT Telugu Desk HT Telugu
Feb 07, 2023 06:09 AM IST

Salaries Please ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల చెల్లింపులో గత కొద్ది నెలలుగా జాప్యం జరుగుతోంది. నిధుల అందుబాటును బట్టి వేతనాలు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు సకాలంలో జీతాలు రాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరిలో మొదటి వారం దాటుతున్నా జీతాలు రాకపోవడంతో సచివాలయ ఉద్యోగులు చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. వేతనాలు సకాలంలో చెల్లించాలని కోరారు.

ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్
ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్

Salaries Please ఫిబ్రవరి నెలలో 6 తేదీ వచ్చినా జనవరి జీతాలు చెల్లించక పోవటంపై వెలగపూడి సచివాలయ సెక్షన్ అధికారుల సంఘం ఆర్ధిక శాఖ అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించింది. ప్రతి నెల మొదటి తేదీన జీతాలు విడుదల కాకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని ఉద్యోగుల సంఘం ఫిర్యాదు చేసింది.

ట్రెండింగ్ వార్తలు

రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు త్వరితగతిన చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీ చీఫ్ సెక్రటరీ కె.ఎస్ జవహర్ రెడ్డిని కలిసి ఏపీ ఎన్జీవోల సంఘం విజ్ఞప్తి చేసింది. ఫిబ్రవరి 6 తేదీ వచ్చినా జనవరి జీతాలు చెల్లించకపోవటంపై సచివాలయంలోని సెక్షన్ అధికారుల సంఘం ఆర్ధిక శాఖ అధికారులను కలిసి వినతిపత్రం ఇచ్చింది.

సచివాలయంలోని ఆర్ధిక శాఖ, సాధారణ పరిపాలన శాఖ, అసెంబ్లీ విభాగాలకు చెందిన ఉద్యోగులకు మాత్రమే వేతనాలు చెల్లించిన ప్రభుత్వం .. మిగిలిన శాఖల ఉద్యోగులకూ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈమేరకు ఆర్ధిక శాఖ అధికారులకు సెక్షన్ ఆఫీసర్ల సంఘం వినతిపత్రాన్ని ఇచ్చింది.

మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు త్వరితగతిన చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీ సీఎస్ కె.ఎస్ జవహర్ రెడ్డిని కలిసి ఏపీ ఎన్జీవోల సంఘం విజ్ఞప్తి చేసింది. ఇప్పటి వరకూ వేతనాలు ఉద్యోగుల ఖాతాల్లో జమకాకపోవటంపై ఆందోళన నెలకొందని ఏపీ ఎన్జీఓ నేతలు సీఎస్​కు వివరించారు. ఇప్పటికే ఉద్యోగులకు రూ.2 వేల కోట్లు చెల్లించామని సీఎస్ జవహర్‌రెడ్డి వెల్లడించారు. మూడ్రోజుల్లో మరో రూ.4 వేల కోట్లు చెల్లిస్తామని సీఎస్‌ హమీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంపై గత కొద్ది నెలలుగా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వేతనాల చెల్లింపు కంటే సంక్షేమ పథకాలు, నగదు బదిలీ పథకాలకు ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుండటంతో చెల్లింపులు చేయలేని పరిస్థితి వస్తుందని చెబుతున్నరారు.

ఏపీలో ప్రతి నెలలో ఏదొక సంక్షేమ పథకాన్ని అమలు చేయడానికి, లబ్దిదారులకు నేరుగా నిధులు విడుదల చేయడానికి పెద్ద ఎత్తున నిధులను వినియోగించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఉద్యోగులకు నెలలో రెండో వారం వచ్చినా వేతనాలు చెల్లించ లేని పరిస్థితి ఉంటోంది. ఈ క్రమంలోనే ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గత నెలలో గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

ఏపీలో ఉన్న ప్రధాన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నింటికి వేతనాల చెల్లింపు వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో ఉన్నాయి. వేతనాలను సకాలంలో చెల్లింకపోతే ఏప్రిల్ నుంచి ఆందోళన తప్పదని కూడా సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

IPL_Entry_Point